Eagle Day 1 Collection: ఈగల్‌కు అదిరిపోయిన కలెక్షన్స్.. రజనీకాంత్ లాల్ సలామ్ కంటే ఎక్కువ.. అందులో రవితేజ టాప్-eagle day 1 worldwide box office collection 97k eagle tickets sold in past 24 hours more than rajinikanth lal salaam ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Eagle Day 1 Collection: ఈగల్‌కు అదిరిపోయిన కలెక్షన్స్.. రజనీకాంత్ లాల్ సలామ్ కంటే ఎక్కువ.. అందులో రవితేజ టాప్

Eagle Day 1 Collection: ఈగల్‌కు అదిరిపోయిన కలెక్షన్స్.. రజనీకాంత్ లాల్ సలామ్ కంటే ఎక్కువ.. అందులో రవితేజ టాప్

Sanjiv Kumar HT Telugu
Feb 10, 2024 01:29 PM IST

Ravi Teja Eagle Day 1 Box Office Collection: రవితేజ లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఈగల్. ఎన్నో అంచనాల నడుమ ఫిబ్రవరి 9న విడుదలైన ఈ సినిమాకు మిక్స్‌డ్ టాక్ వస్తోంది. ఈ నేపథ్యంలో ఈగల్ మూవీ డే 1 వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ కలెక్షన్ రిపోర్ట్ ఎలా ఉందో చూద్దాం.

ఈగల్‌కు అదిరిపోయిన కలెక్షన్స్.. రజనీకాంత్ లాల్ సలామ్ కంటే ఎక్కువ.. అందులో రవితేజ టాప్
ఈగల్‌కు అదిరిపోయిన కలెక్షన్స్.. రజనీకాంత్ లాల్ సలామ్ కంటే ఎక్కువ.. అందులో రవితేజ టాప్

Eagle Movie 1st Day Collection: మాస్ మహారాజా రవితేజ, బ్యూటిఫుల్ అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్ హీరోహీరోయిన్లుగా నటించిన లేటెస్ట్ హై ఓల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఈగల్. యంగ్ డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈగల్ మూవీ ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాలో రవితేజ యాక్షన్ బీభత్సం చేశాడని కొంతమంది అంటే.. స్టోరీ అంతగా వర్కౌట్ అవ్వలేదని మరికొంతమంది చెబుతున్నారు.

ప్రీమియర్ షో టికెట్స్

ఇలా మిక్స్‌డ్ టాక్‌ తెచ్చుకుంటున్న రవితేజ ఈగల్ మూవీకి మొదటి రోజు కలెక్షన్స్ పర్వాలేదని పిస్తోంది. ఈగల్ మూవీకి ప్రీమియర్ షోస్ ద్వారా 90K రేంజ్‌లో టికెట్స్ అమ్ముడుపోయినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అలాగే తెలుగు రాష్ట్రాల్లో రవితేజ సినిమాకు బాగానే ఓపెనింగ్ వచ్చినట్లు తెలుస్తోంది. ఈగల్ మూవీకి మొదటి రోజు రూ. 6.2 కోట్ల ఇండియా నెట్ కలెక్షన్స్ వచ్చాయి. వీటిలో తెలుగు నుంచి రూ. 6.1 కోట్లు, హిందీ నుంచి రూ. 10 లక్షలు వసూలు అయినట్లు ట్రేడ్ సంస్థలు నివేదికలు చెబుతున్నాయి.

ఈగల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్

ఇలా తొలి రోజు రూ. 6 కోట్లకుపైగా నెట్ ఇండియా కలెక్షన్స్ అందుకున్న ఈగల్ మూవీకి ప్రపంచవ్యాప్తంగా రూ. 5.48 కోట్ల షేర్ కలెక్షన్స్ వచ్చినట్లు సమాచారం. దీంతో వరల్డ్ వైడ్‌గా రూ. 11.90 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు అయ్యాయి. అయితే, సినిమాకు అతి తక్కువ రేటింగ్‌తో రివ్యూస్ వచ్చిన ఓపెనింగ్ కలెక్షన్స్ ఈ రేంజ్‌లో రావడం గొప్ప విషయంగా చెబుతున్నారు. అంతేకాకుండా వరుస ఫ్లాప్స్‌తో ఉన్న రవితేజకు ఇలాంటి ఓపెనింగ్స్ మాస్ మహారాజా క్రేజ్ ఏంటో చెబుతోంది.

ఈగల్‌కే ఎక్కువ

ఇక గత 24 గంటల్లో ఈగల్ మూవీకి 96.43K టికెట్స్ అమ్ముడుపోయినట్లు సమాచారం. ఈగల్‌తోపాటు రజనీకాంత్ సినిమా లాల్ సలామ్‌కు 76.86K టికెట్స్, గుడ్ నైట్ ఫేమ్ మణికందన్ లవర్ మూవీకి 19.88K టికెట్స్, యాత్ర 2 చిత్రానికి 11.37K టికెట్స్ గత 24 గంటల్లో సేల్ అయ్యాయి. అంటే ఫిబ్రవరి 9న పోటీకి వచ్చిన మూడు సినిమాలతో పోల్చుకుంటే రవితేజ సినిమాకే ఎక్కువ టికెట్స్ అమ్ముడుపోయాయి.

రజనీని వెనక్కి నెట్టి

అందులోనూ సూపర్ స్టార్ రజనీకాంత్‌ను వెనక్కి నెట్టి మరి తాను మాస్ మహారాజా అని నిరూపించుకున్నాడు రవితేజ. ఇక యాత్ర 2 మూవీ ఈగల్ కంటే ఒకరోజు ముందు ఫిబ్రవరి 8న విడుదల అయింది. సోలో రిలీజ్ డేట్ కోసం చూసిన ఈగల్ మేకర్స్‌కు మూడు చిత్రాలతో పోటీ ఉన్నప్పటికీ ప్రస్తుతానికి రవితేజనే టాప్‌లో ఉన్నాడు.

నవదీప్ కీ రోల్

ఇదిలా ఉంటే ఈగల్ మూవీలో హీరో నవదీప్ కీలక పాత్ర పోషించాడు. తెలుగులోని ప్రముఖ నిర్మాణ సంస్థల్లో ఒకటైన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌లో ఈగల్ సినిమాను నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరించారు. నిజానికి ఈగల్ మూవీ సంక్రాంతికి రావాల్సింది. కానీ, అప్పుడు మహేశ్ బాబు, తేజ సజ్జా, వెంకటేష్, నాగార్జున చిత్రాలు కూడా ఉండటంతో రవితేజ తప్పుకున్నాడు. పలు వాయిదాల తర్వాత ఇలా ఎట్టకేలకు శుక్రవారం (ఫిబ్రవరి 9) ప్రేక్షకుల ముందుకు ఈగల్‌గా వచ్చాడు రవితేజ.