Karthika deepam 2 serial: కూతురిని ఎత్తుకెళ్లబోయిన నరసింహ.. కాపాడుకున్న దీప, కార్తీక్ కోసం కలవరించిన శౌర్య
Karthika deepam 2 serial today july 3rd episode: కార్తీక దీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. నరసింహ ఇంటికి వచ్చి శౌర్యను ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నిస్తాడు. గమనించిన దీప కూతురిని కాపాడుకుంటుంది. అదంతా చూసిన శౌర్య భయంతో స్పృహ కోల్పోతుంది.

Karthika deepam 2 serial today july 3rd episode: రెస్టారెంట్ లో దీప ప్రవర్తన చూస్తే నాకు కొత్త దీప కనిపించింది. నేను బావను పెళ్లి చేసుకోవడం దీపకు ఇష్టం లేదు. మావయ్య ఎందుకో పక్కకి వెళ్ళాడు. దీప వెళ్ళి మాట్లాడి వచ్చింది. బావకు తెలిసిన అమ్మాయి స్వప్న వాళ్ళ అమ్మతో వచ్చింది. తనని వెళ్లిపొమ్మని దీప చెప్పింది.
దీపకు బావతో నా పెళ్లి ఇష్టం లేదు
ఇదే విషయం నేను అడుగుదామని అనుకుంటే అత్తయ్య అడిగింది. బావ, మావయ్య, దీపకు మధ్య ఏదో జరుగుతుంది. కానీ ఒకటి క్లియర్ గా అర్థం అవుతుంది. దీపకు నేను బావను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని జ్యోత్స్న అనుమానపడుతుంది. వీలైనంత త్వరగా మీకు ముహూర్తాలు పెట్టించి నిశ్చితార్థం చేయించాలని పారిజాతం అంటుంది.
ఎంగేజ్ మెంట్ జరగడానికి ముందే దీప ఇక్కడ ఉండకూడదని జ్యోత్స్న అంటుంది. అలా అయితే దీప ఊహించలేని సంఘటన ఏదైన జరగాలని అనుకుంటారు. దీప చేసిన అవమానం గుర్తు చేసుకుని కావేరి, స్వప్న రగిలిపోతారు. రెస్టారెంట్ మా బావది కానీ అక్కడ దీప పెత్తనం ఏంటో అర్థం కాలేదని స్వప్న తల్లికి సోరి చెప్తుంది.
ఏదో జరుగుతుంది
దీప ప్రవర్తన అలాంటిదే ఒకసారి తన టిఫిన్ సెంటర్ దగ్గర ఉప్మా బిర్యానీ కోసం కొట్టుకునేంత పని జరిగిందని కావేరి చెప్తుంది. అక్కడ అందరూ బాస్ వాళ్ళ నాన్న గురించి వెయిట్ చేస్తున్నారు. దీప వెళ్తుంది వస్తుంది, జ్యోత్స్న కోపంగా చూస్తుంది. అక్కడ వాళ్ళ మధ్య ఏదో జరుగుతుంది.
దీప బాస్ మీద అంత కమాండ్ చేయడానికి వాళ్ళ మధ్య సంబంధం ఏంటో కనుక్కోవాలి. ఒకసారి బాస్ ఇంటికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడాలని స్వప్న అనుకుంటుంది. అసలు దీప ముందు అలా ఎందుకు మాట్లాడిందో అడగాలని నిర్ణయించుకుంటుంది. దీప రెస్టారెంట్ లో జరిగిన విషయం గుర్తు చేసుకుంటుంది.
నిజం తెలిస్తే అటు స్వప్న, ఇటు కాంచన గారి పరిస్థితి ఏంటోనని దీప బాధపడుతుంది. అప్పుడే నరసింహ మెల్లగా ఇంట్లోకి చొరబడతాడు. దీప గమనించుకోదు. నిద్రపోతున్న శౌర్యను ఎత్తుకుని వెళ్లిపోవాలని ట్రై చేస్తాడు. దీప శౌర్య కోసం వెతుకుతూ ఉంటుంది.
శౌర్యను ఎత్తుకెళ్లబోయిన నరసింహ
కాసేపటికి నరసింహ శౌర్యను ఎత్తుకుని పోవడం చూస్తుంది. నేను నా కూతురిని తీసుకుని వెళ్తున్నాను ఏం చేసుకుంటావో చేసుకోమని పారిపోతుంటే దీప అడ్డుపడుతుంది. ఇది నా కూతురు నా దగ్గరే ఉండాలని అంటాడు. దీప శౌర్యని నిద్రలేపుతుంది. శౌర్య కళ్ళు తెరిచి అమ్మా బూచోడు అని భయపడుతుంది.
నరసింహను తోసేసి శౌర్యను తీసుకుంటుంది. వెంటనే పక్కన ఉన్న గొడ్డలి పట్టుకుంటుంది. . ఇంకోసారి నా బిడ్డ జోలికి వస్తే నేను చచ్చినా పరవాలేదు నిన్ను మాత్రం బతకనివ్వనని అంటుంది. అడుగు ముందుకు వేస్తే నరుకుతానని బెదిరించేసరికి నరసింహ భయంతో పారిపోతాడు.
కార్తీక కోసం కలవరింత
అదంతా చూసి శౌర్య భయంతో కళ్ళు తిరిగిపడిపోతుంది. ఎంత లేపినా శౌర్య లేవకపోవడంతో దీప చాలా కంగారుగా ఏడుస్తుంది. శౌర్యకు ఏమైంది దీప ఎందుకు ఏడుస్తుందని జ్యోత్స్న అనుకుంటుంది. దీప శౌర్యను హాస్పిటల్ కి తీసుకొస్తుంది. షాక్ కి గురవడం వల్ల భయపడిపోయిందని డాక్టర్ చెప్తాడు.
పాపకు ఏం కాలేదని భయపడొద్దని డాక్టర్ ధైర్యం చెప్తాడు. శౌర్య నిద్రలో కార్తీక్ అని కలవరిస్తుంది. పాప తన నాన్నని కలవరిస్తుంది వెంటనే అతన్ని పిలిపించండి. అతని గొంతు వినిపిస్తే త్వరగా కోలుకునే అవకాశం ఉంది రమ్మని చెప్తాడు. నర్స్ తన మాటలతో దీపను మరింత భయపెడుతుంది.
శౌర్యను చూసి అల్లాడిన కార్తీక్
కొన్ని సార్లు పేషెంట్లు ఇలా కలవరించి కోమాలోకి కూడ వెళ్తున్నారు. మళ్ళీ కోలుకోవడానికి రెండు మూడు రోజులు పడుతుందని నర్స్ చెప్తుంది. తన కూతురిని కాపాడుకోవాలని అనుకుని దీప కార్తీక్ కి ఫోన్ చేస్తుంది. శౌర్యను హాస్పిటల్ లో చేర్పించానని చెప్తుంది.
కార్తీక్ టెన్షన్ గా హాస్పిటల్ కి వస్తాడు. శౌర్యను చూసి అల్లాడిపోతాడు. కార్తీక్ వచ్చి రౌడీ అని పిలవగానే కళ్ళు తెరుస్తుంది. కార్తీక్ బూచోడు ఎత్తుకుపోతాడని భయపడుతూ చెప్తుంది. నేను ఉన్నాను కదా ఇక్కడకు ఎవరూ రారని అంటుంది. నువ్వు వెళ్లిపోతే బూచోడు వస్తాడు ఎక్కడికి వెళ్లకు అని శౌర్య అడుగుతుంది.
కార్తీక్ నేను పడుకున్నాక నువ్వు వెళ్లిపోకు బూచోడు ఎత్తుకుని వెళ్లిపోతాడని శౌర్య మళ్ళీ చెప్తుంది. నేను ఉంటానులే అని కార్తీక్ ధైర్యం చెప్తాడు. అక్కడితో నేటి కార్తీకదీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగిసింది.