Chapra Murder Case Review: చాప్రా మర్డర్ కేస్ రివ్యూ- ట్విస్టులు, బోల్డ్ సీన్స్‌- OTT మలయాళ క్రైమ్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?-chapra murder case review and rating in telugu aha ott malayalam crime thriller anchakkallakokkan movie review telugu ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Chapra Murder Case Review: చాప్రా మర్డర్ కేస్ రివ్యూ- ట్విస్టులు, బోల్డ్ సీన్స్‌- Ott మలయాళ క్రైమ్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?

Chapra Murder Case Review: చాప్రా మర్డర్ కేస్ రివ్యూ- ట్విస్టులు, బోల్డ్ సీన్స్‌- OTT మలయాళ క్రైమ్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?

Sanjiv Kumar HT Telugu
Oct 01, 2024 05:30 AM IST

Chapra Murder Case Movie Review In Telugu: చాప్రా మర్డర్ కేస్ టైటిల్‌తో తెలుగులో ఆహా ఓటీటీలోకి వచ్చేసింది మలయాళ క్రైమ్ థ్రిల్లర్ మూవీ అంచక్కల్లకొక్కన్. అలరించే ట్విస్టులు, బోల్డ్ సీన్స్‌‌తో సాగే ఈ సినిమా ఎలా ఉందో చాప్రా మర్డర్ కేస్ రివ్యూలో ఇక్కడ తెలుసుకుందాం.

చాప్రా మర్డర్ కేస్ రివ్యూ
చాప్రా మర్డర్ కేస్ రివ్యూ

టైటిల్: చాప్రా మర్డర్ కేస్ (అంచక్కల్లకొక్కన్)

నటీనటులు: లుక్మన్ అవరన్, చెంబన్ వినోద్ జోస్, మేఘా థామస్, శ్రీజిత్ రవి, మణికంద రాజన్, సెంథిల్ కృష్ణ, మెరీన్ ఫిలిప్ తదితరులు

కథ: ఉల్లాస్ చెంబన్, వికిల్ వేణు

దర్శకత్వం: ఉల్లాస్ చెంబన్

నిర్మాతలు: చెంబన్ వినోద్ జోస్

సంగీతం: మణికందన్ అయ్యప్ప

సినిమాటోగ్రఫీ: ఆర్మో

నిర్మాణ సంస్థ: చెంబోస్కీ మోషన్ పిక్చర్స్

ఓటీటీ ప్లాట్‌ఫామ్: ఆహా

రిలీజ్ డేట్: సెప్టెంబర్ 25, 2024

Anchakkallakokkan Movie Review In Telugu: మలయాళంలో తెరకెక్కిన మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న క్రైమ్ థ్రిల్లర్ మూవీ అంచక్కల్లకొక్కన్. నటుడు చెంబన్ వినోద్ జోస్ నిర్మాతగా ఉల్లాస్ చెంబన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను తెలుగులో చాప్రా మర్డర్ కేస్ టైటిల్‌తో నేరుగా ఓటీటీలో రిలీజ్ చేశారు.

సెప్టెంబర్ 25 నుంచి ఆహా ఓటీటీలో డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోన్న చాప్రా మర్డర్ కేస్‌ మూవీ ఐఎమ్‌డీబీ నుంచి 6.6 రేటింగ్ అందుకోంది. అలరించే ట్విస్టులు, బోల్డ్ సీన్స్, అదిరిపోయే సినిమాటోగ్రఫీ, బీజీఎమ్‌తో సాగే అంచక్కల్లకొక్కన్ మూవీ ఎలా ఉందో తెలుగులో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న చాప్రా మర్జర్ కేస్ రివ్యూలో తెలుసుకుందాం.

కథ:

కర్ణాటక-కేరళ బార్డర్‌లో ఉన్న కాళహస్తి అనే గ్రామానికి వాసుదేవన్ (లుక్మన్ అవరన్) అనే కానిస్టేబుల్ కొత్తగా వస్తాడు. వాసుదేవన్‌కు మిగతా అధికారుల నుంచి పెద్దగా రెస్పాన్స్ ఉండదు. కానీ, నడవరంబన్ పీటర్ (చెంబన్ వినోద్ జోస్) మాత్రం పట్టించుకుని ఫ్రెండ్లీగా ఉంటాడు. అదివరకే పోలీసులు అక్కడి పెద్ద భూస్వామి చాప్రా (శ్రీజిత్ రవి) హత్య గురించి సతమతం అవుతుంటారు.

ఈ క్రమంలో చాప్రాను తానే హత్య చేశానని కొల్లన్ శంకర్ (మణికంద రాజన్) పోలీస్ట్ స్టేషన్‌కు వచ్చి చంపిన ఆయుధంతోపాటు లొంగిపోతాడు. ఆ తర్వాత చోటు చేసుకున్న సంఘటనలు ఏంటీ..? శంకర్ ఎందుకు లొంగిపోయాడు? అసలు చాప్రాను మర్డర్ చేసింది ఎవరు? ఎందుకు చేశారు? చాప్రా హత్య వెనుక ఎంతమంది ఉన్నారు? వాసుదేవన్ గతం ఏంటీ? అంచక్కల్లకొక్కన్ ఎవరు? అతను ఏం చేస్తాడు? అనే ఇంట్రెస్టింగ్ విశేషాలు తెలియాలంటే చాప్రా మర్డర్ కేస్ చూడాల్సిందే.

విశ్లేషణ:

చాప్రా మర్డర్ కేస్ సినిమా 1990 కాలంలో జరుగుతుంది. మలయాళం టైటిల్‌ అంచక్కల్లకొక్కన్‌ అంటే ఒక బూచోడు అనే అర్థం వచ్చినట్లు సినిమాలో చూపించారు. మరి ఆ బూచోడు ఎందుకు వస్తాడు, ఎవరికోసం వస్తాడు అనే క్లైమాక్స్‌లో చూపించారు. సినిమా ప్రారంభమే పెద్ద స్వామి, గ్రామ పెద్ద చాప్రా మర్డర్‌తో స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత వాసుదేవన్ ఎంట్రీ, పోలీసులకు గ్రామస్థులు ఇచ్చే మర్యాద, లేకుంటే పట్టించుకోవడం వంటి సీన్లతో ఇంట్రెస్టింగ్‌గా సాగుతుంది.

ఒక్కో క్యారెక్టర్ ఎంట్రీ, వారి స్వభావం చూపిస్తారు. వాసుదేవన్ చాలా పిరికివాడుగా కనిపిస్తాడు. అందుకు గల గతాన్ని కూడా చూపించి క్లారిటీ ఇచ్చారు. చాప్రా మర్డర్ కేస్‌ను పోలీసులు ఏదోలా క్లోజ్ చేయాలనుకోవడం, గ్రామంలో చాప్రా కొడుకులు వచ్చి తండ్రి చావుకు విచారణ జరపడం, పలువురుపై దాడులు చేయడం వంటి సీన్లతో అలా సాగిపోతుంది. కొల్లన్ శంకర్ లొంగిపోవడంతో అసలు కథ స్టార్ట్ అవుతుంది.

ఒక్కో ట్విస్ట్ రివీల్

ఆ తర్వాత ఒక్కో ట్విస్ట్ రివీల్ అవుతూ అలరిస్తుంది. అయితే, దాదాపుగా సినిమాలోని ట్విస్టులను ఊహించవచ్చు. చివరి 40 నిమిషాలు బాగుంటుంది. క్లైమాక్స్ ఎపిసోడ్ అయితే 20 నిమిషాలకు పైగా తెరకెక్కించారు. అప్పటికే క్లైమాక్స్ ఏంటో ముందే ఊహించిన ప్రేక్షకులకు ఇంకా అయిపోవట్లే అనే ఫీలింగ్ కలుగుతుంది. అయితే, సినిమాలో యాక్షన్ సీన్స్ చాలా బాగున్నాయి. అలాగే, బీజీఎమ్ చాలా హైలెట్ అవుతుంది.

సినిమాలోని విజువల్స్, కెమెరా పనితనం చాలా మెచ్చుకునేలా ఉంటుంది. బీజీఎమ్, సినిమాటోగ్రఫీ ప్రతి సీన్‌పై క్యూరియాసిటీ కలిగిస్తుంది. అందుకే, స్టోరీ పెద్దగా లేకున్న చివరి వరకు చూసేలా ఎంగేజ్ చేస్తుంది. ఇక లుక్మన్ అవరన్ యాక్టింగ్ చాలా నీట్‌గా ఉంది. ఏ ఎమోషన్‌కు తగినట్లు అలా రక్తి కట్టించాడు. ఇక చెంబన్ వినోద్ జోస్ నటన హైలెట్‌ అని చెప్పొచ్చు.

కాంతార ఫ్లేవర్

మేఘా థామస్‌తోపాటు ఇతర క్యారెక్టర్స్ కూడా ఆకట్టుకుంటాయి. మంచి యాక్షన్ ఎపిసోడ్స్‌తోపాటు ఒకటి రెండు చోట్ల బోల్డ్ సీన్స్ ఉంటాయి. అవి కాస్తా ఫ్యామిలీతో చూసేందుకు ఇబ్బందిగా ఉంటుంది. కాస్తా కాంతార ఫ్లేవర్ కూడా కనిపిస్తుంది. దానికి జస్టిఫికేషన్ ఇచ్చారు డైరెక్టర్. క్రైమ్ యాక్షన్ డ్రామాలు ఇష్టపడేవారు చాప్రా మర్డర్ కేస్ ట్రై చేయొచ్చు.

రేటింగ్: 2.75/5