Sundaram Master First Look : సుందరం మాస్టర్ ఫస్ట్ లుక్.. వైవా హర్ష హీరోగా రవితేజ సినిమా-ravi teja unviels the first look of sundaram master details inside ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Sundaram Master First Look : సుందరం మాస్టర్ ఫస్ట్ లుక్.. వైవా హర్ష హీరోగా రవితేజ సినిమా

Sundaram Master First Look : సుందరం మాస్టర్ ఫస్ట్ లుక్.. వైవా హర్ష హీరోగా రవితేజ సినిమా

HT Telugu Desk HT Telugu
Jun 25, 2023 01:43 PM IST

Sundaram Master First Look : సుందరం మాస్టర్ సినిమా ఫస్ట్ లుక్ ఇటీవలే విడుదలైంది. ఈ చిత్రంలో వైవా హర్ష, దివ్య శ్రీపాద జంటగా కనిపించనున్నారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ను రవితేజ విడుదల చేశారు.

సుందరం మాస్టర్ ఫస్ట్ లుక్
సుందరం మాస్టర్ ఫస్ట్ లుక్

ఆర్‌.టి.టీమ్ వ‌ర్క్స్‌, గోల్డెన్ మీడియా బ్యాన‌ర్స్‌పై రూపొందుతోన్న ఎంట‌ర్ టైన‌ర్ ‘సుందరం మాస్టార్’. ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను ఇటీవల మాస్ మహారాజా రవితేజ(Ravi Teja) విడుదల చేశారు. హ‌ర్ష చెముడు(వైవా హర్ష), దివ్య శ్రీపాద జంటగా కనిపించనున్నారు. క‌ళ్యాణ్ సంతోష్ దర్శక‌త్వంలో ర‌వితేజ‌, సుధీర్ కుమార్ కుర్రు నిర్మాత‌లుగా రూపొందుతోందీ చిత్రం.

సుందరం అనే టీచర్ చుట్టూ నడిచే కథే ఇది. తను గవర్నమెంట్ టీచర్. సోషల్ స్టడీస్ బోధిస్తుంటాడు. అయితే మిర్యాల మెట్ట అనే మారుమూల పల్లెలో ఇంగ్లీష్ టీచర్‌గా వెళ్లాల్సిన ప‌రిస్థితి వ‌స్తుంది. అందులో అన్నీ వ‌య‌సుల‌వారు ఇంగ్లీష్ నేర్చుకోవ‌టానికి విద్యార్థులుగా వ‌స్తారు. మ‌రి సుంద‌రం మాస్టార్(Sundaram Master) వారికెలా ఇంగ్లీష్‌ను బోధించారు అనే విష‌యం తెలియాలంటే సినిమా రిలీజ్ వ‌ర‌కు ఆగాల్సిందేనంటున్నారు మేక‌ర్స్‌.

సుధీర్ కుమార్ కుర్రుతో క‌లిసి మాస్ మ‌హారాజా ర‌వితేజ ఈ సినిమాను నిర్మిస్తుండ‌టం విశేషం. ఇటీవల ఈ సినిమా ఫ‌స్ట్ లుక్‌ను ర‌వితేజ విడుద‌ల చేసి చిత్ర యూనిట్‌కు అభినంద‌న‌లు తెలిపారు. శ్రీచ‌ర‌ణ్ పాకాల సంగీతం అందిస్తోన్న ఈ మూవీకి దీపక్ ఎరెగ‌డ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మ‌రిన్ని వివ‌రాల‌ను తెలియ‌జేస్తామ‌ని చిత్ర నిర్మాత‌లు తెలిపారు.

ఓ వైపు సినిమాల్లో బిజీగా ఉంటూనే మరోవైపు నిర్మాతగా ఉన్నారు రవితేజ. సుందరం మాస్టర్ సినిమాలో కూడా నిర్మాతలలో ఒకరిగా ఉన్నారు. గతంలో కూడా రావణాసుర, మట్టి కుస్తీ, చాంగురే బాగురు రాజాలాంటి సినిమాలకు నిర్మాతంగా సహకారం అందించారు. సినిమా నిర్మాణాల కోసం రవితేజ టీమ్ వర్క్స్ బ్యానర్ స్టార్ట్ చేశారు. టాలెంట్ ఉన్నవారికి, మంచి కథలతో వచ్చిన వారికి అవకాశాలు ఉంటాయని గతంలోనే చెప్పారు. ఇప్పుడు వైవా హర్ష హీరోగా.. సుందరం మాస్టర్ చిత్రానికి నిర్మాతగా వ్యవహిరిస్తున్నారు మాస్ మహారాజ్ రవితేజ.