The Delhi Files Release: ది కాశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్ మరో సెన్సేషనల్ మూవీ ది ఢిల్లీ ఫైల్స్.. రిలీజ్ డేట్ చెప్పిన మేకర్స్-the delhi files the bengal chapter release date announced by director vivek ranjan agnihotri the delhi files release ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  The Delhi Files Release: ది కాశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్ మరో సెన్సేషనల్ మూవీ ది ఢిల్లీ ఫైల్స్.. రిలీజ్ డేట్ చెప్పిన మేకర్స్

The Delhi Files Release: ది కాశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్ మరో సెన్సేషనల్ మూవీ ది ఢిల్లీ ఫైల్స్.. రిలీజ్ డేట్ చెప్పిన మేకర్స్

Sanjiv Kumar HT Telugu
Oct 04, 2024 01:14 PM IST

The Delhi Files The Bengal Chapter Release Date: ది కాశ్మీర్ ఫైల్స్, ది వాక్సిన్ వార్ వంటి సెన్సేషనల్ సినిమాలు తెరకెక్కించిన డైరెక్టర్ వివేక్ రంజన్ అగ్రిహోత్రి దర్శకత్వంలో వస్తోన్న మరో కొత్త చిత్రమే ది ఢిల్లీ ఫైల్స్. మొదటి భాగంగా వస్తోన్న ఢిల్లీ ఫైల్స్ ది బెంగాల్ చాప్టర్ రిలీజ్ డేట్‌ను ప్రకటించారు.

ది కాశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్ మరో సెన్సేషనల్ మూవీ ది ఢిల్లీ ఫైల్స్.. రిలీజ్ డేట్ చెప్పిన మేకర్స్
ది కాశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్ మరో సెన్సేషనల్ మూవీ ది ఢిల్లీ ఫైల్స్.. రిలీజ్ డేట్ చెప్పిన మేకర్స్

The Delhi Files Release: సెన్సేషనల్ ఫిల్మ్ మేకర్‌గా పేరు తెచ్చుకున్నారు వివేక్ రంజన్ అగ్నిహోత్రి. ఆయన దర్శకత్వంలో తెరెక్కిన ది తాష్కెంట్ ఫైల్స్, ది కాశ్మీర్ ఫైల్స్, ది వ్యాక్సిన్ వార్ వంటి సినిమాలు అత్యంత ప్రశంసలు పొందాయి. వాటిలో ది కాశ్మీర్ ఫైల్స్ బాక్సాఫీస్ వద్ద కూడా భారీ వసూళ్లను రాబట్టింది.

పాన్ ఇండియా ప్రొడ్యూసర్

అలాంటి సంచలనాత్మక సినిమాలను తెరకెక్కించిన వివేక్ రంజన్ అగ్నిహోత్రి రూపొందించిన మరొక సెన్సేషనల్ ప్రాజెక్ట్ 'ది ఢిల్లీ ఫైల్స్'. ఈ సినిమా కోసం పాన్ ఇండియా ప్రొడ్యూసర్ అభిషేక్ అగర్వాల్‌తో మరోసారి చేతులు కలిపారు వివేక్ అగ్నిహోత్రి.

విమర్శకుల ప్రశంసలు

దేశవ్యాప్తంగా ప్రశంసలు, బాక్సాఫీస్ విజయాన్ని అందుకున్న 'ది కాశ్మీర్ ఫైల్స్'తో పాటు జాతీయ అవార్డు గెలుచుకున్న కార్తికేయ 2, విమర్శకుల ప్రశంసలు పొందిన గూఢచారి లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలని నిర్మించిన అభిషేక్ అగర్వాల్ తన బ్యానర్ అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్‌పై ఈ ది ఢిల్లీ ఫైల్స్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

రెండు భాగాలుగా

అయితే, 'ది ఢిల్లీ ఫైల్స్' సినిమా గురించి అనౌన్స్‌మెంట్ వచ్చినప్పటి నుంచి మంచి బజ్ క్రియేట్ చేసుకుంటూ హెడ్ లైన్స్‌లో నిలుస్తోంది. ఈ ఢిల్లీ ఫైల్స్ సినిమాను రెండు భాగాలుగా రూపొందించారు. వాటిలో మొదటి పార్ట్‌ విడుదల తేదిని మేకర్స్ ఇటీవల అధికారికంగా ప్రకటించారు. ది ఢిల్లీ ఫైల్స్- ది బెంగాల్ చాప్టర్ అనే టైటిల్‌తో మొదటి భాగం రానుంది.

ఇండిపెండెన్స్ డేకు

ది ఢిల్లీ ఫైల్స్ - ది బెంగాల్ చాప్టర్ సినిమా వచ్చే ఏడాది అంటే 2025 ఆగస్ట్ 15న ఇండిపెండెన్స్ డే సందర్భంగా విడుదలవుతుందని డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి వెల్లడించారు. సోషల్ మీడియాలో వివేక్ రంజన్ అగ్నిహోత్రి విడుదల తేదీని అనౌన్స్ చేస్తూ ఢిల్లీ ఫైల్స్ - ది బెంగాల్ చాప్టర్ ఇంట్రెస్టింగ్ పోస్టర్‌ను షేర్ చేశారు.

డైరెక్టర్ ట్వీట్

“మార్క్ యువర్ క్యాలెండర్. ఆగస్టు 15, 2025. సంవత్సరాల రిసెర్చ్ తర్వాత, #TheDelhiFiles పవర్ ఫుల్ కథ. చరిత్రలో ఒక ముఖ్యమైన అధ్యాయాన్ని ప్రజెంట్ చేస్తూ బెంగాల్ చాప్టర్ - రెండు భాగాలలో మొదటిది మీకు అందించడానికి మేము సంతోషిస్తున్నాము. #RightToLife" అని ట్వీట్ చేశారు డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి.

100 పుస్తకాలు

కాగా, వివేక్ రంజన్ అగ్నిహోత్రి తన సినిమా కోసం సమగ్రమైన సమాచారాన్ని సేకరించడానికి కేరళ నుంచి కోల్‌కతా, ఢిల్లీ వరకు చాలా దూరం ప్రయాణించి విస్తృత పరిశోధనలు చేశారు. అతను తన చిత్రానికి వెన్నెముకగా నిలిచే చారిత్రక సంఘటనలకు సంబంధించిన 100 పుస్తకాలు 200 కంటే ఎక్కువ కథనాలను చదివి సమాచారాన్ని సేకరించారు.

మరో సెన్సేషనల్ మూవీ

ఆయన టీం పరిశోధన కోసం 20 రాష్ట్రాలలో పర్యటించారు. 7000+ రిసెర్చ్ పేజీలు, 1000 పైన ఆర్చీవ్ చేసిన కథనాలను అధ్యయనం చేశారు. దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్న తర్వాత వివేక్ రంజన్ అగ్నిహోత్రి అప్ కమింగ్ 'ది ఢిల్లీ ఫైల్స్'తో మరో సెన్సేషనల్ మూవీని ప్రేక్షకులకు అందించడానికి సిద్ధంగా ఉన్నారు.

పల్లవి జోషి బ్యానర్

వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో వస్తోన్న ఢిల్లీ ఫైల్స్ సినిమా అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, పల్లవి జోషి బ్యానర్‌పై రూపొందుతోంది. తేజ్ నారాయణ్ అగర్వాల్ అండ్ ఐ యామ్ బుద్ధ సమర్పణలో ఈ చిత్రం ఆగస్ట్ 15, 2025న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.

Whats_app_banner