Karthika deepam november 5th episode: జ్యోత్స్నకు దీప మాస్ వార్నింగ్- భయపడిన పారిజాతం, శౌర్యకు జబ్బు ఉందన్న డాక్టర్-karthika deepam 2 serial today november 5th episode deepa warns joytsna leave her and sourya alone ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Karthika Deepam November 5th Episode: జ్యోత్స్నకు దీప మాస్ వార్నింగ్- భయపడిన పారిజాతం, శౌర్యకు జబ్బు ఉందన్న డాక్టర్

Karthika deepam november 5th episode: జ్యోత్స్నకు దీప మాస్ వార్నింగ్- భయపడిన పారిజాతం, శౌర్యకు జబ్బు ఉందన్న డాక్టర్

Gunti Soundarya HT Telugu
Nov 05, 2024 07:10 AM IST

Karthika deepam 2 serial today november 5th episode: కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. రిసెప్షన్ చేసుకోవద్దని జ్యోత్స్న దీపను బెదిరించాలని చూస్తుంది. కానీ దీప రివర్స్ లో తన జోలికి వస్తే ఊరుకునేది లేదని మాస్ లెవల్ లో వార్నింగ్ ఇస్తుంది. అది చూసి పారిజాతం భయపడుతుంది.

కార్తీకదీపం 2 సీరియల్ నవంబర్ 5 ఎపిసోడ్
కార్తీకదీపం 2 సీరియల్ నవంబర్ 5 ఎపిసోడ్ (disney plus hotstar)

Karthika deepam 2 serial today november 5th episode: దీపను రిసెప్షన్ ఎలా ఒప్పించాలా అని శౌర్య తెగ ఆలోచిస్తుంది. ఏదైనా ఐడియా వచ్చిందా అని కాంచన, అనసూయ అడుగుతారు. శౌర్య భయం భయంగా దీప గదిలోకి వెళ్తుంది. మీ నాన్న ఎక్కడ అని నన్ను చాలా మంది అడిగారు.

ఫంక్షన్ కి ఒప్పుకోమ్మ 

ఏదో ఒక రోజు మా నాన్నను అందరికీ చూపిస్తానని చెప్పాను. నాకు అమ్మే కాదు మంచి నాన్న ఉన్నాడని తెలియాలి, చూపించాలి. వాళ్ళని పిలవాలి అలా జరగాలంటే మీరు రిసెప్షన్ చేసుకోవాలి. వాళ్ళందరి కోసం కాదు నాకోసం ఫంక్షన్ చేసుకోమ్మ అని అడుగుతుంది.

కాంచన వచ్చి దాని చిన్న మనసుకు అనిపించింది చెప్పింది. అది దాని బాధ తీర్చాల్సిన బాధ్యత మీ మీద ఉందని అంటుంది. శౌర్య కోసమే కదా మీరిద్దరూ భార్యాభర్తలు అయ్యింది, దాని కోసం ఈ ఫంక్షన్ చేసుకోలేవా అని అనసూయ గట్టిగా అడుగుతుంది.

ఇష్టం లేదు ఇబ్బంది పెట్టొద్దు 

కార్తీక్ బాబు ఫ్రెండ్స్ ఏమన్నారో మర్చిపోయారా? ఇప్పుడు ఇద్దరే అన్నారు ఫంక్షన్ పెడితే అందరూ అంటారని అంటుంది. మా బాధ కూడా అదే ఇప్పుడు ఇది జరగకపోతే నలుగురు నానారకాలుగా మాట్లాడుకుంటారు. మనిషికోక సమాధానం చెప్పలేము కదా.

అందుకే ఈ ఫంక్షన్ అని కాంచన అంటుంది. కార్తీక్ బాబును అవమానించడం తనకు ఇష్టం లేదని ఈ విషయంలో ఇబ్బంది పెట్టొద్దని దీప చెప్తుంది. అనసూయ బాధపడుతుంది. దీపను ఇబ్బంది పెట్టకుండా వీలు చూసుకుని అంతా మాట్లాడదామని కాంచన సర్ది చెప్తుంది.

హెల్త్ డిసీజ్ ఉంది 

కార్తీక్ డాక్టర్ ని కలుస్తాడు. పాపకు హెల్త్ డీసీజ్ ఉంది, నేను అనుకున్నది నిజమో కాదో తెలియదు. అందుకే సెకండ్ ఒపీనియన్ కోసం వేరే వాళ్ళకు పంపించాను. పాప విషయంలో కేర్ తీసుకోండి. వీలైనంత హ్యాపీగా ఉంచండి. తన సంతోషమే తన ఆయుష్హు అని చెప్తాడు.

ఇంతకు ఆ పాప ఏమవుతుందని డాక్టర్ అడుగుతాడు. తను నా కూతురు అని చెప్తాడు. జ్యోత్స్న ఆవేశంగా కార్తీక్ ఇంటికి వస్తుంది. దీపను ఏమైనా అంటే కార్తీక్ ఊరుకోడు అని పారిజాతం తనకు ఫోన్ చేసి బయటకు రమ్మని పిలుస్తుంది. ఎందుకు వచ్చారని దీప కోపంగా అడుగుతుంది.

భయపడిన పారిజాతం 

మెడలో తాళి పడేసరికి యజమానిగా అయి మన మీద గొంతు లేపుతుందని జ్యోత్స్న అంటుంది. ఒక్క మాట తేడా మాట్లాడితే కొడితే మీ ఇంటి గేటు దగ్గర పడతావని దీప కోపంగా చెప్తుంది. ఏంటే నా మనవరాలిని అంటావా అంటే మీకు కూడా ఇదే మాట వర్తిస్తుందని దీప అనేసరికి పారిజాతం భయంతో వెనక్కి తగ్గుతుంది.

రిసెప్షన్ చేసుకుంటున్నారంట కదా. నీ ప్రమేయం లేకుండానే రిసెప్షన్ జరుగుతుందా? చూస్తుంటే నీ ప్రమేయం లేకుండా కాపురం కూడా చేసేలాగా ఉన్నావ్ కదా అంటుంది. నేను చేసుకుంటున్నానని నీతో చెప్పానా అని అంటుంది. మా బావ కట్టిన తాళి నీ మెడలో ఉన్నంత వరకు నీకు నరకం చూపిస్తానని జ్యోత్స్న వార్నింగ్ ఇస్తుంది.

మాస్ వార్నింగ్ 

అయితే వెళ్ళి మీ బావను ఈ తాళి మెడలో నుంచి తీసేయమని చెప్పు అని దీప అంటుంది. జ్యోత్స్న తన బాధను అంతా వెళ్లగక్కుతుంది. నా తాళి నాకు కావాలి, నా బావ నాకు కావాలి. ఈ ఇంట్లో కోడలి స్థానం నాకు కావాలి అని అడుగుతుంది. ఈ జీవితం తాను కోరుకులేదని అంటుంది.

అయితే వెళ్లిపో అని జ్యోత్స్న అంటే అది కూడా నా చేతుల్లో లేదు. నా జీవితంలో నా కూతురికి తప్ప ఎవరికీ చోటు లేదు. నన్ను ఇలాగ ఉండనివ్వండి. లేదంటే ఇన్నాళ్ళూ బాధతో కొట్టాను కోపంతో కొడితే నువ్వు తట్టుకోలేవు. నా చేతి దెబ్బలు కూడా రాళ్ళ దెబ్బలులాగా ఉంటాయి.

దీపను ప్రశాంతంగా ఉండనివ్వను 

ఇన్నాళ్ళూ సుమిత్రమ్మ గురించి ఆలోచించాను ఇక ఎవరి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇంకోసారి నా దగ్గరకు వచ్చేటప్పుడు ఇలా మాట్లాడేటప్పుడు ఇది గుర్తు పెట్టుకుని రా అని దీప మాస్ వార్నింగ్ ఇస్తుంది. జ్యోత్స్నను పారిజాతం మీద విరుచుకుపడుతుంది.

ఈ రిసెప్షన్ తో దీప కార్తీక్ భార్య అని అందరికీ తెలుస్తుంది. అప్పుడు శ్రీధర్ మావయ్య రెండో భార్యకు ఉన్న విలువే నాకు ఉంటుందని అంటుంది. ఈ రిసెప్షన్ జరగదు, దీపను ప్రశాంతంగా ఉండనివ్వనని పారిజాతం అంటుంది. ఈ మాటలు విన్న సుమిత్ర కోపంగా దీప మీకు ఏం అన్యాయం చేసిందని ఇలా అంటున్నారని అడుగుతుంది.

భ్రమలో నుంచి బయటకు రా 

మీరు దీప దగ్గరకు వెళ్లారా అని సుమిత్ర ప్రశ్నిస్తుంది. అవును దీప దగ్గరకే వెళ్ళాం అయితే ఏంటని జ్యోత్స్న అంటుంది. ఎందుకు వెళ్లారని అంటే రిసెప్షన్ చేసుకోవద్దని చెప్పడానికి వెళ్ళాం. అది రిసెప్షన్ చేసుకోవడానికి వీల్లేదు నేను ఒప్పుకోను. నేను కార్తీక్ భార్యను అంటుంది.

ఈ భ్రమలో నుంచి బయటకు రావా నువ్వు. దేవుడి సన్నిధిలో భార్యాభర్తలుగా పీటల మీద కూర్చుని వ్రతం చేసుకున్నారు. ఇప్పుడు కార్తీక్ దీప భర్త. నువ్వు కావాలి అనుకోవడం చాలా పెద్ద తప్పు అని సుమిత్ర సర్ది చెప్పడానికి చూస్తుంది. వాళ్ళది అసలు పెళ్ళే కాదని జ్యోత్స్న ఆవేశంగా మాట్లాడుతుంది. అక్కడితో నేటి కార్తీకదీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగిసింది.

Whats_app_banner