Karthika deepam november 6th episode: కాంచన మీద సుమిత్ర ఫైర్- శ్రీధర్ ని మాటలతోనే టార్చర్ చేసిన స్వప్న, కాశీ
Karthika deepam 2 serial today november 6th episode: కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. శ్రీధర్ ని రిసెప్షన్ కు రావాలని స్వప్న పిలుస్తుంది. తాను రానని అంటే తీసుకొస్తానని కావేరి మాట ఇస్తుంది. తండ్రీ కూతుర్ల మధ్య కాసేపు తిట్ల పురాణం జరుగుతుంది.
Karthika deepam 2 serial today november 6th episode: కార్తీక్ ఇప్పుడు దీప భర్త అని తనని కావాలని కోరుకోవడం తప్పని సుమిత్ర కూతురికి చెప్తుంది. కానీ జ్యోత్స్న మాత్రం అందుకు ఒప్పుకోదు. కూతురి భవిష్యత్ ఏంటో అర్థం కాక సుమిత్ర ఆందోళన చెందుతుంది. దీప కోపంగా ఇంట్లోకి వస్తే ఎక్కడికి వెళ్ళావని కాంచన అడుగుతుంది.
దీప చెప్పింది నిజం
బయట ఎవరో పిలిస్తే వెళ్ళానని అంటుంది. అప్పుడే కార్తీక్ వస్తాడు. డాక్టర్ శౌర్య గురించి ఏం చెప్పాడని అంటే ఇంతకముందు చెప్పిందేనని అంటాడు. రిసెప్షన్ గురించి దీప ఏం మాట్లాడటం లేదని అనసూయ అంటుంది. దీప చెప్పింది నిజమే ఈ రిసెప్షన్ జరగదు.
మనం ఇంతమంది చెప్తున్నా దీప ఎందుకు వద్దని అంటుందని ఆలోచించాను. చాలా సేపటికి దీప అంతరంగం నాకు అర్థం అయ్యింది. రిసెప్షన్ కోసం బంధువులు వస్తారు వచ్చిన వాళ్ళు నీ తండ్రి ఎక్కడ, నా భర్త ఎక్కడ అని అడిగితే నేను ఏం సమాధానం చెప్పాలి.
నాన్నను పిలుస్తాను
స్వప్నను అయినా మీ నాన్న ఎక్కడని అడుగుతారు. అందరి ప్రశ్నలకు ఏం సమాధానం చెప్పాలని అంటుంది. ఇవన్నీ ఆలోచించే రిసెప్షన్ వద్దని అంటున్నట్టు దీప చెప్తుంది. ఆ మనిషి రిసెప్షన్ కి వస్తే బాగుంటుందని నువ్వు అనుకుంటే నేను వెళ్ళి పిలుస్తానని కార్తీక్ చెప్తాడు.
అప్పుడే స్వప్న అవసరం లేదన్నయ్య మీరెవరూ ఆ ఇంటికి వెళ్లాల్సిన అవసరం లేదని అంటుంది. ఎవరూ వెళ్లకుండానే నాన్న వస్తారు నేను పిలుస్తాను. రిసెప్షన్ చేస్తుంది నేను కదా పిలవాల్సిన బాధ్యత మాదేనని స్వప్న చెప్తుంది. శ్రీధర్ రెండు పెళ్ళిళ్ళు చేసుకుని ఇద్దరు పిల్లల్ని కన్నారని స్వప్న అనేసరికి కాంచన కోపంగా పిలుస్తుంది.
శ్రీధర్ ఇంటికి కాశీ, స్వప్న
ఎవరు ఏం మాట్లాడుకోకుండా ఉండాలంటే రిసెప్షన్ ఆపేయాలని దీప అంటుంది. నేను చాలా మొండి దాన్ని రిసెప్షన్ చేసి చాలా మంది నోర్లు మూయించాలి. నేను వెళ్ళి డాడీని రిసెప్షన్ కి రమ్మని పిలుస్తానని స్వప్న చెప్తుంది. ఎవరు ఎన్ని చెప్పిన దీప మాత్రం తనకు ఇష్టం లేదని అంటుంది.
కావేరి కూతురు, అల్లుడిని ఇంటికి పిలిచి పదహారు రోజుల పండుగ చేయాలని అంటుంది. పని మనిషి కొడుకుని ఇంటి గుమ్మం కూడా తొక్కనివ్వనని శ్రీధర్ సీరియస్ అవుతాడు. అప్పుడే స్వప్న, కాశీ వస్తారు. వాళ్ళు ఈ ఇంటి గుమ్మంలోకి అడుగు పెట్టడానికి వీల్లేదని శ్రీధర్ అంటాడు.
తలబాదుకున్న శ్రీధర్
మీ ఇంటి దగ్గర నన్ను అవమానించావు కదా అని శ్రీధర్ కోపంగా అంటాడు. తప్పయిపోయిందని బతిమలాడి చేసిన దానికి నా కాళ్ళ మీద పడినా క్షమించనని చెప్తాడు. గుమ్మం బయట నిలబడి చెప్పాల్సింది చెప్పి పొమ్మని తిడతాడు. మావయ్యను ఏమి అనొద్దని కాశీ అంటే శ్రీధర్ నువ్వు జాలి చూపించకురా అని మంచి ఫన్నీ క్రియేట్ చేస్తాడు.
మీ నాన్న మాటలు పట్టించుకోవద్దు రమ్మని కావేరి పిలిస్తే స్వప్న ఇంట్లోకి వచ్చేస్తుంది. శ్రీధర్ తలకొట్టుకుంటాడు. వదిన, అన్నయ్యకు రిసెప్షన్ చేస్తున్నాం. నువ్వు డాడీని తీసుకుని తప్పకుండా రావాలి. డాడీ పెద్దమ్మ పక్కన నిలబడి అక్షింతలు వేయాలని స్వప్న అడుగుతుంది.
శ్రీధర్ కు టార్చర్
శ్రీధర్ వెటకారంగా మాట్లాడతాడు. మేం తప్పు చేశాం కానీ మీరు మోసం చేశారు రెండింటికీ తేడా ఉంది. రిసెప్షన్ కి రమ్మని స్వప్న పిలిస్తే శ్రీధర్ రానని అంటాడు. నేను తీసుకొస్తాలే అని కావేరి అనడంతో శ్రీధర్ బిత్తరపోతాడు. కాంచన సుమిత్రకు ఫోన్ చేస్తే ఏడుస్తూ మాట్లాడుతుంది.
కార్తీక్ దీపను పెళ్లి చేసుకోవడం నువ్వు కూడా తప్పు పడుతున్నావా అని కాంచన అడుగుతుంది. పిల్లలది తప్పు లేదు తప్పంతా మనది. నాకు నీ కొడుకు మీద కాదు నీ మీద కోపంగా ఉంది. మన ఇష్టాలకు పిల్లల జీవితాలని బలి చేసే అధికారం ఎవరు ఇచ్చారు.
కాంచనపై సుమిత్ర ఫైర్
పిల్లలు పెరిగాక వాళ్ళ మనసులు ఎలా ఉంటాయో తెలుసుకోకుండా నా కూతురిని నీ ఇంటి కోడలిగా ఇవ్వమని మాట అడగడం నీ తప్పు అయితే మాట ఇవ్వడం మీ అన్నయ్య తప్పు. అప్పుడు మీరు చేస్తున్న తప్పుకు ఇప్పుడు నా కూతురు ఏడుస్తుంది.
దాన్ని తిట్టాను, కొట్టాను అయినా ఏం లాభం లేదు. అది కార్తీక్ ని మర్చిపోలేకపోతుంది. కొడుకులా చూసుకున్న నా మేనల్లుడు నాకు అన్యాయం చేస్తే కూతురిలా చూసుకున్న దీప నా కూతురికి అన్యాయం చేసిందని సుమిత్ర ఆవేదన వ్యక్తం చేస్తుంది. అక్కడితో నేటి కార్తీకదీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగిసింది.
టాపిక్