Karthika deepam 2 serial: కొత్త ఇంటికి దీప, శౌర్య ప్రశ్నల పర్వం.. పారిజాతానికి నిజం చెప్పిన జ్యోత్స్న
Karthika deepam 2 serial today july 8th episode: కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. కడియం సహాయంతో దీప కొత్త ఇంటికి వెళ్తుంది. అమ్మమ్మ ఇల్లు వదిలిపెట్టి ఇక్కడికి ఎందుకు వచ్చామని శౌర్య దీపను ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంది.
Karthika deepam 2 serial today july 8th episode: దీప కడియం దగ్గరకు వస్తుంది. దీప అవసరం ఇక టిఫిన్ సెంటర్ కి లేదని తాను వెళ్లిపోతున్నానని చెప్తుంది. తమ కోసం ఇల్లు చూడమని అడుగుతుంది. కడియం తనకు తెలిసిన ఇల్లు ఉందని చెప్పి తీసుకుని వెళతాడు. దీప ఎక్కడికి వెళ్ళి ఉంటుందని కార్తీక్ ఆలోచిస్తూ ఉంటాడు.
కడియానికి కార్తీక్ ఫోన్
నరసింహ నుంచి పాపను సేవ్ చేయడం కోసం తనకు నేనే తండ్రినని చెప్తే వాడు వెళ్లిపోతానని అనుకుంటాడు. కానీ ఇలా దీప వెళ్లిపోతుందని అనుకోలేదని బాధపడతాడు. కొత్త ఇల్లు ఎలా ఉందని కడియం శౌర్యను అడిగితే తను కోపంగా వెళ్ళిపోతుంది. అసలు ఎందుకు వచ్చావు ఏమైంది ఏమైనా గొడవ జరిగిందా? కార్తీక్ బాబు ఏమైపోయాడని కడియం దీపను ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తాడు.
అప్పుడే కార్తీక్ కడియానికి ఫోన్ చేస్తాడు. దీప తన గురించి కార్తీక్ కి ఏం చెప్పొద్దని అడుగుతుంది. దీప హోటల్ దగ్గరకు వచ్చిందా అని అడుగుతాడు. లేదు రాలేదు ఇంటి దగ్గర ఉందేమో అని అంటాడు. ఏమైందని కడియం ఏం తెలియనట్టు అడుగుతాడు. రాత్రి నుంచి దీప కనిపించడం లేదు ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయిందని కార్తీక్ చెప్తాడు.
ఇంటి నుంచి ఎందుకు వచ్చేశావ్?
దీప నీ దగ్గరకు వస్తే తనకు ఫోన్ చేసి చెప్పమని చెప్తాడు. నువ్వు అంటే కార్తీక్ బాబుకి ఎంతో గౌరవం, అభిమానం. ఎంత పెద్ద కష్టం వచ్చిన కార్తీక్ బాబుతో చెప్తే సాయం చేస్తాడు కదాని కడియం అంటాడు. కానీ దీప మాత్రం తాను ఎక్కడ ఉన్నాను అనే విషయం ఎవరికీ తెలియకూడదు. నువ్వు కూడా ఇక్కడికి రావొద్దు. నువ్వు వస్తే వాళ్ళు నీ ద్వారా నన్ను తెలుసుకుంటారని దీప అంటుంది.
నువ్వు అదంతా కాదని అనుకోవడానికి కారణం ఏమిటని మరోసారి కడియం దీపను అడుగుతాడు. సమయం వచ్చినప్పుడు చెప్తాను ఇప్పుడు ఏమి అడగొద్దని చెప్తుంది. పారిజాతం జ్యోత్స్నను అసలు నిజం ఏమిటో చెప్పమని అడుగుతుంది. జ్యోత్స్న చాలా బాధగా ఏడుస్తుంది.
దీప మన దగ్గరే ఉండాలి
జ్యోత్స్న విషయం మొత్తం చెప్తుంది. శౌర్యకు కన్నతండ్రిని నేనే అని కార్తీక్ అన్నాడని చెప్పడంతో పారిజాతం కూలబడిపోతుంది. కొద్దిసేపతికి దీప ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయిందని దరిద్రం వదిలిపోయిందని అనుకున్నాను అంటుంది. శౌర్యను నా కూతురు అన్నవాడు రేపు దీప నా పెళ్ళాం అనడని గ్యారెంటీ ఏంటని పారిజాతం అనుమానపడుతుంది.
మీ బావ నీ మెడలో మూడు ముళ్ళు వేసేవరకు దీప మన కాంపౌండ్ లోనే ఉండాలి. అప్పుడే వాళ్ళ మధ్య ఏం జరుగుతుందో తెలుస్తుంది. ముందు తను ఎక్కడ ఉందో తెలుసుకోవాలని పారిజాతం చెప్తుంది. వెళ్ళి దీప ఎక్కడ ఉందో మీ బావను అడుగు అని పంపిస్తుంది.
శౌర్య ప్రశ్నల పర్వం
కార్తీక్ దీప గాజులు, ఫోన్ చూస్తూ బాధపడతాడు. ఇద్దరూ కాసేపు మనసులో మాట్లాడుకుంటారు. కొత్త ఇల్లు నచ్చలేదని, అమ్మమ్మ ఇంటికి తీసుకుని వెళ్ళమని శౌర్య అడుగుతుంది. ఇక్కడ ఎవరు ఉన్నారు? మనం ఇక్కడ ఎందుకు ఉండాలి? స్కూల్ కి కూడా వెళ్లొద్దని చెప్పావు?
కార్తీక్ ఎక్కడ? ఫోన్ చేసి మాట్లాడదామని అంటే ఫోన్ కూడా లేదు. అసలు ఏమైంది నీకు కార్తీక్ తో గొడవ జరిగిందా? జో గ్రానీ నిన్ను ఏమైనా అన్నదా? నేను నిద్రలో కార్తీక్ పేరు తలుచుకున్నానని నర్స్ చెప్పింది. నీ పేరు తలుచుకోలేదని కోపం వచ్చి కార్తీక్ ని తిట్టి పంపించావా?
కార్తీక్ తో నేను మాట్లాడటం ఇష్టం లేదా? అని వరుస ప్రశ్నలు వేస్తుంది. మనం అక్కడ ఉండాల్సిన అవసరం లేదని వచ్చేశానని దీప చెప్తుంది. నా కోసం కార్తీక్ వెతుకుతాడు. మనం కార్తీక్ ఇంటికి వెళ్దామని అడుగుతుంది. మనం ఎక్కడికి వెళ్ళడం లేదని ఇక్కడే ఉంటున్నామని దీప చెప్తుంది. అక్కడితో నేటి కార్తీకదీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగిసింది.
టాపిక్