Eagle 8 Days Collection: పడిపోయిన ఈగల్ కలెక్షన్స్.. 8 రోజుల రిపోర్ట్ ఇదే.. రవితేజ హిట్ కొట్టాలంటే?
Ravi Teja Eagle Day 8 Box Office Collection: రవితేజ లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ఈగల్. ఎన్నో అంచనాల నడుమ ఫిబ్రవరి 9న విడుదలైన ఈ సినిమాకు మిక్స్‌డ్ టాక్ రాగా బాక్సాఫీస్ వద్ద అంతగా ప్రభావం చూపట్లేదని తెలుస్తోంది. ఈ క్రమంలో ఈగల్ 8 రోజుల వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ కలెక్షన్ రిపోర్ట్ చూస్తే..
Eagle Movie 8 Days Collection: మాస్ మహారాజా రవితేజ, బ్యూటిఫుల్ కావ్య థాపర్ హీరోహీరోయిన్లుగా నటించిన లేటెస్ట్ హై ఓల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా ఈగల్. ఈ మూవీలో ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్, హీరో నవదీప్ ప్రధాన పాత్రలు పోషించారు. యాక్షన్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమాకు యంగ్ డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. ఎన్నో అంచనాల నడుమ ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈగల్ మూవీ.
ఇతర సినిమాల పోటీ
అయితే, విడుదలైన తొలి రోజు నుంచి మిశ్రమ స్పందన దక్కించుకుంటున్న ఈగల్ మూవీకి కలెక్షన్స్ అంతంతమాత్రంగా కలెక్ట్ అవుతున్నట్లు సమాచారం. బాక్స్ ఆఫీస్ వద్ద మొదటి వారం యావరేజ్ కలెక్షన్స్‌తో పూర్తి చేసుకున్న ఈగల్ మూవీ రెండో వారంలోకి అడుగుపెట్టింది. అయితే, రెండో వారంలో కొత్త సినిమాల పోటీ వల్ల ఈగల్‌కు థియేటర్స్ కొన్ని తగ్గిపోగా కలెక్షన్స్ పరంగా కూడా పెద్దగా గ్రోత్ చూపించలేదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
ఈగల్ 8వ రోజు కలెక్షన్స్
రవితేజ ఈగల్ మూవీకి 7వ రోజు రూ. 30 లక్షల రేంజ్‌లో షేర్ కలెక్ట్ కాగా 8వ రోజు మొత్తం మీద రూ. 24 లక్షల రేంజ్‌లో షేర్ అందుకుంది. అలాగే వరల్డ్ వైడ్‌గా 8వ రోజున ఈగల్ మూవీ రూ. 32 లక్షల షేర్ కలెక్షన్స్ సాధించింది. అంటే 8వ రోజున ఈగల్ కలెక్షన్స్ తగ్గినట్లు తెలుస్తోంది. ఇక ఈగల్ మూవీకి 8 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 14.83 కోట్ల షేర్ కలెక్షన్స్, రూ. 27.45 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు బాక్సాఫీస్ రిపోర్ట్ చెబుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో
ఆ కలెక్షన్లలో ఈగల్ మూవీకి నైజాం ఏరియా నుంచి రూ. 4.50 కోట్లు, సీడెడ్ నుంచి రూ. 1.88 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 1.69 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 1.09 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 65 లక్షలు, గుంటూరు నుంచి రూ. 1.06 కోట్లు, కృష్ణా నుంచి రూ. 71 లక్షలు, నెల్లూరులో రూ. 51 లక్షలు వసూలు అయ్యాయి. ఇలా మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో రూ. 12.09 కోట్ల షేర్, రూ. 21.70 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు లెక్కలు చెబుతున్నాయి.
ఈగల్ హిట్ కొట్టాలంటే?
అలాగే, కర్ణాటక రెస్టాఫ్ ఇండియాలో ఈగల్ మూవీకి 8 రోజుల్లో రూ. 1.30 కోట్లు, ఓవర్సీస్ నుంచి రూ. 1.44 కోట్లు కలెక్ట్ అయినట్లు సమాచారం. దీంతో ఇప్పటివరకు రవితేజ ఈగల్ మూవీకి 68 శాతం రికవరీ అయినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే బాక్సాఫీస్ వద్ద రూ. 22 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలోకి దిగిన ఈగల్ మూవీకి రూ. 14.83 కోట్లు వచ్చాయి. అంటే, ఇంకా రూ. 7.17 కోట్ల షేర్ వస్తేనే ఈగల్ మూవీ హిట్ సాధించినట్లు అవుతుంది. మరి ఈ వీకెండ్‌లో రవితేజ ఈగల్ ఎంతవరకు రికవరీ చేస్తుందో చూడాలి.
టాపిక్