Guppedantha Manasu November 17th Episode: రిషికి మాటిచ్చిన మహేంద్ర - మంచివాడిగా మారిన శైలేంద్ర - ధరణి కన్ఫ్యూజన్!
Guppedantha Manasu November 17th Episode: జగతి జ్ఞాపకాలతో మహేంద్ర మందుకు బానిసగా మారడం రిషి సహించలేకపోతాడు. ఇకపై ఎప్పుడు తాననని తనపై ఒట్టు వేయమని అంటాడు.ఆ తర్వాత నేటి గుప్పెడంత మనసు సీరియల్‌లో ఏం జరిగిందంటే...

Guppedantha Manasu November 17th Episode: జగతి చావుకు కారణం ఎవరో తెలుసుకోవాలని ఫిక్స్ అవుతుంది. ఆ సీక్రెట్ కనిపెట్టడానికి బయలుదేరుతుంది. మళ్లీ అనుపమ ఇంట్లో నుంచి వెళ్లిపోవడానికి సిద్ధపడటంతో విశ్వనాథం కంగారుపడతాడు. ఆమెను తనతో పాటే ఉండమని కోరుతాడు. పని పూర్తిచేసుకొని మళ్లీ తిరిగొస్తానని తండ్రికి మాటిస్తుంది అనుపమ. ఎందుకు వెళుతున్నానన్నది మాత్రమే తనకు తెలుసునని, కానీ ఎక్కడ ఉండాలన్నది మాత్రం తనకు తెలియదని విశ్వనాథంతో చెబుతుంది అనుపమ.
ఏంజెల్ తోడు...
ఏంజెల్‌ను తోడుగా తీసుకెళ్లమని అనుపమను కోరుతాడు విశ్వనాథం. జీవితంలోనే తాను ఒంటరిగానే మిగిలిపోయానని, ఇప్పుడు ఒంటరిగానే ప్రయాణం చేస్తానని చెబుతుంది. అనుపమ వెంట తాను వస్తానని ఏంజెల్ పట్టుపడుతుంది. కానీ అనుపమ వద్దని అంటుంది. ఏంజెల్‌కు నీ బుద్దులే వస్తున్నాయని అనుపమతో అంటాడు విశ్వనాథం. నీ జీవితం నాలా ఒంటరిగా మిగిలిపోకూడదని ఏంజెల్‌కు సలహా ఇస్తుంది అనుపమ.
శైలేంద్ర ప్రేమ...
శైలేంద్ర బట్టలను ఐరన్ చేస్తుంటుంది ధరణి. ఆమె వద్దకు కాఫీ కప్‌తో ఎంట్రీ ఇస్తాడు శైలేంద్ర. ఇక నుంచి ఇంటి పనులు అన్ని నువ్వే చేయాల్సిన అవసరం లేదు అంటూ ప్రేమను కురిపిస్తాడు. ధరణి కోసం కాఫీ తీసుకొస్తాడు. ఇకపై నిన్ను కష్టపెట్టకూడదని డిసైడ్ అయ్యాను. ప్రేమగా చూసుకోవాలని అనుకుంటున్నానని ధరణితో అంటాడు శైలేంద్ర. సడెన్‌గా భర్తకు తనపై ప్రేమ కలగడంతో ధరణి షాక్ అవుతుంది.
మార్పు వెనుక కుట్ర...
శైలేంద్ర మార్పు వెనుక ఏదో ఒక కుట్ర ఉండి ఉంటుందని అనుమానపడుతుంది. ధరణి ఆలోచనలను శైలేంద్ర కనిపెడతాడు. తండ్రి ఫణీంద్ర అన్న మాటలు నన్ను కలిచివేశాయని, ఇన్నాళ్లు నిన్ను ఎంతో బాధపెట్టానో అర్థమైందని తండ్రి మాటలతో అర్థమైందని ధరణితో అంటాడు శైలేంద్ర.ఇకపై నిన్ను కసురుకోను...ఒక్క మాట కూడా అననని అంటాడు.
నిన్ను మా అమ్మ తిట్టినా సహించలేనని చెబుతాడు. నీతో పాటు ఎంతో మందికి అన్యాయం చేశానని, అవన్నీ తన మనసును కలిచివేస్తున్నాయని ధరణితో అంటాడు శైలేంద్ర. శైలేంద్ర నిజంగా మారిపోయాడో లేదో అర్థం కానీ కన్ఫ్యూజన్‌లో పడుతుంది ధరణి. మీరు మాట్లాడుతుంది నిజమేనా అని భర్తను అడుగుతుంది. అక్కడే ఉన్న ఫణీంద్ర..కొడుకులో వచ్చిన మార్పు చూసి ఆనందపడతాడు. నువ్వు ఇలాగే ధరణితో సంతోషంగా ఉండాలి అని సలహా ఇస్తాడు.
ఇక నుంచి ధరణి సంతోషాలు, భాదలు పంచుకోవాలి, తనపై పెత్తనం చెలాయించకుండా గౌరవించాలని శైలేంద్రకు సలహా ఇస్తాడు ఫణీంద్ర. శైలేంద్ర ఆడుతుంది నాటకం అని ఫణీంద్ర గ్రహించలేకపోతాడు.
దేవయాని పోటీ...
శైలేంద్ర యాక్టింగ్ చూసి దేవయాని కంగారు పడుతుంది. తన కొడుకు నిజంగానే మారిపోయాడా అని కలవరపడుతుంది. కొడుకుకు పోటీగా తాను యాక్టింగ్ చేయడం మొదలుపెడుతుంది. జగతి చావు వెనుక మీ ప్రమేయం ఉందా అని భర్త అన్న మాటలకు హర్ట్ అవుతున్నట్లుగా నటిస్తుంది.
ఆ మాటలు విని తన గుండె తట్టుకోలేకపోయిందని బాధపడుతుంది. తమపై ఫణీంద్రలో మొదలైన అనుమానాల్ని పోగోట్టడానికి శైలేంద్ర, దేవయాని పోటీపడి నటిస్తారు. వారి నటనను ఫణీంద్ర నిజమని నమ్ముతాడు. శైలేంద్ర మారిపోయాడని, నువ్వు కూడా మారిపోవడానికి ప్రయత్నించమని దేవయానితో పాటు ఫణీంద్ర.
మహేంద్ర బాధ...
జగతిని నువ్వే చంపావు, నీ వల్లే ఆమె చనిపోయిందని అనుపమ తనను అడిగిన ప్రశ్నలను మహేంద్ర తట్టుకోలేకపోతాడు.బతికి ఉన్నన్నాళ్లు జగతిని దూరం పెట్టావు...చనిపోయిన తర్వాత ఆమెను మర్చిపోలేకపోతున్నానని నాటకం ఆడుతున్నావా అంటూ మహేంద్రపై ఫైర్ అవుతుంది అనుపమ. ఆమె అడిగిన ప్రశ్నలు పదే పదే గుర్తుకురావడంతో బాధలో మునుగుతాడు మహేంద్ర.
ఆ బాధను మర్చిపోవాలంటే తాగడం ఒక్కటే పరిష్కారమని అనుకుంటాడు మందుబాటిల్ ఓపెన్ చేస్తాడు. కానీ రిషి వచ్చి మహేంద్రను తాగకుండా ఆపుతాడు. తాగనని అన్నారు...మళ్లీ ఇదేమిటని అడుగాడు. ఆ క్షణం తాగకూడదని అనిపించింది. ఇప్పుడు తాగాలని అనిపిస్తుందని అంటాడు.
రిషి సెంటిమెంట్...
ఒకవైపు జగతి చనిపోయిందనే బాధ...మరోవైపు కొన్ని చూపులు, ప్రశ్నలు తనను బాధిస్తున్నాయని రిషికి బదులిస్తాడు మహేంద్ర. అనుపమ గురించి ఆలోచించి మీరు ఎక్కువగా తాగుతున్నారని మహేంద్రతో అంటాడు రిషి. అనుపమ మాత్రమే కాదు ఎవరూ జగతిని గుర్తుచేసినా తాను తట్టుకోలేకపోతున్నానని మహేంద్ర ఎమోషనల్ అవుతాడు. ఆమె లేదనే వాస్తవాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని బాధపడతాడు. చనిపోయిన అమ్మ గుర్తొస్తుంది కానీ బతికున్న నేను గుర్తుకురావడం లేదా అంటూ సెంటిమెంట్ డైలాగ్ కొడతాడు రిషి. మీ కోసం ఏదైనా చేసే మీ రిషిని నేను అని మహేంద్రతో అంటాడు రిషి. మీ అనందం కోసమే ఇరవై ఏళ్లు మీకు దూరంగా ఉన్న అమ్మను ఇంటికి పిలిచాను. కనీసం ఆ కృతజ్ఞత కోసమైనా నా గురించి ఆలోచించి ఈ తాగడం మానేయమని తండ్రిని రిక్వెస్ట్ చేస్తాడు రిషి.అమ్మ కోసం ఇలా తాగి ఆరోగ్యం పాడుచేసుకోవద్దని సలహా ఇస్తాడు.
జగతి జ్ఞాపకాలు...
మీ అమ్మ వట్టి జ్ఞాపకం కాదు. తన జ్ఞాపకాలు నన్ను కాల్చుతూనే ఉంటాయని కొడుకుతో చెబుతాడు మహేంద్ర. ఇరవై ఏళ్లు దూరంగా ఉన్నా తను క్షేమంగా ఉందన్న భరోసా, ఏ నాటికైనా కలుస్తామనే ఆశ ఉండేదని మహేంద్ర కన్నీళ్లు పెట్టుకుంటాడు. ఇప్పుడు ఆ ఆశ, భరోసా లేవని, తన కళ్ల ముందే జగతి బూడిదైపోవడం చూశానని ఎమోషనల్ అవుతాడు. అవన్నీ భరించలేకపోతున్నానని, వాటిని తట్టుకోలేకే తాగుతున్నానని అంటాడు. రిషి చేతిలోని మందు బాటిల్ లాక్కుంటాడు మహేంద్ర. తాగడానికి సిద్ధమవుతాడు.
కలల్ని ఆశయాల్ని...
మీరు తాగుతున్నది రిషి ఆయుష్షు అని గుర్తుపెట్టుకొండి. మా కలల్ని, ఆశయాల్ని కూడా మీరు దూరం చేస్తున్నారని గుర్తుపెట్టుకొండి. మీరు తాగడం వల్ల మా ఆనందం దూరమైపోతుంది. మా జీవితం మాకు కాకుండా పోతుంది. మేము సంతోషంగా బతకాలని మీరు అనుకుంటారు. కానీ మీరు తాగితే మేము ఆనందంగా ఉండలేమని మహేంద్రతో చెబుతాడు రిషి. మీకు ఒక్కరికేనా బాధ నేను పడలేదా. చిన్నతనంలోనే తల్లికి దూరమైనా నేను ఏ చెడు అలవాట్లు నేర్చుకోలేదు అని చెబుతాడు. బాధను ఒంటరితనంతో అనుభవించడం నేర్చుకున్నవాడే జీవితంలో పైకి వస్తాడని మీరే నాకు నేర్పారు. ఇప్పుడా ఆ పాట నేను మీకు నేర్పాల్సివస్తుందని అంటాడు.
కొడుకుకు మాటిచ్చిన మహేంద్ర...
మీకు దూరమైంది భార్య....నాకు దూరమైంది అమ్మ. మరి నేనెలా భరిస్తున్నానని తండ్రిని నిలదీస్తాడు రిషి. అమ్మ కోరిక తీర్చడం కోసం పెళ్లి కూడా చేసుకున్నానని అంటాడు. అమ్మ దూరమైందనే బాధలో నేను కూడా తాగాలా అని తండ్రిని ప్రశ్నిస్తాడు. బాధకు మందు తాగడం పరిష్కారం కాదని మహేంద్రకు సూచిస్తాడు రిషి. తాగనని నా మీద ఒట్టు వేయమని తండ్రితో అంటాడు రిషి. కొడుకు మాటలతో మహేంద్ర రియలైజ్ అవుతాడు. ఇక ఎప్పుడు తాగనని కొడుకుకు మాటిస్తాడు మహేంద్ర. కాలేజీకి రెగ్యులర్‌గా వెళ్లామని, మునుపటి మహేంద్రలా ఉండాలని తండ్రిని రిక్వెస్ట్ చేస్తాడు రిషి. వసుధార కూడా బతిమిలాడటంతో మహేంద్ర ఒప్పుకుంటాడు. అక్కడితో నేటి గుప్పెడంత మనసు సీరియల్ ముగిసింది.
టాపిక్