Horror OTT: మూడేళ్లకు నేరుగా ఓటీటీలోకి హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ.. తెలుగులో స్ట్రీమింగ్.. ఇక్కడ చూసేయండి!
Horror Thriller Time Cut OTT Streaming: ఓటీటీలోకి హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ టైమ్ కట్ మూడేళ్లకు డైరెక్ట్ డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది. అమెరికన్ సైన్స్ ఫిక్షన్, టైమ్ ట్రావెల్ హారర్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన టైమ్ కట్ మూడేళ్లకు ఇంగ్లీష్‌తోపాటు తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఓటీటీ రిలీజ్ కానుంది.

Time Cut OTT Release: హారర్, సైన్స్ ఫిక్షన్, టైమ్ ట్రావెల్ సినిమాలపై మంచి క్యూరియాసిటీ ఉంటుంది. ఏ జోనర్‌కు ఆ జోనర్ సెపరేట్ ఫ్యాన్ బేస్ కలిగి ఉంటుంది. ఈ జోనర్స్‌లో థ్రిల్లింగ్ సీన్స్, గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో ఆకట్టుకుంటే ఆ సినిమాలు మంచి హిట్ కొడతాయి. ఇక ఇటీవల ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో విభిన్నమైన కంటెంట్‌తో సినిమాలు, వెబ్ సిరీసులు సినీ లవర్స్ ముందుకు వస్తున్నాయి.
అమెరికన్ హారర్ థ్రిల్లర్
ఒక్క జోనర్‌కే పరిమితం కాకుండా వాటిలో మిగతా జోనర్స్‌కు కావాల్సిన ఎలిమెంట్స్‌ను యాడ్ చేస్తూ సినిమాలను రూపొందిస్తున్నారు. అలా లేటెస్ట్‌గా తెరకెక్కిన సినిమానే టైమ్ కట్. సైన్స్ ఫిక్షన్, హారర్ థ్రిల్లర్, టైమ్ ట్రావెల్, క్రైమ్ థ్రిల్లర్ అంశాలతో చిత్రీకరించిన అమెరికన్ మూవీనే టైమ్ కట్.
ఎస్ ఎంటర్టైన్‌మెంట్ బ్యానర్‌పై నిర్మించిన టైమ్ కట్ చిత్రానికి లేడి డైరెక్టర్ అయిన హన్నా మాక్‌ఫెర్సన్ దర్శకత్వం వహించారు. హన్నా ఇదివరకు ఇంటు ది డార్క్ ప్యూర్, సిక్ హౌజ్ వంటి చిత్రాలను తెరకెక్కించారు. మైఖేల్ కెనడీ కథ అందించిన టైమ్ కట్ మూవీలో ఆంటోనియా జెంట్రీ, మాడిసన్ బైలీ, గిఫ్రిన్ గ్లక్, మైఖేల్ షాంక్స్, మేగన్ బెస్ట్, ఆడమ్ హర్టిగ్, సిడ్నీ సాబిస్టన్, సమ్మర్ హెచ్ హోవెల్, కొలీన్ ఫుర్లన్ కీలక పాత్రలు పోషించారు.
నాలుగు భాషల్లో
టైమ్ ట్రావెల్ చిత్రంగా తెరకెక్కిన టైమ్ కట్ నెట్‌ఫ్లిక్స్‌లో ఓటీటీ రిలీజ్ కానుంది. అక్టోబర్ 30 నుంచి ఇంగ్లీషుతోపాటు తెలుగు, తమిళం, హిందీ భాషల్లో నెట్‌ఫ్లిక్స్‌లో టైమ్ కట్ ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని అధికారికంగా నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. దానికి సంబంధించి టైమ్ కట్ ట్రైలర్‌ను కూడా విడుదల చేసింది.
టైమ్ కట్ ట్రైలర్‌లో చనిపోయిన తన సోదరిని తిరిగి కాపాడేందుకు మాడిసన్ బెైలీ అనే యువతి గతంలోకి వెళ్తుంది. హైస్కూల్ సీనియర్ విద్యార్థి అయిన మాడిసన్ బైలీ గుర్తింపు లేని ఓ సైంటిస్ట్ కనుగొన్న టైమ్ మేషన్ ద్వారా 2003 సంవత్సరంలోకి టైమ్ ట్రావెల్ చేస్తుంది. 2003లో తన సోదరితోపాటు నలుగురు హత్యకు గురవుతారు. అయితే, వారిని ఎవరు చంపారో తెలియదు.
టైమ్ కట్ ఓటీటీ రిలీజ్
ఆ హత్యల వెనుక ఉంది ఎవరు, ఎందుకు చంపాలనుకున్నారు, ఆ హత్యలు జరగకుండా ఆపేందుకు ప్రయత్నించడానికే గతంలోకి టైమ్ ట్రావెల్ చేస్తుంది మాడిసన్. ఆ తర్వాత తన సోదరి చదువుకున్న స్కూల్‌లోకి అడుగుపెడుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది..? ఆ హత్యలు జరగకుండా మాడిసన్ కాపాడిందా? ఆ కిల్లర్ ఎవరు? అనే విషయాలు తెలియాలంటే టైమ్ కట్ ఓటీటీ రిలీజ్ వరకు ఆగాల్సిందే.
మే 2021లోనే మైఖేల్ కెన్నెడీ, సోనో పటేల్ రచించిన టైమ్ కట్ చిత్రాన్ని హన్నా మాక్‌ఫెర్సన్ డైరెక్ట్ చేస్తారని ప్రకటించారు. ఆ తర్వాత 2021 జూన్ 21 నుంచి జూలై 28 మధ్య కెనడాలోని విన్ని పెగ్‌లో టైమ్ కట్ షూటింగ్ జరగాల్సింది. కానీ, అనివార్య కారణాల వల్ల జరగలేదు.
మూడేళ్ల క్రితం
చివరికి జూలై 6న ప్రారంభమై ఆగస్ట్ 2021లో టైమ్ కట్ షూటింగ్ పూర్తి అయింది. మూడేళ్ల క్రితం షూటింగ్ పూర్తి చేసుకున్న టైమ్ కట్ సినిమా ఎట్టకేలకు నేరుగా ఓటీటీలోకి డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది.