OTT Crime Thriller: ఇంకా ఓటీటీ టాప్‌లో క్రైమ్ థ్రిల్లర్- మనిషి మాంసం తినే క్రిమినల్ - 10 భాషల్లో స్ట్రీమింగ్- ఎక్కడంటే?
OTT Crime Thriller Movie: ఓటీటీలో క్రైమ్ థ్రిల్లర్ మూవీ సెక్టార్ 36 దూసుకుపోతోంది. సెప్టెంబర్ 13న ఓటీటీ రిలీజ్ అయిన ఈ సినిమా ఇప్పటికీ ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. అంతేకాకుండా సెక్టార్ 36 మూవీ పది భాషల్లో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. మరి సెక్టార్ 36 ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఏంటనే వివరాల్లోకి వెళితే..
OTT Crime Thriller Digital Streaming: ఓటీటీలో వచ్చే కంటెంట్ ఒక్కోసారి మనసుకు చివ్వుకుమనేలా ఉంటుంది. సున్నితమైన మనస్కులు చూడరాకుండా పలు సినిమాలు, వెబ్ సిరీసులు ఉంటున్నాయి. అయితే, వాటి టేకింగ్, థ్రిల్లింగ్ సీన్లతో అవి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటున్నాయి.
విలన్‌గా నటించిన క్రైమ్ థ్రిల్లర్
అందుకే ఓటీటీ రిలీజ్ అయి చాలా రోజులు గడిచిన కూడా ట్రెండింగ్‌లో నిలుస్తుంటాయి. అలాంటి ఓ క్రైమ్ థ్రిల్లర్ చిత్రమే సెక్టార్ 36. హిందీలో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న హీరో విక్రాంత్ మాసే. ముఖ్యంగా 12th ఫెయిల్ సినిమాతో దేశవ్యాప్తంగా ఫుల్ క్రేజ్ తెచ్చుకున్నాడు విక్రాంత్ మాసే. అతను విలన్‌గా నటించిన సినిమానే సెక్టార్ 36.
సున్నిత మనస్కులకు మాత్రం
సెక్టార్ 36 ఒక క్రైమ్ థ్రిల్లర్ చిత్రం. 2006లో నిథారీ కిల్లింగ్ టైటిల్‌తో నోయిడాలో జరిగిన వరుస హత్యల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. దీనికి ఆదిత్య నింబాల్కర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా చూసిన ఓటీటీ ఆడియెన్స్ స్టన్ అవుతున్నారు. ఒళ్లు గగుర్పొడిచే సీన్లు ఎంతగానో ఉన్నాయని రివ్యూలు ఇచ్చారు. అలాగే, కచ్చితంగా చూడాల్సిన మూవీ అని, సున్నితమనస్కులు చూడకూడదని సలహాలు ఇచ్చారు.
18 ఏళ్ల క్రితం
18 ఏళ్ల క్రితం ఢిల్లీ సరిహద్దు ప్రాంతమైన నోయిడా సంఘటనలతో తెరకెక్కిన ఈ సినిమాలో విక్రాంత్ మాసే విలన్‌గా జీవించేశాడు. స్టోరీ పెద్దగా లేదనిపించిన అందులో ప్రేమ్ సింగ్ (విక్రాంత్ మాసే) చెప్పే విషయాలు భయపెడతాయి. సెక్టార్ 36 స్టోరీ విషయానికొస్తే పదేళ్ల కుర్రాడు తనకు జరిగిన అవమానంతో ఉన్మాదిగా మారతాడు. సొంత మేనమామను హత్య చేసి అతని మాంసం తింటాడు.
నటనలో మరో మైలు రాయి
మనిషి మాంసానికి రుచికి మరికిన ప్రేమ్ సింగ్ స్లమ్ ఏరియాలోని చిన్న పిల్లలను కిడ్నాప్ చేసి వాళ్లను తింటూ ఉంటాడు. ప్రేమ్ సింగ్‌గా నటించిన విక్రాంత్ మాసే నటనలో మరో మైలురాయిని చేరుకున్నాడని చెప్పొచ్చు. అయితే, హార్రిఫిక్ క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన సెక్టార్ 36 నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో సెప్టెంబర్ 13 నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది.
ఓటీటీ ట్రెండింగ్‌లో
ఓటీటీ రిలీజ్ అయిన తొలి రోజు నుంచే ట్రెండింగ్‌లో కొనసాగుతోన్న సెక్టార్ 36 ఇప్పటికీ హవా కొనసాగిస్తోంది. విజయ్ ది గోట్, నాని సరిపోదా శనివారం వంటి సినిమాలు ఓటీటీ రిలీజ్ అయినప్పటికీ వాటికి గట్టి పోటీ ఇస్తోంది. అలా ఓటీటీ ట్రెండింగ్‌లో నాలుగు స్థానంలో దూసుకుపోతోంది సెక్టార్ 36. అంతేకాకుండా సెక్టార్ 36 పది భాషల్లో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.
10 భాషల్లో ఓటీటీ స్ట్రీమింగ్
సెక్టార్ 36 నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో హిందీతోపాటు తెలుగు, తమిళం, ఇంగ్లీష్, బ్రెజిలియన్ పోర్చుగీస్, యూరోపియన్ స్పానిష్, ఇండోనేషియన్, పోలిష్, స్పానిష్, థాయి భాషల్లో అందుబాటులో ఉంది. ఇంకా చూడని వాళ్లు, ఇలాంటి క్రైమ్ థ్రిల్లర్స్ ఇష్టపడేవారికి సెక్టార్ 36 బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. ఇక ఈ సినిమాను మాడోక్ ఫిల్మ్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి.
సెక్టార్ 36 రన్ టైమ్
సుమారుగా 124 నిమిషాల రన్ టైమ్ ఉన్న సెక్టార్ 36 సినిమాలో విక్రాంత్ మాసేతోపాటు దీపక్ డోబ్రియాల్, ఆకాష్ ఖురానా, దర్శన్ జరివాలా, ఇహానా కౌర్, బహురుల్ ఇస్లాం, ఇప్సితా చక్రవర్తి, తనుశ్రీ దాస్, సుబీర్, కుచో అహ్మద్ ఇతర కీలక పాత్రల్లో నటించి ఆకట్టుకున్నారు.
టాపిక్