Sundaram Master: ఆయన ఫొటో పెట్టుకునే షూటింగ్ స్టార్ట్ చేశాం.. సుందరం మాస్టర్ నిర్మాత కామెంట్స్-producer sudheer kumar comments on chiranjeevi at sundaram master trailer launch harsha chemudu divya sripada ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Sundaram Master: ఆయన ఫొటో పెట్టుకునే షూటింగ్ స్టార్ట్ చేశాం.. సుందరం మాస్టర్ నిర్మాత కామెంట్స్

Sundaram Master: ఆయన ఫొటో పెట్టుకునే షూటింగ్ స్టార్ట్ చేశాం.. సుందరం మాస్టర్ నిర్మాత కామెంట్స్

Sanjiv Kumar HT Telugu

Producer Sudheer Kumar About Sundaram Master: వైవా హర్ష ప్రధాన పాత్రలో నటించిన సినిమా సుందరం మాస్టర్. తాజాగా సుందరం మాస్టర్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత సుధీర్ కుమార్ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఆ వివరాల్లోకి వెళితే..

ఆయన ఫొటో పెట్టుకునే షూటింగ్ స్టార్ట్ చేశాం.. సుందరం మాస్టర్ నిర్మాత కామెంట్స్

Harsha Chemudu Sundaram Master Trailer Launch: మాస్ మహారాజా రవితేజ నిర్మిస్తున్న కొత్త చిత్రం సుందరం మాస్టర్. హర్ష చెముడు (వైవా హర్ష), దివ్య శ్రీపాద ప్రధాన పాత్రధారులుగా నటిస్తున్న ఈ సినిమాకు కళ్యాణ్ సంతోష్ దర్శకత్వం వహించారు. ఆర్‌టీ టీం వర్క్స్, గోల్డెన్ మీడియా బ్యానర్స్‌పై మాస్ మహారాజా రవితేజ, సుధీర్ కుమార్ కుర్రు చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సుందరం మాస్టర్ మూవీ ఫిబ్రవరి 23న విడుదల కానుంది.

హర్ష కోసమే పాత్ర పుట్టినట్లు

గురువారం (ఫిబ్రవరి 15) సుందరం మాస్టర్ ట్రైలర్‌ను మెగాస్టార్ చిరంజీవి విడుదల చేశారు. సుందరం మాస్టర్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో వీడియో ద్వారా చిరంజీవి మాట్లాడారు. "సుందరం మాస్టర్ ట్రైలర్ చాలా బాగుంది. హర్ష కోసమే ఈ పాత్ర పుట్టినట్టుగా ఉంది. తనకు తాను, తన టాలెంట్‌ను తాను నమ్ముకుని హర్ష ఈ స్థాయికి వచ్చాడు. ఈ రోజు హీరో స్థాయికి ఎదిగాడు. హర్షను నమ్మి నిర్మాత సుధీర్, దర్శకుడు కళ్యాణ్ సంతోష్ ఈ చిత్రాన్ని తీశారు" అని చిరంజీవి అన్నారు.

కొత్త పాయింట్‌తో మూవీ

ఆసాంతం వినోదాత్మకంగా సుందరం మాస్టర్ చిత్రం ఉంటుందని అర్థం అవుతోంది. కామెడీనే కాకుండా ఎమోషన్ కూడా ఇందులో ఉందని చెబుతున్నారు. ఇలాంటి వినూత్న ప్రయోగాలను ఆడియెన్స్ ఎప్పుడూ ఆదరిస్తారు. ఈ చిత్రం పెద్ద విజయాన్ని సాధించాలి" అని చిరంజీవి తెలిపారు. "మా లాంటి కొత్త వాళ్లని, చిన్న సినిమాను ఎంకరేజ్ చేస్తూ ట్రైలర్ రిలీజ్ చేసిన మెగాస్టార్ చిరంజీవి గారికి థాంక్స్. సుందరం మాస్టర్ సినిమా చాలా కొత్త పాయింట్‌తో రాబోతోంది" అని హర్ష చెముడు అన్నారు.

అందరినీ ఆలోచింపజేస్తుంది

"నేను ఇండస్ట్రీలోకి వచ్చి పదేళ్లు అవుతోంది. ప్రతీ సారి ఏదో కొత్తగా చేయాలని ప్రయత్నిస్తుంటాను. ఈ కథ నా దగ్గరకు వచ్చింది. నాకు నచ్చింది కాబట్టే చేశాను. నేను చేయగలిగిన పాత్రలు ఉంటే తప్పకుండా చేస్తాను. సుందరం మాస్టర్ పాత్రను చూస్తే మనలో ఒకరిని చూసినట్టుగానే అనిపిస్తుంది. ఈ చిత్రాన్ని థియేటర్‌లో చూస్తేనే మజా వస్తుంది. అందరినీ ఆలోచింపజేసే చిత్రం అవుతుంది. కామెడీనే కాకుండా అద్భుతమైన డ్రామా కూడా ఉంటుంది" అని వైవా హర్ష తెలిపారు.

చిరంజీవి అభిమానులం

"ఈ సినిమా కోసం టీం అంతా చాలా కష్టపడింది. నేచురల్ లొకేషన్‌కు వెళ్లి షూటింగ్ చేశాం. ప్రతీ పాత్రకు ఎంతో ఇంపార్టెన్స్ ఉంటుంది. మా సినిమాను ఆడియెన్స్ తప్పకుండా చూసి ఆదరించాలి" అని హర్ష చెముడు కోరారు. "రవితేజ గారితో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించాను. ఆయన సహకారం ఎప్పటికీ మరువలేను. ఆల్రెడీ సినిమాను చూశాను. మూవీ చాలా బాగా వచ్చింది. మేం అంతా మెగాస్టార్ చిరంజీవి గారి అభిమానులం. ఆయన ఫోటో పెట్టుకునే షూటింగ్ స్టార్ట్ చేశారు. ఈ రోజు ఆయన మా ట్రైలర్‌ను రిలీజ్ చేయడం ఆనందంగా ఉంది" అని నిర్మాత సుధీర్ కుమార్ చెప్పుకొచ్చారు.

డబ్బు కంటే ఎక్కువగా

"సుందరం మాస్టర్ సినిమా కోసం నేను చాలానే రీసెర్చ్ చేశాను. ట్రైబల్ విలేజ్‌‌లో అందరూ ఇంగ్లీష్ అంత ఫ్లూయెన్స్‌గా ఎలా మాట్లాడుతారు అనే దానికి ఓ కారణం ఉంటుంది. అదేంటో సినిమా చూస్తే తెలుస్తుంది. నా చుట్టూ పక్కల చూసిన మనుషుల్ని చూసే ఈ కథను రాసుకున్నాను. ప్రీ ప్రొడక్షన్‌కే చాలా టైం పట్టింది. ఈ సినిమాకు డబ్బు కంటే టైంను ఎక్కువగా పెట్టాం" అని డైరెక్టర్ కళ్యాణ్ సంతోష్ పేర్కొన్నారు.