తెలుగు న్యూస్ / ఫోటో /
Rashmika Mandanna: రష్మిక మందన్న కోలీవుడ్ మూవీకి నాగార్జున డిజాస్టర్ టైటిల్ ఫిక్స్!
దక్షిణాదితో పాటు బాలీవుడ్‌లో పలు భారీ బడ్జెట్ సినిమాలు చేస్తోంది రష్మిక మందన్న. ప్రస్తుతం నాలుగు పాన్ ఇండియన్ మూవీస్‌లో నటిస్తూ బిజీగా ఉన్న ఈ బ్యూటీ కోలీవుడ్‌లో మరో సినిమాకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.
(1 / 5)
డాన్ హిట్ తర్వాత హీరో శివకార్తికేయన్, డైరెక్టర్ సిబి చక్రవర్తి కాంబోలో తమిళంలో మరో మూవీ రానున్నట్లు ప్రచారం జరుగుతోంది.
(2 / 5)
యాక్షన్ కామెడీ కథాంశంతో రూపొందనున్న ఈ సినిమాకు బాస్ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
(3 / 5)
ఈ కోలీవుడ్ మూవీలో శివకార్తికేయన్‌కు జోడీగా రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
(4 / 5)
గతంలో బాస్ పేరుతో తెలుగులో నాగార్జున ఓ సినిమా చేశాడు. నయనతార, శ్రియా హీరోయిన్లుగా నటించిన ఈ మూవీ డిజాస్టర్ అయ్యింది.
ఇతర గ్యాలరీలు