Horror Thriller: ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ మూవీ - ఐఎమ్‌డీబీలో 10కి 9.1 రేటింగ్ - ట్విస్ట్‌లు మామూలుగా ఉండవు
Horror Thriller: నాజర్ ప్రధాన పాత్రలో నటించిన కోలీవుడ్ మూవీ ది అకాలి ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ హారర్ హారర్ థ్రిల్లర్ మూవీ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది.
Horror Thriller: నాజర్ లీడ్‌రోల్‌లో నటించిన కోలీవుడ్ హారర్ థ్రిల్లర్ మూవీ ది అకాలి ఓటీటీలోకి వస్తోంది. జూలై 19 (శుక్రవారం నుంచి) ఆహా తమిళ్ ఓటీటీలో ఈ సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ ఏడాది మే నెలలో థియేటర్లలో రిలీజైన ఈ మూవీ విమర్శకుల ప్రశంసలను అందుకున్నది. కథ, కథనాలతో పాటు సినిమాలోని ట్విస్ట్‌లు, నాజర్ పర్ఫార్మెన్స్‌పై బాగుందంటూ క్రిటిక్స్ అభినందించారు.
మల్టీజోనర్ మూవీ...
సరైన ప్రమోషన్స్ లేకపోవడంతో ఈ సినిమా రిలీజైన విషయం కూడా ఆడియెన్స్‌కు తెలియలేదు.మల్టీపుల్ జానర్ మూవీగా దర్శకుడు మహమ్మద్ ఆసీఫ్ హమీద్ ఈ మూవీని తెరకెక్కించాడు. క్రైమ్ థ్రిల్లర్ కు సూపర్ నాచరల్ హారర్ అంశాలను జోడించి తెరకెక్కిన ఈ మూవీలో నాజర్ కీలక పాత్ర పోషించాడు. తలైవాసల్ విజయ్, జయకుమార్ జానకిరామన్, వినోద్ కిషన్ ప్రధాన పాత్రల్లో నటించారు.
ది అకాలి మూవీ కథ ఇదే...
జానిస్ అనే అమ్మాయి క్షుద్రవిద్యలు, అతీంద్రియ శక్తుల సహాయంతో వరుసగా హత్యలకు పాల్పడుతుంది. ఈ హత్యల వెనుక ఉన్న మిస్టరీని ఛేదించేందుకు హమ్జా అనే పోలీస్ ఆఫీసర్ ఎంట్రీ ఇస్తాడు. ఒక్కో ఆధారాన్ని సేకరించే క్రమంలో అతడు తెలుసుకున్న షాకింగ్ నిజాలేమిటి? జానిస్ మనుషుల నుంచి హమ్జా కాపాడిన అనిత ఎవరు? అనిత ఎందుకు వింతగా ప్రవర్తించింది? జానిస్ పూజలను హమ్జా ఎలా అడ్డుకున్నాడు? ఆమెనే ఈ హత్యలకు పాల్పడుతుందా? జానిస్‌కు వెనక ఎవరైనా ఉన్నారా అన్నదే ఈ మూవీ కథ.
ఐఎమ్‌డీబీ రేటింగ్
కామెడీ, కమర్షియల్ ట్రాక్‌ల జోలికి పోకుండా సీరియస్ డార్క్ హారర్ థ్రిల్లర్‌గా దర్శకుడు ది అకాలి మూవీని తెరకెక్కించాడు. ఐఎమ్‌డీబీలో ఈ మూవీ పదికి 9.1 రేటింగ్‌ను దక్కించుకున్నది. చాలా కాలం తర్వాత నాజర్ లీడ్ రోల్‌లో నటించిన మూవీ ఇది. కాన్సెప్ట్ బాగున్నా పాయింట్‌ను కన్ఫ్యూజన్ లేకుండా ఆడియెన్స్‌కు చెప్పడంలో దర్శకుడు కాస్తంత తడబడ్డాడు. బడ్జెట్ పరిమితులు కూడా ఈ సినిమాకు మైనస్‌గా మారాయి.
నాజర్ బిజీ బిజీ...
దక్షిణాదిలో మోస్ట్ బిజీయెస్ట్ యాక్టర్‌గా నాజర్ కొనసాగుతోన్నాడు. గత ఏడాది ఏకంగా తెలుగు, తమిళ భాషల్లో కలిపి 12 సినిమాలు చేశాడు నాజర్. తెలుగులో చిరంజీవి వాల్తేర్ వీరయ్య, గాంఢీవదారి అర్జున, మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టితో పాటు పలు సినిమాల్లో డిఫరెంట్ క్యారెక్టర్స్ చేశాడు. ప్రస్తుతం రామ్ చరణ్, శంకర్ కాంబోలో తెరకెక్కుతోన్న గేమ్ ఛేంజర్‌లో నాజర్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు.