Karthika deepam 2 serial today: 'శౌర్య కన్నతండ్రిని నేనే' అనేసిన కార్తీక్.. షాక్లో దీప, ముక్కలైన జ్యోత్స్న మనసు-karthika deepam 2 serial today july 4th episode karthik informs narasimha that sourya is his daughter ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Karthika Deepam 2 Serial Today: 'శౌర్య కన్నతండ్రిని నేనే' అనేసిన కార్తీక్.. షాక్లో దీప, ముక్కలైన జ్యోత్స్న మనసు

Karthika deepam 2 serial today: 'శౌర్య కన్నతండ్రిని నేనే' అనేసిన కార్తీక్.. షాక్లో దీప, ముక్కలైన జ్యోత్స్న మనసు

Gunti Soundarya HT Telugu
Published Jul 04, 2024 07:22 AM IST

Karthika deepam 2 serial today july 4th episode: కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. నరసింహ శౌర్య నా కూతురు అంటూ హాస్పిటల్ కి వచ్చి తనని తీసుకెళ్లడానికి వెళ్లబోతుంటే కార్తీక్ ఆపుతాడు. శౌర్య నీ కూతురు కాదు నేనే తన కన్నతండ్రిని అని ఆవేశంగా చెప్తాడు.

కార్తీకదీపం 2 సీరియల్ జులై 4వ తేదీ ఎపిసోడ్
కార్తీకదీపం 2 సీరియల్ జులై 4వ తేదీ ఎపిసోడ్ (disney plus hotstar )

Karthika deepam 2 serial today july 4th episode: ఏమైంది బూచోడు అంటే వాడే కదా.. వాడు వచ్చాడా? అని కార్తీక్ దీపను అడుగుతాడు. అవును బాబు నిద్రపోతున్న పాపను ఎత్తుకుపోవాలని అనుకున్నాడు. చివరి నిమిషంలో చూసి నా కూతురిని కాపాడుకున్నాను. కానీ సడెన్ గా వాడిని చూసి భయపడి స్పృహ తప్పి పడిపోయిందని చెప్తుంది.

కార్తీక్ ఆవేశం

పాప మిమ్మల్నే కలవరిస్తుంటే మీకు ఫోన్ చేశానని అంటుంది. ఇంటికి వచ్చి పాపను ఎత్తుకుని పోదామని అనుకున్నాడంటే వాడికి ఎంత ధైర్యం మీరు ఎందుకు ఊరుకున్నారని కార్తీక్ ఆవేశపడతాడు. అసలు వాడు పాప జోలికి ఎందుకు వచ్చాడని అడుగుతాడు. వద్దు వదిలేయండి నేను మీకు ఏం చెప్పలేనని దీప అంటుంది.

శౌర్య కోసం ఆగుతాను కానీ తను కోలుకున్న తర్వాత వాడికి మాత్రం గట్టిగా ఉంటుంది. నేను చేయాల్సింది నేను చేస్తానని అంటాడు. శౌర్యను తన తండ్రి తీసుకుని వెళ్లిపోతానని అంటే దీప ఎందుకు వద్దని అంటుంది. అసలు ఏం జరుగుతుంది. దీప శౌర్యను హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళి ఉంటుంది.

బావ వచ్చి ఉంటాడని అనుకుని కార్తీక్ కి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడు. మీ ఇద్దరి మధ్య ఏదో జరుగుతుంది అది ఏంటో నేనే కనిపెడతానని జ్యోత్స్న అనుకుంటుంది. శౌర్య నిద్రలో కూడా కార్తీక్ అని కలవరిస్తుంది. నర్స్ అది విని కార్తీక్ పాప తండ్రి అనుకుంటుంది.

హాస్పిటల్ లో నరసింహ

అది స్పృహలో లేకపోయినా మిమ్మల్ని కలవరించెంత దగ్గర అయ్యారు. అందుకే ఇలా జరుగుతుందని నేను మిమ్మల్ని పాపకు దూరంగా ఉండమన్నాను. నేను దీనికి బలం అనుకున్నాను. కానీ మీరు దీనికి బలహీనత అయ్యారు. నేను పక్కన ఉన్నా కూడా మిమ్మల్ని పిలవాల్సి వచ్చిందని దీప బాధగా చెప్తుంది.

కార్తీక్ ని శౌర్య దగ్గర ఉంచి దీప ఫుడ్ కోసం బయటకు వెళ్తుంది. అక్కడ నరసింహ ఉంటాడు. తన బిడ్డ జోలికి రావద్దని దీప అంటుంది. నువ్వు బిడ్డను తీసుకుని రోడ్డు మీద పరిగెడుతుంటే నిన్ను ఫాలో అయ్యాను. అది ఏంటి కలవరిస్తే నిన్ను లేదా మా అమ్మను కలవరించాలి. కానీ కార్తీక్ ని కలవరిస్తుంది ఏంటని నరసింహ అడుగుతాడు.

నువ్వే కదా ఫోన్ చేసి పిలిచావని అంటాడు. సహనం కోల్పోయాను వెళ్లిపో అంటుంది. నా కూతురిని ఎత్తుకుపోదామని వచ్చాను. ఈరోజే నేను దీనికి ఒక ముగింపు ఇస్తాను. శౌర్య నా కూతురు అయితే నాకు ఇచ్చేయ్ లేదా దానికి తండ్రి నేను కాదని చెప్పమని అడుగుతాడు.

సమాధానం చెప్తే వెళ్లిపోతా

తన కూతురు పరిస్థితి బాగోలేదని వెళ్లిపొమ్మని దీప చెప్తుంది. అయితే నా కూతురిని నేను తీసుకుని పోనా అంటాడు. ఎవరిని ఎత్తుకుని వెళ్తావ్ అని కార్తీక్ నరసింహ కాలర్ పట్టుకుంటాడు. దీప వదిలేయమని దీప అడ్డుపడుతుంది. ఇప్పుడు ఇలాంటి గొడవలు వద్దని దీప కార్తీక్ ని ఆపుతుంది.

దీపను బాధపెట్టడానికి నువ్వు పాప జోలికి వస్తే ఏ రేంజ్ దాకా వెళ్తానో కూడా తెలియదని కార్తీక్ వార్నింగ్ ఇస్తాడు. సర్ కి అసలు విషయం తెలియదా? చెప్పలేదా అని నరసింహ అంటాడు. ఏంటి అది అని కార్తీక్ దీపను అడుగుతాడు. నేను పాప జోలికి వచ్చింది మీ దీపను బాధపెట్టడం కోసం కాదు.

మేడమ్ కి ఇచ్చిన గడువులోగా సమాధానం చెప్పలేదు అందుకే పాప దగ్గరకు వచ్చానని అంటాడు. శౌర్య నాకు పుట్టిన కూతురు అయితే నాకు ఇచ్చేయమని చెప్పండి తీసుకుని పోతా. నాకు పుట్టలేదంటే అదే మాట చెప్పండి నేను మళ్ళీ దీప జోలికి వస్తే మీ షూ తీసుకుని కొట్టండి అంటాడు.

శౌర్య కన్న తండ్రిని నేనే

కార్తీక్ గతంలో దీప బాధపడిన సంఘటనలు గుర్తు చేసుకుంటాడు. దీప మౌనంగా ఉండేసరికి శౌర్య నా కూతురు అని ఒప్పుకున్నట్టే కదా నేను నా కూతురిని తీసుకుని వెళ్లిపోతానని అంటాడు. నరసింహ వెళ్తుంటే కార్తీక్ ఆపుతాడు. పాప జోలికి వెళ్లొద్దని కార్తీక్ చెప్తాడు.

తన పరిస్థితి బాగోలేదని వదిలేయమని దీప బతిమలాడుతుంది. కానీ నరసింహ వినిపించుకోకుండా నేను నా కూతురిని తీసుకుని వెళ్లిపోతానని అంటాడు. నువ్వు పాపను తీసుకుని వెళ్ళడానికి వీల్లేదని కార్తీక అడ్డుపడుతూ ఉంటాడు. ఆవేశంగా శౌర్య నీ కూతురు కాదని కార్తీక్ గట్టిగా అరుస్తాడు. శౌర్య నా కూతురు అంటాడు.

ఇదంతా జ్యోత్స్న చూస్తూనే ఉంటుంది. కార్తీక్ మాటతో దీప షాక్ అయిపోతుంది. నేనే శౌర్య కన్నతండ్రిని అంటాడు. నీకు కావాల్సిన సమాధానం దొరికింది కదా పో అంటాడు. జ్యోత్స్న గుండెలు ముక్కలైపోతుంది. ఇన్ని రోజులు వెంట పడినా సమాధానం చెప్పనిది ఇందుకేనా నువ్వు ఎలాంటి దానివో ఇప్పుడు అర్థం అయ్యిందని అనేసి నరసింహ వెళ్ళిపోతాడు.

ముక్కలైన జ్యోత్స్న హృదయం

జ్యోత్స్న ఏడుస్తూ వెళ్ళిపోతుంది. తన కాళ్ళ పట్టీల సౌండ్ కార్తీక్ వింటాడు. దీప కార్తీక్ మీద అరవబోతుంటే శౌర్య పిలుస్తుంది. పాప వాళ్ళ మాటలు విన్నదేమోనని కంగారుపడుతుంది. శౌర్య దీపకు ఫుడ్ తినిపిస్తుంటే కార్తీక్ ఎక్కడని అడుగుతుంది. శౌర్య కార్తీక్ బాబు అన్న మాటలు విన్నదో లేదో అర్థం కావడం లేదని దీప టెన్షన్ పడుతుంది.

జ్యోత్స్న కార్తీక్ మాటలు తలుచుకుని బాగా ఏడుస్తుంది. శౌర్య నీ కూతురు ఏంటి అది నువ్వు చెప్పడం ఏంటి? ఇదంతా ఏంటి ఇప్పుడు నేనేమైపోవాలి? దీన్ని డైజెస్ట్ చేసుకోవడం నా వల్ల కావడం లేదని గుండెలు పగిలేలా ఏడుస్తుంది. దీప ఆవేశంగా కత్తెర పట్టుకుని కార్తీక్ మీదకు ఎత్తుటుంది. నువ్వా నా కూతురికి తండ్రివి అని కోపంగా అంటుంది. అక్కడితో నేటి కార్తీకదీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగిసింది.

Whats_app_banner