Karthika deepam november 4th episode: దీప, కార్తీక్ కు రిసెప్షన్- నో చెప్పిన వంటలక్క, ఒప్పించే బాధ్యత శౌర్యదే-karthika deepam 2 serial today november 4th episode deepa refuses kasi swapna request about her reception ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Karthika Deepam November 4th Episode: దీప, కార్తీక్ కు రిసెప్షన్- నో చెప్పిన వంటలక్క, ఒప్పించే బాధ్యత శౌర్యదే

Karthika deepam november 4th episode: దీప, కార్తీక్ కు రిసెప్షన్- నో చెప్పిన వంటలక్క, ఒప్పించే బాధ్యత శౌర్యదే

Gunti Soundarya HT Telugu
Nov 04, 2024 07:18 AM IST

Karthika deepam 2 serial today november 4th episode: కార్తీకదీపం 2 సీరియల్ నవంబర్ 4వ తేదీ ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. దీప, కార్తీక్ వాళ్ళది అసలు పెళ్ళే కాదని పారిజాతం నోటికొచ్చినట్టు తిడుతుంది. దీంతో వాళ్ళ పెళ్లి అందరికీ తెలిసేలా చేస్తానని రిసెప్షన్ ఏర్పాటు చేస్తానని ఛాలెంజ్ చేస్తుంది.

కార్తీకదీపం 2 సీరియల్ నవంబర్ 4 ఎపిసోడ్
కార్తీకదీపం 2 సీరియల్ నవంబర్ 4 ఎపిసోడ్ (disney plus hotstar)

Karthika deepam 2 serial today november 4th episode: కార్తీక్ చేసుకున్నది అసలు పెళ్ళే కాదు. నాలుగు గోడల మధ్య తాళి కట్టి దొంగతనంగా కాపురం చేసుకోవడం తప్ప వేరే దారి లేదని పారిజాతం నోటికొచ్చినట్టు మాట్లాడుతుంది. దీంతో స్వప్న కోపంగా బంధువులు అందరినీ పిలిచి మా అన్నయ్య, వదినలకు రిసెప్షన్ చేస్తానని అంటుంది.

స్వప్న ఛాలెంజ్

నీలాంటి వాళ్ళ నోరు మూయించడానికి అయినా మేము అక్క, బావకు రిసెప్షన్ చేస్తామని కాశీ చెప్తాడు. మీరు గట్టిగా మాట్లాడితే పేపర్ లో కూడా వేయిస్తానని స్వప్న ఛాలెంజ్ చేస్తుంది. పారిజాతం కోపంగా వెళ్ళిపోతుంది. పంతానికి పోయి ఎందుకు సవాలు చేయడమని దాసు అంటాడు.

అమ్మమ్మ వచ్చి మంచి విషయం గుర్తు చేశారని అంటుంది. దీప, కార్తీక్ ఎవరి దారిన వాళ్ళు పనులు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు ఎందుకు అలా ఉన్నారని శౌర్య కాంచనను అడుగుతుంది. అప్పుడే స్వప్న వాళ్ళు వస్తారు. కాశీ దీపను, స్వప్న కార్తీక్ ను ఒక దగ్గరకు తీసుకొచ్చి కూర్చోబెడతారు.

కుబేర గురించి తెలుసుకుంటున్న దాసు

ఏదో సర్ ప్రైజ్ ప్లాన్ చేసినట్టు ఉన్నారని కార్తీక్ అడుగుతాడు. అప్పుడే దాసుకు ఎవరో ఫోన్ చేస్తారు. ఆ మనిషి గురించి తెలిసిందా అంటే తెలిసింది ఊరు పేరు ముత్యాలమ్మ గూడెం అంటాడు. ఆ పేరు విని అది మా ఊరే అని అనసూయ చెప్పబోతుంటే దాసు మాట దాటేస్తాడు.

ఎలాగైనా వెతకమని దాసు ఫోన్ చేసిన వ్యక్తికి చెప్తాడు. పెళ్లి గురించి పది మందికి తెలియాలి కదా. అందుకే రిసెప్షన్ పెట్టి జరిగిన పెళ్లి గురించి బంధువులను పిలిచి చెప్పాలని అనుకుంటున్నట్టు కాశీ చెప్తాడు. ఆలోచన బాగుందని గుడిలో జరిగిన మీ పెళ్లి గురించి అందరికీ తెలుస్తుందని దీప అంటుంది.

దీప, కార్తీక్ కి రిసెప్షన్

రిసెప్షన్ మా పెళ్లి గురించి కాదు మీ పెళ్లి గురించని స్వప్న అంటుంది. ఎవరికీ తెలియాల్సిన అవసరం లేదని దీప కోపంగా అంటుంది. మన వాళ్ళు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇప్పుడు మీ పెళ్లి గురించి నలుగురికీ తెలియాలని స్వప్న అంటుంది.

మంచి సలహా ఇచ్చారని కార్తీక్ మెచ్చుకుంటాడు. మీ రిసెప్షన్ మేమే చేస్తామని స్వప్న, కాశీ అంటారు. మీ ఆలోచన సరైనది కాదు. నాలుగు గోడల మధ్య అన్న మాటలే తీసుకోవడం కష్టంగా ఉంది. ఇక నలుగురిలో ఆయన పరువు తీయలేనని దీప అంటుంది.

నో చెప్పిన దీప

నా కారణంగా వీళ్ళు పడుతున్న అవమానాలు చాలు. రిసెప్షన్ చేసుకోవడం ఇష్టం లేదని చెప్తుంది. నిన్ను ఒప్పుకోమని నేను చెప్పను కానీ నేను ఒప్పుకుంటున్నాను. వాళ్ళు చేయాలని ఆశపడుతున్నారు. రిసెప్షన్ జరిగితే చూడాలని అందరూ అనుకుంటున్నారని కార్తీక్ నచ్చజెప్పడానికి చూస్తాడు.

ఎవరి గురించో ఆలోచించి సంతోషాన్ని పాడుచేసుకోకు. ఎప్పటికైనా మీ పెళ్లి గురించి అందరికీ తెలియాల్సిందే కదా. ఇప్పుడు మీరు బయటకు వెళ్తే అడిగిన ప్రతి ఒక్కరికీ సమాధానం చెప్పాలి. అదే రిసెప్షన్ తర్వాత వెళ్తే ఎవరికీ చెప్పాల్సిన పని లేదని దాసు ఒప్పించడానికి చూస్తాడు.

శౌర్యదే బాధ్యత

ఎన్ని చెప్పినా తనకు ఇష్టం లేదని ఇబ్బంది పెట్టొద్దని దీప ఖరాఖండీగా చెప్తుంది. రిసెప్షన్ అంటే ఏంటి అమ్మ ఎందుకు వద్దని అంటుందని శౌర్య కాశీని అడుగుతుంది. అమ్మానాన్న పెళ్లి గురించి అందరికీ తెలుస్తుందని స్వప్న చెప్తుంది. దీపను ఎలాగైనా ఒప్పించాలని స్వప్న, కాశీ ఆలోచిస్తారు.

కార్తీక్ శౌర్య వైపు వేలు చూపిస్తాడు. అమ్మను రిసెప్షన్ కు నువ్వే ఒప్పించాలని అందరూ చెప్తారు. పెళ్లి చూపులకు మంచి రోజులు ఎప్పుడు ఉన్నాయో కనుక్కోమని శివనారాయణ దశరథకు చెప్తాడు. దీప, కార్తీక్ రిసెప్షన్ ఇన్విటేషన్ కాశీ పారిజాతానికి పంపిస్తాడు.

రిసెప్షన్ గురించి తెలుసుకున్న శివనారాయణ

ఫోన్ చూస్తుంటే ఏంటి అదని శివనారాయణ కొడుక్కి ఇచ్చి చూడమని చెప్తాడు. దశరథ ఇన్విటేషన్ డిజైన్ అని అబద్ధం చెప్పడానికి ట్రై చేస్తాడు. కానీ అది పారిజాతానికి ఎందుకు వస్తుందని అంటాడు. దీప, కార్తీక్ రిసెప్షన్ ఇన్విటేషన్ అని చెప్తాడు. స్వప్న, కాశీలు ఈ రిసెప్షన్ చేస్తున్నారని చెప్తాడు.

శివనారాయణ పురాణం ఎత్తి తిడతాడు. పారిజాతం నువ్వు వెళ్తే ఇక ఇంట్లో స్థానం ఉండదని శివనారాయణ వార్నింగ్ ఇస్తాడు. రిసెప్షన్ అయిన తర్వాత మనం చాలా మందికి సమాధానం చెప్పాల్సి వస్తుందని అందరూ సిద్ధంగా ఉండమని చెప్తాడు. జ్యోత్స్న ఆవేశంగా దీప దగ్గరకు వెళ్లబోతుంటే పారిజాతం ఆపుతుంది.

మనం ఈ టైమ్ లో వెళ్ళి గొడవ చేస్తే ఇంట్లో తెలుస్తుంది. అందరూ ఛీ కొడతారని ఆపుతుంది. అక్కడితో నేటి కార్తీకదీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగిసింది.

Whats_app_banner