OTT Review : మనుషులను పీక్కుతునే జాంబీలు ఆలోచిస్తే.. మైండ్ బ్లాక్ ట్విస్టులు.. ఓటీటీ కొరియన్ హారర్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?-all of us are dead review in telugu ott korean horror thriller all of us are dead ott streaming on netflix ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Review : మనుషులను పీక్కుతునే జాంబీలు ఆలోచిస్తే.. మైండ్ బ్లాక్ ట్విస్టులు.. ఓటీటీ కొరియన్ హారర్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?

OTT Review : మనుషులను పీక్కుతునే జాంబీలు ఆలోచిస్తే.. మైండ్ బ్లాక్ ట్విస్టులు.. ఓటీటీ కొరియన్ హారర్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?

Sanjiv Kumar HT Telugu
Oct 10, 2024 08:13 AM IST

All Of Us Are Dead Review In Telugu: ఓటీటీ కొరియన్ హారర్ సర్వైవల్ థ్రిల్లర్స్‌ వెబ్ సిరీస్ ఆల్ ఆఫ్ అజ్ ఆర్ డెడ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. జాంబీ వైరస్ సోకిన వాళ్లు మనుషుల్లో ఆలోచిస్తే అనే డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఈ సిరీస్‌ను తెరకెక్కించారు. జాంబీ జోనర్ ఆల్ అఫ్ అజ్ ఆర్ డెడ్‌ రివ్యూ చూస్తే..

ఓటీటీ హారర్ థ్రిల్లర్ ఆల్ ఆఫ్ అజ్ ఆర్ డెడ్ రివ్యూ
ఓటీటీ హారర్ థ్రిల్లర్ ఆల్ ఆఫ్ అజ్ ఆర్ డెడ్ రివ్యూ

టైటిల్: ఆల్ అఫ్ అజ్ ఆర్ డెడ్ (కొరియన్ వెబ్ సిరీస్)

నటీనటులు: పార్క్ సోలమన్, పార్క్ జి-హు, యూన్ చాన్-యంగ్, చో యి హ్యూన్, హా సీయుంగ్-లీ, యూ ఇన్-సూ, సాన్ సంగ్-యేన్ తదితరులు

దర్శకత్వం: లీ జే-క్యూ, కిమ్ నామ్-సు

సంగీతం: మౌగ్ (లీ సంగ్-హ్యూన్)

సినిమాటోగ్రఫీ: పార్క్ సే-సియాంగ్

ఓటీటీ ప్లాట్‌ఫామ్: నెట్‌ఫ్లిక్స్

ఎపిసోడ్: 12 (ఒక్కో ఎపిసోడ్ నిడివి సుమారు గంట)

All Of Us Are Dead Review And Rating In Telugu: వరల్డ్ వైడ్‌గా కొరియన్ సినిమాలు, వెబ్ సిరీసులకు ఫుల్ క్రేజ్ ఉంటుంది. ముఖ్యంగా కొరియన్ లవ్, రొమాంటిక్, హారర్, సస్పెన్స్ థ్రిల్లర్స్‌ను ఎక్కువగా ఇష్టపడుతోంది నేటి యూత్. ఇక సర్వైవల్ థ్రిల్లర్స్‌లో జాంబీల నేపథ్యంలో వచ్చే సినిమాలు సూపర్బ్ రెస్పాన్స్ అందుకున్నాయి.

వాటిలో ముఖ్యంగా ట్రైన్ టు బూసాన్, వాకింగ్ డెడ్, రెసిడెంట్ ఈవిల్ ఫ్రాంచైజీలు, లాస్ట్ అఫ్ అజ్ సిరీస్ ఇతర సినిమాలు చాలా వరకు పాపులర్ అయ్యాయి. వీటితోపాటు 2022లో డైరెక్ట్ ఓటీటీలోకి జాంబీ నేపథ్యంలో వచ్చిన కొరియన్ హారర్ సర్వైవల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఆల్ అఫ్ అజ్ ఆర్ డెడ్. ఐఎమ్‌డీబీ నుంచి 7.5 రేటింగ్ అందుకున్న ఆల్ అఫ్ అజ్ ఆర్ డెడ్ నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో ఆల్ అఫ్ అజ్ ఆర్ డెడ్ రివ్యూలో చూద్దాం.

కథ:

ఓ హై స్కూల్ విద్యార్థులు అంతా చేరి ఒక అమాయకపు స్టూడెంట్‌ను ర్యాగింగ్ చేస్తూ కొడతారు. అప్పుడు అతని సడెన్‌గా జాంబీగా మారిపోతాడు. తనను కొడుతున్న స్టూడెంట్స్‌పైకి కోపంగా వెళ్లే క్రమంలో బిల్డింగ్ నుంచి కిందపడిపోతాడు. అతన్ని తీసుకుని ఒకతను వెళ్లిపోతాడు. కట్ చేస్తే.. స్కూల్‌లో జాంబీ వైరస్ స్పెడ్ అయి క్షణాల్లో విద్యార్థులంతా జాంబీలుగా మారిపోతారు. ఇతర మనుషులను పీక్కుతుంటూ ఉంటారు.

ఈ జాంబీ అపోకలిప్స్ నుంచి కొంతమంది విద్యార్థులు తప్పించుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. మరి ఆ జాంబీల బారి నుంచి విద్యార్థులు ప్రాణాలతో బయటపడ్డారా? జాంబీగా మారిన విద్యార్థిని తీసుకెళ్లింది ఎవరు? అసలు స్కూల్‌లోకి జాంబీ వైరస్ ఎలా వచ్చింది? దానికి కారణం ఎవరు? స్కూల్‌లో విద్యార్థులు ఏం కనుగొన్నారు? ఆ స్కూల్‌ను, సిటీని, దేశాన్ని కాపాడేందుకు ప్రభుత్వం ఏం చేసింది? ఎలాంటి చర్యలు చేపట్టింది? చివరికి వైరస్‌ను అంతమొందించారా? అనేది తెలియాలంటే కచ్చితంగా ఆల్ అఫ్ అజ్ ఆర్ డెడ్ నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో చూడాల్సిందే.

విశ్లేషణ:

సాధారణంగా జాంబీల నేపథ్యంలో వచ్చే సినిమాలు, వెబ్ సిరీసుల స్టోరీలు అన్ని రెగ్యులర్ ఫార్మాట్‌లో ఉంటాయి. ఓ సైంటిస్ట్ చేసే పిచ్చిపనికి, లేదా పొల్యూషన్, ఇతర కారణాలతో జాంబీ వైరస్ పురుడు పోసుకుని మానవాళిని నాశనం చేస్తుంటుంది. దాన్ని ఎదుర్కుంట బతికేందుకు కొంతమంది ప్రయత్నిస్తే.. మరికొంతమంది దాన్ని అంతమొందించడానికి ట్రై చేస్తుంటారు.

దాదాపుగా ఇలాంటి నేపథ్యంతోనే ఆల్ అఫ్ అజ్ ఆర్ డెడ్ స్టోరీ ఉంటుంది. కానీ, థ్రిల్లింగ్ టేకింగ్, సిరీసులో ఊహకందని ట్విస్టులు, ఎమోషన్స్, యాక్షన్ సీక్వెన్స్, హారర్ ఎలిమెంట్స్, గ్రిప్పింగ్ సీన్స్‌తో ఎక్కడా బోర్ కొట్టదు. హింసించే చెడ్డవారి నుంచి తన కొడుకును కాపాడుకునేందుకు స్కూల్ ప్రొఫెసర్ చేసే ప్రయత్నం విఫలం కావడంతోనే సిరీస్ ప్రారంభం అవుతోంది.

ఎమోషనల్-హారర్

ఇది మిగతా జాంబీ స్టోరీస్‌తో పోల్చుకుంటే ఎమోషన్‌కు కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. జాంబీ వైరస్ నుంచి కొడుకును, భార్యను కాపాడేందుకు ఆ తండ్రి చేసే ప్రయత్నాలు ఎమోషనల్‌గా ఉంటూనే భయపెడతాయి. ఇక స్కూల్‌లో వైరస్ సోకడంతో కథ మరింత ఊపందుకుంటుంది. సాధారణంగా జాంబీలుగా మారితే వారి నుంచి బయటపడటం ప్రతి జోనర్‌లో చూపించేదే.

కానీ, ఎలాంటి ఆయుధాలు లేకుండా జాంబీలతో విద్యార్థులు పోరాడే సీన్స్ కట్టిపడేస్తాయి. సాధారణంగా వాసన, స్పర్ష, ధ్వనితో మనుషులను జాంబీలు పసిగడతాయని ఇదివరకు ఈ టైప్ జోనర్స్ చూసినవారికి తెలిసిన విషయమే. ఈ సిరీస్‌లో మాత్రం జాంబీలుగా మారిన తర్వాత కూడా వచ్చే ట్విస్ట్ మైండ్ బ్లాక్ చేయడం పక్కా.

మైండ్ బ్లాక్ ట్విస్టులు

జాంబీలు కూడా మనుషుల్లా ఆలోచించే సరికొత్త కాన్సెప్ట్, దాని నుంచి బయటపడే తీరును అద్భుతంగా తెరకెక్కించారు. స్కూల్‌ విద్యార్థుల్లో వారిలో ఉండే మనస్పర్థలు, అసూయ, ఎఫైర్స్, మదర్ సెంటిమెంట్ ఇలా ప్రతి క్యారెక్టర్‌కు ఓ స్టోరీ, ఓ ఇంపార్టెన్స్‌తో ఆద్యంతం ఆసక్తి కలిగేలా చేసేలా తీర్చిదిద్దారు. యాక్షన్ సీన్స్‌తోపాటు వచ్చే ఎమోషనల్ సన్నివేశాలకు కచ్చితంగా కనెక్ట్ కావాల్సిందే.

ఇక సీరిస్‌కు పర్ఫెక్ట్‌గా సరిపోయే బీజీఎమ్, సినిమాటోగ్రఫీ, విజవల్స్, భయానక సన్నివేశాలు అన్ని ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా నటీనటుల యాక్టింగ్‌ మెస్మరైజ్ చేస్తాయి. రౌడీ స్టూడెంట్‌గా, విలన్ జాంబీగా చేసిన యూన్ చాన్-యంగ్ "నువ్ మనిషివా మానవ మృగానివా" అనేంతలా జీవించేశాడు. క్లైమాక్స్ కూడా చాలా బాగా ఆకట్టుకుంటుంది. చాలా వరకు ఊహించని ట్విస్టులు, మలుపులతో ఆసక్తి కలిగించేలా సిరీస్‌ను వదిలారు.

ఒక్క ఎపిసోడ్ చూస్తే..

ఫైనల్‌గా చెప్పాలంటే కొరియన్ థ్రిల్లర్స్, జాంబీ జోనర్ సినిమాలు ఇష్టపడేవారికి ఆల్ అఫ్ అజ్ ఆర్ డెడ్ వెబ్ సిరీస్ కచ్చితంగా ఒక డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. ఈ వెబ్ సిరీస్‌‌లో గంటకు తక్కువ కాకుండా మొత్తం 12 ఎపిసోడ్స్‌ ఉన్నాయి. ఒక్క ఎపిసోడ్ చూడటం స్టార్ట్ చేస్తే అన్ని పూర్తి చేసేవరకు వదలరు.

ఈ వెబ్ సిరీస్‌ను కొన్ని చోట్ల ముద్దు సీన్స్ మినహాయిస్తే ఫ్యామిలీతో హ్యాపీగా చూసేయొచ్చు. కానీ, ఇంగ్లీష్, కొరియన్ ఇతర ఇంటర్నేషనల్ అన్ని భాషల్లో అందుబాటులో ఉన్న ఆల్ అఫ్ అజ్ ఆర్ డెడ్ నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో తెలుగు స్ట్రీమింగ్ మాత్రం లేదు.

రేటింగ్: 3.5/5

Whats_app_banner