OTT Upcoming Korean Dramas: ఈ నెల ఓటీటీల్లోకి రాబోతున్న టాప్ కొరియన్ డ్రామాస్ ఇవే.. ఎక్కడ చూడాలంటే?
OTT Upcoming Korean Dramas: ఓటీటీల్లోకి ఈ నెలలో కొన్ని ఇంట్రెస్టింగ్ కొరియన్ డ్రామాస్ రాబోతున్నాయి. వీటిలో థ్రిల్లర్స్, రొమాన్స్, ఫ్యామిలీ డ్రామా.. ఇలా అన్ని జానర్ల మూవీస్, వెబ్ సిరీస్ ఉన్నాయి. మరి వీటిని ఎక్కడ చూడాలో తెలుసుకోండి.
OTT Upcoming Korean Dramas: కొరియన్ డ్రామాస్ కు ఇండియాలో మంచి ఫాలోయింగ్ ఉంటోంది. ముఖ్యంగా ఓటీటీలు వచ్చిన తర్వాత వీటిని సబ్ టైటిల్స్ తోనూ చూసే వాళ్ల సంఖ్య పెరిగింది. ఈ నేపథ్యంలో అక్టోబర్ నెలలో కొత్తగా ఓటీటీల్లోకి రాబోతున్న కొరియన్ సినిమాలు, వెబ్ సిరీస్ ఏవో ఇక్కడ చూడండి. నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లాంటి ఓటీటీల్లోకి ఇవి రాబోతున్నాయి.
అక్టోబర్లో రానున్న కొరియన్ డ్రామాస్ ఇవే
స్పైస్ అప్ అవర్ లవ్ - ప్రైమ్ వీడియో
స్పైస్ అప్ అవర్ లవ్ అనేది కొరియన్ రొమాంటిక్ వెబ్ సిరీస్. తాను రాసిన నవలలోని లీడ్ క్యారెక్టర్లోకి వెళ్లి అందులోని మేల్ క్యారెక్టర్ తో పీకల్లోతు ప్రేమలో పడే ఓ రైటర్ చుట్టూ తిరిగే స్టోరీయే ఈ స్పైస్ అప్ అవర్ లవ్. ఈ వెబ్ సిరీస్ అక్టోబర్ 3 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.
ఎ వర్చువస్ బిజినెస్ - నెట్‌ఫ్లిక్స్
ఎ వర్చువస బిజినెస్ అనేది నెట్‌ఫ్లిక్స్ లో రాబోతున్న కొరియన్ వెబ్ సిరీస్. ఇది నలుగురు గ్రామీణ మహిళల చుట్టూ తిరిగే కథ. జీవితంలో తమను తాము నిరూపించుకోవడానికి ఆ నలుగురు కలిసి ఓ అడల్డ్ ప్రోడక్ట్స్ బిజినెస్ లోకి దిగుతారు. మహిళల సాధికారత, వాళ్లు జీవితంలో ఎదిగే తీరు, స్నేహం.. ఇలాంటి అంశాల చుట్టూ తిరిగే ఈ సిరీస్ అక్టోబర్ 12 నుంచి నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది.
జియోంగ్‌నియోన్: ది స్టార్ ఈజ్ బార్న్ - డిస్నీ ప్లస్ హాట్‌స్టార్
జియోంగ్‌నియోన్: ది స్టార్ ఈజ్ బార్న్ ఓ కొరియన్ వెబ్ సిరీస్. ఇది ఓ మ్యూజిక్ థీమ్ తో సాగే పీరియడ్ కొరియన్ డ్రామా. 1950ల్లో కొరియన్ యుద్ధం తర్వాత జరిగిన స్టోరీగా ఈ సిరీస్ ను తెరకెక్కించారు. ఓ పెద్ద సాంప్రదాయ థియేటర్ యాక్టర్ కావాలని కలలు కనే జియోంగ్ నియోన్ అనే అమ్మాయి చుట్టూ తిరుగుతుంది. ఈ వెబ్ సిరీస్ అక్టోబర్ 12 నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది.
హెల్‌బౌండ్ సీజన్ 2 - నెట్‌ఫ్లిక్స్
హెల్‌బౌండ్ ఓ హారర్ థ్రిల్లర్ కొరియన్ డ్రామా. ఇప్పటికే ఓ సీజన్ పూర్తి చేసుకున్న ఈ వెబ్ సిరీస్ ఇప్పుడు రెండో సీజన్ తో రాబోతోంది. ఈ హారర్ వెబ్ సిరీస్ అక్టోబర్ 25 నుంచి నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.
మై మెర్రీ మ్యారేజ్ - నెట్‌ఫ్లిక్స్
మై మెర్రీ మ్యారేజ్ ఓ మంచి ఫ్యామిలీ డ్రామా. అక్టోబర్ 7 నుంచి నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతున్న వెబ్ సిరీస్ ఇది. ఇందులో పెళ్లి, విడాకులు, ఒంటరి జీవితం, మళ్లీ పెళ్లిలాంటి అంశాల చుట్టూ తిరుగుతూ నిజమైన ఆనందం అంటే ఏంటో చెప్పే ప్రయత్నం చేయనుంది.