Karthika deepam november 7th episode: దగ్గరవుతున్న దీప, కార్తీక్- రిసెప్షన్ కు సుమిత్రను రమ్మని పిలిచిన కాంచన
Karthika deepam 2 serial today november 7th episode: కార్తీకదీపం 2 సీరియల్ నవంబర్ 7 ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. కార్తీక్, దీపలను దగ్గర చేసేందుకు అందరూ ప్రయత్నం చేస్తూ ఉంటారు. తన కూతురికి అన్యాయం జరిగిందని అటు సుమిత్ర కాంచన దగ్గర ఆవేదనగా మాట్లాడుతుంది.
Karthika deepam 2 serial today november 7th episode: సుమిత్ర కాంచనకు ఫోన్ చేసి సీరియస్ అవుతుంది. మీరు చేసిన తప్పుకు ఇప్పుడు నా కూతురు ఏడుస్తుంది. దాన్ని తిట్టినా కొట్టినా అది కార్తీక్ ని మర్చిపోలేకపోతుంది. కొడుకులా చూసుకున్న మేనల్లుడు నాకు అన్యాయం చేస్తే కూతురిలా చూసుకున్న దీప నా కూతురికి అన్యాయం చేసిందని సుమిత్ర చాలా ఆవేదనగా మాట్లాడుతుంది.
రిసెప్షన్ కు రమ్మన్న కాంచన
క్షమించు వదిన కోపంలో దీప, కార్తీక్ ని తిట్టాను. వాళ్లిద్దరికీ రాసి పెట్టి ఉంది అందుకే అలా జరిగింది. సారి వదిన నా కూతురికి అలా జరిగేసరికి ఇలా మాట్లాడాను అని సుమిత్ర కంట్రోల్ అవుతుంది. పిల్లల జీవితాలు బాగుండాలని కోరుకున్నాను. ఈ పెళ్లి నా కొడుకు ఇష్టప్రకారమే జరిగింది. దీప కూడా ఈ పెళ్ళిని అంగీకరించింది.
జరిగిన దానికి జ్యోత్స్న ఎంత బాధపడుతుందో నేను చూశాను. వీలు చూసుకుని జ్యోత్స్నతో మాట్లాడతానని కాంచన అంటుంది. జరిగిన పెళ్లి నలుగురికి తెలియాలని రిసెప్షన్ జరిపిస్తున్నాను. ఆ ఇంటి పరిస్థితి నాకు తెలుసు కానీ నువ్వు రావాలని ఆశ పడుతున్నానని కాంచన అడుగుతుంది.
కార్తీక్ నాకు కొడుకే కదా
ఫంక్షన్ చివరి వరకు నువ్వు వస్తావని నేను ఎదురుచూస్తానని అంటుంది. రిసెప్షన్ కు వచ్చి వాళ్ళను ఆశీర్వదించాలని నాకు ఉంది. కానీ నేను ఎలా రాగలను అది నా వల్ల అవుతుందా అని సుమిత్ర బాధపడుతుంది. కావేరి శ్రీధర్ దగ్గరకు వెళ్ళి రిసెప్షన్ కు గిఫ్ట్ తీసుకుందామా అని అంటుంది.
ఎవరికి అంటే నా కొడుకు, కోడలికి అంటుంది. వాళ్ళెవరూ అంటే కార్తీక్, దీప అనేసరికి శ్రీధర్ తలపట్టుకుంటాడు. మనం ఇక్కడ వద్దు వైజాగ్ వెళ్లిపోదామని శ్రీధర్ అంటాడు. కూతురిని వదిలేసి వెళ్తాం మనం రిసెప్షన్ కు వెళ్తున్నాము అంతే అంటుంది. తాను మాత్రం రానని శ్రీధర్ చెప్తాడు.
శౌర్య కోసం ఆట ఆడిన దీప
శౌర్య తన ఫ్రెండ్స్ తో ఆదుకుంటుంది. ఆటలో శౌర్య ఒడిపోయేసరికి తన ఫ్రెండ్స్ ఆటపట్టిస్తారు. ఆటలో మా అమ్మ బాగా ఆడుతుందని గొడవ పడుతుంది. దీప వస్తే నువ్వు బాగా ఆడతావని చెప్పాను. నువ్వు ఆడి నన్ను గెలిపించమని శౌర్య పట్టుబడుతుంది.
శౌర్య సంతోషం కోసం దీప తొక్కుడు బిళ్ళ ఆట ఆడుతుంది. అది కార్తీక్ చూసి చాలా సంతోషిస్తాడు. శౌర్య నాన్న అమ్మ ఆటలో గెలిచిందని చెప్తుంది. మళ్ళీ రిసెప్షన్ కు ఒప్పుకోవచ్చుగా అని శౌర్య అడుగుతుంది. ఫంక్షన్ లేదు పార్టీ లేదని దీప కోపంగా చెప్తుంది.
కొమ్ములు వస్తాయి
కాంచన, అనసూయ రిసెప్షన్ గురించి మాట్లాడుకుంటారు. ఇక్కడ దీప ఒప్పుకోలేదు కానీ ఫంక్షన్ ఏర్పాట్లు జరుగుతున్నాయని అనసూయ టెన్షన్ పడుతుంది. కార్తీక్ తన ఫోన్ కోసం వెతుకుతూ బయటకు రాగానే ఎదురుగా దీప కూడా చూసుకోకుండా ఢీ కొడుతుంది.
అది చూసి శౌర్య అయ్యయ్యో అంటుంది. ఏమైందని అనసూయ వాళ్ళు అడుగుతారు. అమ్మానాన్నకు కొమ్ములు వస్తాయి, వాళ్ళిద్దరూ తల గుద్దుకున్నారని శౌర్య చెప్తుంది. కార్తీక్ దీపకు సారి చెప్తాడు. కొమ్ములు వస్తాయి రాకూడదంటే రెండో సారి తలలు గుద్దుకోవాలని చెప్తుంది.
అనసూయ, కాంచన శౌర్యను సపోర్ట్ చేస్తారు. కొమ్ములు వస్తాయని శౌర్య గోల చేస్తుంది. దీప మాత్రం ఇబ్బంది పడుతుంది. నాన్న అమ్మ తల మీద మళ్ళీ కొట్టమని అంటారు. దీంతో పిల్లల కోసం కొన్ని చేయాల్సిందే అని తల ఆనిస్తాడు. వెంటనే శౌర్య వాళ్ళను ఫోటో తీస్తుంది.
రేపటి ఎపిసోడ్ ప్రోమో
నాకు అమ్మానాన్న కావాలని శౌర్య ఏడుస్తుంది. అమ్మానాన్న ఉన్నారు కదా అంటే వీళ్ళు నా అమ్మానాన్న కాదు. ఇదిగో వీళ్ళు అని ఫోటో చూపిస్తుంది. శౌర్య ఏడుస్తుంటే బాధపడొద్దని అంటాడు. మా ఫ్రెండ్స్ అమ్మానాన్న ఉన్నట్టు మీరు ఉండటం లేదు. నేనంటే ప్రేమ ఉంటే ఫంక్షన్ కు ఒప్పుకోమని శౌర్య ఏడుస్తుంది. కూతురి కోసం దీప సరే అంటుంది.
టాపిక్