Karthika deepam 2 serial: ఇంటి నుంచి వెళ్ళిపోయిన దీప.. దరిద్రం వదిలిందన్న జ్యోత్స్న, టెన్షన్ లో కార్తీక్
Karthika deepam 2 serial today july 6th episode: కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. దీప సుమిత్ర వాళ్ళ అవుట్ హుస్ ఖాళీ చేసి వెళ్ళిపోతుంది. విషయం తెలుసుకున్న కార్తీక్ టెన్షన్ గా హాస్పిటల్ కి వస్తాడు. దరిద్రం వదిలిపోయిందని జ్యోత్స్న సంబరపడుతుంది.
Karthika deepam 2 serial today july 6th episode: దీప ఇంటికి వచ్చి బ్యాగ్ సర్దుకుంటుంది. మీరు ఇచ్చిన గడువులోపే డబ్బులు మీకు అందుతాయి అని లెటర్ రాసి దీప డబ్బులు పెట్టె డబ్బాలో పెడుతుంది. జ్యోత్స్న దీపను చూస్తుంది. తన సంగతి తేల్చేయాలని ఆవేశంగా కిందకు వెళ్తుంది.
వెళ్ళిపోయిన దీప
క్షమించండమ్మా నేను ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయే పరిస్థితి తీసుకొచ్చాడు మీ మేనల్లుడు. నేను ఇక్కడే ఉంటే నరసింహ ఇక్కడికి వచ్చి జరిగింది మొత్తం చెప్తే మీరు అడిగే ఏ ప్రశ్నకు సమాధానం చెప్పుకోలేను అందుకే వెళ్లిపోతున్నాను. నన్ను క్షమించండి అనేసి వెళ్ళిపోతుంది.
దీప ఇలా ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోతుందని ఊహించలేదు. నేను చేయాలనుకున్న పని దానంతట అదే చేసిందని జ్యోత్స్న హ్యాపీగా ఫీల్అవుతుంది. దరిద్రం వదిలిపోయింది. శౌర్య నా కూతురే అని బావ అన్న మాట ఎవరికీ చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే దీనికి కారణమైన దీప వెళ్ళిపోయింది. కానీ దీప నిన్ను నేను ఎప్పటికీ క్షమించలేనని జ్యోత్స్న అంటుంది.
దీప లేదని తెలుసుకున్న సుమిత్ర
శౌర్య నిద్రలో కార్తీక్ ని కలవరిస్తుంది. అప్పుడే దీప వస్తుంది. నర్స్ పాప వాళ్ళ నాన్నను కలవరిస్తుందని చెప్తుంది. వాళ్ళ నాన్నను ఉండమనవచ్చు కదా అని అంటుంది. శౌర్యకు మళ్ళీ ఫీవర్ వచ్చిందని చెప్తుంది. అమ్మ ఇక్కడే ఉంది నిన్ను వదిలి ఎక్కడికి పొదని దీప చెప్తుంది.
మనం అందరికీ దూరంగా వెళ్లిపోదాం ఇంకెవరికీ కనిపించొద్దని దీప మనసులో చాలా బాధపడుతుంది. సుమిత్ర అవుట్ హౌస్ వైపు చూస్తుంది. దీప కోసం లోపలికి వెళ్ళి చూడగా ఇల్లు అంతా ఖాళీగా ఉంటుంది. కంగారుగా బయటకు వచ్చి దశరథకు విషయం చెప్తుంది.
దీప ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయిందని, బట్టలు, బ్యాగ్ లేవని అంటుంది. పిన్ని దీపను ఏమైన అని ఉంటుందా ఎందుకు వెళ్లిపోయిందని దశరథ అనుమానపడతాడు. నేను ఏమంటానని పారిజాతం అడుగుతుంది. శివనారాయణ జ్యోత్స్న కనిపించిందా అని సుమిత్రను అడుగుతాడు.
కార్తీక్ డబ్బులు తిరిగి ఇచ్చేయమన్న దీప
ఇక్కడ దీప, అక్కడ జ్యోత్స్న కనిపించడం లేదు ఎక్కడికి వెళ్లారని టెన్షన్ పడతారు. దీప ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయిందని చెప్పేసరికి శివనారాయణ కూడా పారిజాతాన్ని నిలదీస్తాడు. దీప బ్యాగ్ లు తీసుకురావడం చూసి ఎందుకు తీసుకొచ్చావని శౌర్య అడుగుతుంది.
హాస్పిటల్ బిల్ కట్టడానికి దీప వెళ్తుంది. నైట్ కార్తీక్ గారు బిల్లు కట్టారు ఇంకా మీకే డబ్బులు తిరిగి వస్తాయని నర్స్ చెప్తుంది. నా కూతురు బిల్లు మీరు కట్టాల్సిన అవసరం లేదని దీప తన తండ్రి చేయించిన గాజులు, ఫోన్ హస్పిటల్ వాళ్ళకు ఇస్తుంది. సర్ డబ్బులు సర్ కి ఇచ్చేసేయండని చెప్పేసి వెళ్ళిపోతుంది.
దీప వెళ్లిపోతే ఏమైంది?
జ్యోత్స్న జాగింగ్ నుంచి ఇంటికి వస్తుంది. దీప వెళ్ళిపోవడం తనకు తెలుసని చెప్పేసరికి సుమిత్ర సీరియస్ అవుతుంది. ఎందుకు చెప్పాలి, తను ఏమైనా మన ఇంటి మనిషా ఈ టైమ్ లో ఎందుకు వెళ్తున్నావని అడగటానికి. నిన్ను కాపాడింది మన అవసరం కోసం ఉండమన్నాము. తర్వాత తన అవసరం కోసం ఉంది అవసరం తీరిపోయిన తర్వాత వెళ్ళిపోయింది వదిలేయొచ్చు కదా అంటుంది.
నేను తప్పిపోయినట్టు కనిపించడం లేదని అంత కంగారుపడతారు ఏంటి? అని నిలదీస్తుంది. దీప ఎలాంటిదో మీకు అర్థం కావడం లేదని జ్యోత్స్న మాట్లాడటం చూసి శివనారాయణ ఆశ్చర్యపోతాడు. దీపను తప్పుగా అర్థం చేసుకుంటున్నావని ఇంట్లో వాళ్ళు చెప్పడానికి చూస్తుంటే జ్యోత్స్న వినిపించుకోదు.
బావ రెస్టారెంట్ కి పెళ్లి గురించి మాట్లాడటానికి పిలిచాడని డౌట్ వచ్చింది అంటూ అక్కడ జరిగిన విషయం చెప్తుంది. మావయ్యను రానివ్వకుండా ఆపాల్సిన అవసరం దీపకు ఏంటో అర్థం కావడం లేదు. అర్థరాత్రి ఇల్లు ఖాళీ చేసే అవసరం ఏంటో అర్థం కాలేదని చెప్పి కోపంగా వెళ్ళిపోతుంది.
దీప గురించి తెలుసుకున్న కార్తీక్
పారిజాతం దీప గురించి మాట్లాడితే శివనారాయణ తన నోరు మూయిస్తాడు. కార్తీక్, జ్యోత్స్నకు వీలైనంత త్వరగా నిశ్చితార్థం జరిపించమని చెప్పాను కదా అది మాత్రం ఆలోచించరని పారిజాతం రివర్స్ లో తిట్టేసి వెళ్ళిపోతుంది. జ్యోత్స్న మనసు చెడగొట్టింది ఈ పారిజాతమేనని అంటాడు.
దీప గురించి తెలుసుకునేందుకు దశరథ కార్తీక్ కి ఫోన్ చేస్తాడు. దీప అక్కడికి వచ్చిందా అని అడుగుతాడు. తను అవుట్ హౌస్ ఖాళీ చేసి వెళ్లిపోయిందని దశరథ చెప్తాడు. కార్తీక్ టెన్షన్ పడతాడు. కార్తీక్ హాస్పిటల్ కి వస్తాడు. రిసెప్షన్ లో ఉన్న నర్స్ కార్తీక్ ని ఆపుతుంది.
శౌర్యను వాళ్ళ అమ్మ తీసుకుని వెళ్లిపోయిందని చెప్తుంద. దీప ఇచ్చిన గాజులు, ఫోన్ కార్తీక్ తీసుకుంటాడు. దీప కడియం దగ్గరకు వస్తుంది. ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావని అడుగుతాడు. తన ఇంట్లో ఉండమని అడుగుతాడు. వద్దు నేను వాళ్ళకు దూరంగా ఎవరికి తెలియని చోటుకు వెళ్లాలని అనుకున్నాను.
కానీ నీకు ఇచ్చిన మాట గుర్తుకు వచ్చింది. నీ హోటల్ వ్యాపారం కూడా బాగుంది. ఇక దీప అవసరం నీ టిఫిన్ సెంటర్ కి లేదని చెప్పి వెళ్లిపోతానని అంటుంది. అక్కడితో నేటి కార్తీకదీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగిసింది.
టాపిక్