OTT Movie: ఓటీటీకి వచ్చేసిన కాంతార హీరో మూవీ.. నేరస్థులకు అన్నం పెట్టి నిజాలు కక్కించే పోలీస్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
Laughing Buddha OTT Streaming: ఓటీటీలోకి కాంతార హీరో రిషబ్ శెట్టి నిర్మించిన కన్నడ కామెడీ మూవీ లాఫింగ్ బుద్ధ స్ట్రీమింగ్ అవుతోంది. ప్రమోద్ శెట్టి నటించిన లాఫింగ్ బుద్ధ నేరస్థులకు భోజనం పెట్టి నిజాలు కక్కించే పోలీస్ చుట్టూ తిరుగుతుంది. మరి లాఫింగ్ బుద్ధ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
OTT Comedy Movie: ఓటీటీలో ఎన్నో రకాల డిఫరెంట్ సినిమాలు వస్తూనే ఉంటాయి. క్రైమ్ సస్పెన్స్, హారర్ థ్రిల్లర్, ఫాంటసీ అడ్వెంచర్స్, కామెడీ, యాక్షన్ వంటి ఎన్నో చిత్రాలు, వెబ్ సిరీసులు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లలో అందుబాటులో ఉంటున్నాయి. ఇక ఫ్యామిలీ అంతా కలిసి చూసే ఫీల్ గుడ్ మూవీల నుంచి మైండ్ డిస్టర్బ్ అయ్యే సినిమాల వరకు విభిన్న కంటెంట్ ఓటీటీలో దర్శనమిస్తుంటుంది.
డిఫరెంట్ కామెడీ సినిమా
మనిషి మాంసానికి రుచి మరిగిన డాక్టర్, భార్య శవంతో బిర్యానీ వండిన పోలీస్, పిల్లలను కిడ్నాప్ చేసి అవయవాలు అమ్మి, మాంసం తినే క్రిమినల్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎవరు ఊహించని కాన్సెప్ట్‌తో సినిమాలు, వెబ్ సిరీసులు తెరకెక్కుతున్నాయి. దాదాపుగా ఇలాంటి టైప్ కంటెంట్‌తో వచ్చిన మరో డిఫరెంట్ కామెడీ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.
కడుపు నిండా అన్నం పెట్టి
ఆ సినిమానే లాఫింగ్ బుద్ధ. సాధారణంగా క్రిమినల్స్‌ను టార్చర్ పెట్టో, థర్డ్ డిగ్రీ ఉపయోగించో లేదా సైకలాజికల్‌గా దెబ్బ తీసో నిజాలు రాబడుతుంటారు పోలీసులు. కానీ, లాఫింగ్ బుద్ధ సినిమాలో మాత్రం నేరస్థులకు కడుపు నిండా అన్నం పెట్టి నిజాలు కక్కిస్తాడు ఓ పోలీస్. ఆ పోలీస్ చుట్టూ తిరిగే కన్నడ కామెడీ డ్రామా చిత్రమే లాఫింగ్ బుద్ద.
8.5 ఐఎమ్‌డీబీ రేటింగ్
లాఫింగ్ బుద్ద సినిమాను కన్నడ స్టార్ హీరో, కాంతార ఫేమ్ రిషబ్ శెట్టి నిర్మించాడు. దాంతో ఈ సినిమాపై మంచి బజ్ ఏర్పడింది. దానికి తగినట్లుగానే థియేటర్లలో విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఆగస్ట్ 30న కన్నడలో రిలీజైన లాఫింగ్ బుద్ధ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. అంతేకాకుండా ఈ చిత్రానికి ఐఎమ్‌డీబీ నుంచి 8.5 రేటింగ్ ఉండటం విశేషం.
లాఫింగ్ బుద్ధ ఓటీటీ
ఈ రేటింగ్‌ను బట్టే అర్థం చేసుకోవచ్చు లాఫింగ్ బుద్ధ ఎంతటి క్రేజీ సినిమానో. ఇలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన లాఫింగ్ బుద్ధ ప్రస్తుతం ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. అమెజాన్ ప్రైమ్‌లో లాఫింగ్ బుద్ధ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. అయితే, ప్రస్తుతానికి లాఫింగ్ బుద్ధ కన్నడలో మాత్రం ఓటీటీలో అందుబాటులో ఉంది. త్వరలో దీన్ని తెలుగులోకి తీసుకొచ్చే అవకాశం ఉంది.
లాఫింగ్ బుద్ధ రన్ టైమ్
ఇకపోతే కేఆర్‌జీ స్టూడియోస్ బ్యానర్‌పై రిషబ్ శెట్టి నిర్మించిన లాఫింగ్ బుద్ధ చిత్రానికి భరత్ రాజ్ దర్శకత్వం వహించారు. సంగీతం విష్ణు విజయ్ అందించగా.. ఎస్ చంద్రశేఖరన్ సినిమాటోగ్రఫర్‌గా వర్క్ చేశారు. ఇక 2 గంటల 13 నిమిషాల రన్ టైమ్ ఉన్న లాఫింగ్ బుద్ధ మూవీలో ప్రమోద్ శెట్టి మెయిన్ లీడ్ రోల్ ప్లే చేశాడు. ఆయనతోపాటు తేజు బెలవాడి, దిగ్‌నాథ్, సుందర్ రాజ్, ఎస్‌కే ఉమేశ్ కీలక పాత్రలు పోషించారు.
సబ్ టైటిల్స్‌తో
డిఫరెంట్ కంటెంట్ చూడాలనుకునేవారికి, భాషతో సంబంధం లేదు ఇంగ్లీష్ సబ్ టైటిల్స్‌తో మ్యానేజ్ చేద్దామనుకునేవారు లాఫింగ్ బుద్ధ చిత్రాన్ని ఎంచక్కా చూసి ఎంజాయ్ చేయొచ్చు. కాగా, రిషబ్ శెట్టి కాంతార మూవీతో తెలుగు ప్రేక్షకుల్లో మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు. ఇప్పుడు ఆయన కాంతారకు ప్రీక్వెల్ తెరకెక్కించే పనిలో ఉన్నట్లు సమాచారం.