OTT Horror Telugu: ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు హారర్ మూవీ.. రెండింట్లో స్ట్రీమింగ్.. తన అవయవాలను తానే తింటే? ఇక్కడ చూడండి!
OTT Horror Telugu Movie Kalinga Digital Streaming Now: ఓటీటీలోకి తెలుగు హారర్ మూవీ కళింగ వచ్చేసింది. హారర్ సినిమాలను ఇష్టపడే వారికి 2 ఓటీటీల్లోకి కళింగ రావడం నిజంగా గుడ్ న్యూస్. ధృవ వాయు హీరోగా నటించిన మైథలాజికల్ హారర్ ఫాంటసీ జోనర్‌లో తెరకెక్కిన కళింగ ఓటీటీ స్ట్రీమింగ్ పూర్తి వివరాల్లోకి వెళితే..
Telugu Horror Movie OTT Release: హారర్ సినిమాలకు ఉండే క్రేజ్ వేరు. కథ ఎలా ఉన్నా టేకింగ్, స్క్రీన్ ప్లే, ఆకట్టుకునే సన్నివేశాలు ఉంటే అవి పక్కాగా బ్లాక్ బస్టర్ హిట్స్ అవుతుంటాయి. అయితే, మొన్నటివరకు తెలుగులో హారర్ సినిమాలు రావడం చాలా అరుదుగా జరిగేది. ఎక్కువగా హాలీవుడ్, హిందీలో హారర్ జోనర్స్ ఎక్కువగా వచ్చేవి.
హీరో స్వీయ దర్శకత్వంలో
కానీ, ఇటీవల కాలంలో తెలుగులో కూడా డిఫరెంట్ కంటెంట్‌తో హారర్ సినిమాలను తెరకెక్కిస్తున్నారు. అలా రీసెంట్‌గా థియేటర్లలోకి వచ్చి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న తెలుగు హారర్ సినిమా కళింగ. కిరోసిన్ సినిమాలో హీరోగా నటించిన ధృవ వాయి స్వీయ దర్శకత్వంలో రూపొందిన చిత్రమే కళింగ. బిగ్ హిట్ ప్రొడక్షన్ బ్యానర్‌పై దీప్తి కొండవీటి, పృథ్వీ యాదవ్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
రెండు రోజులకు ముందే
మైథలాజికల్ హారర్ ఫాంటసీ ఎలిమెంట్స్‌తో తెరకెక్కిన కళింగ సినిమా సెప్టెంబర్ 13న థియేటర్లలో విడుదలైంది. దానికంటే రెండు రోజుల ముందే ప్రీమియర్స్ సైతం వేశారు. ఈ ప్రీమియర్స్‌కు మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. కన్నడ బ్లాక్ బస్టర్ కాంతార, తెలుగు సూపర్ హిట్ మూవీ విరూపాక్ష, మంగళవారం వంటి సినిమాలతో కళింగ చిత్రాన్ని పోల్చి బాగుందని చెప్పారు.
వెన్నులో వణుకు పుట్టించే సీన్స్
ట్రైలర్, టీజర్ మరింత భయపెట్టేలా ఉండటంతో కళింగ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. అలా సెప్టెంబర్ 13న విడుదలైన కళింగకు పాజిటివ్ టాక్ బాగానే వచ్చింది. కానీ, బాక్సాఫీస్ వద్ద మాత్రం ఊహించనంతగా వసూళ్లు రాబట్టలేకపోయినట్లు తెలుస్తోంది. కళింగలో తమ అవయవాలను తామే తినే మనుషులతో వెన్నులో వణుకు పుట్టించే సీన్లు, లవ్ స్టోరీ, హారర్ ఎలిమెంట్స్ బాగానే ఉన్నాయని పలువురు రివ్యూలు ఇచ్చారు.
2 ఓటీటీల్లో స్ట్రీమింగ్
ఇప్పుడు అలాంటి తెలుగు హారర్ సినిమా కళింగ ఓటీటీలోకి వచ్చేసింది. అది కూడా రెండు ఓటీటీల్లో కళింగ డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. కళింగ ఓటీటీ రైట్స్‌ను ఆహా, అమెజాన్ ప్రైమ్ వీడియో డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్ చేజిక్కించుకున్నాయి. కళింగ సినిమా థియేటర్లలో విడుదలైన 21 రోజుల్లో ఓటీటీలోకి వచ్చేసింది.
హీరోయిన్‌గా ప్రగ్యా నయన్
ఆహా, అమెజాన్ ప్రైమ్ ఓటీటీల్లో నేటి (అక్టోబర్ 4) నుంచి కళింగ డిజిటల్ ప్రీమియర్ అవుతోంది. థియేటర్లలో మిస్ అయినవాళ్లు కళింగను ఓటీటీల్లో ఎంచక్కా చూసి ఎంజాయ్ చేయొచ్చు. ఇదిలా ఉంటే, కళింగ సినిమాలో హీరోగా ధృవ వాయు చేస్తే హీరోయిన్‌గా ప్రగ్యా నయన్ ఆకట్టుకుంది.
కిరోసిన్ ఓటీటీ
ఇంకా కళింగ సినిమాలో హీరో హీరోయిన్లతోపాటు ఆడుకాలం నరేన్, తనికెళ్ల భరణి, పాపులర్ యాక్టర్, దేవి మూవీ ఫేమ్ షిజు (Shiju Abdul Rasheed), మురళిధర్ గౌడ్, మీసాల లక్షణ్, సమ్మెట గాందీ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. ఇదిలా ఉంటే, హీరో ధృవ వాయు నటించిన కిరోసిన్ మూవీ కూడా ఆహా ఓటీటీలోనే స్ట్రీమింగ్ అవుతోంది.
కిరోసిన్ సినిమాకు కూడా ధృవ వాయునే హీరోగా చేస్తూ స్వీయ దర్శకత్వం వహించాడు. ఇందులో ప్రీతి శంకర్ హీరోయిన్‌గా చేసింది. ఈ సినిమాలో కంచెరపాళేం రాజు, బ్రహ్మాజీ, లక్షణ్ మీసాల, సమ్మెట గాంధీ, మధుసూదన్ రావు తదితరులు కీలక పాత్రలు పోషించారు.