Karthika deepam 2 serial: కావేరి వెళ్లిపోయేలా చేసిన దీప.. నిలదీసిన కార్తీక్, మొత్తం చూసేసిన జ్యోత్స్న-karthika deepam 2 serial today june 2nd episode deepa helps sridhar by diverting kaveri and swapna from his family ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Karthika Deepam 2 Serial: కావేరి వెళ్లిపోయేలా చేసిన దీప.. నిలదీసిన కార్తీక్, మొత్తం చూసేసిన జ్యోత్స్న

Karthika deepam 2 serial: కావేరి వెళ్లిపోయేలా చేసిన దీప.. నిలదీసిన కార్తీక్, మొత్తం చూసేసిన జ్యోత్స్న

Gunti Soundarya HT Telugu
Jul 02, 2024 07:05 AM IST

Karthika deepam 2 serial today june 2nd episode: కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. స్వప్న, కావేరి కార్తీక్ దగ్గరకు వస్తారు. వాళ్ళను చూసి శ్రీధర్ కనిపించకుండా పక్కకి వెళ్ళిపోతాడు. ఎక్కడ దొరికిపోతానో అని తెగ టెన్షన్ పడిపోతాడు.

కార్తీకదీపం 2 సీరియల్ జులై 2వ తేదీ ఎపిసోడ్
కార్తీకదీపం 2 సీరియల్ జులై 2వ తేదీ ఎపిసోడ్ (disney plus hotstar )

Karthika deepam 2 serial today june 2nd episode: కార్తీక్ వాళ్ళ రెస్టారెంట్ కి స్వప్న, కావేరిలు రావడం దీప చూస్తుంది. వెంటనే శ్రీధర్ కి సైగ చేసి వాళ్ళను చూపిస్తుంది. వీళ్ళిద్దరూ ఇక్కడికి వచ్చారు ఏంటి? ఇక్కడ వీళ్ళు నన్ను చూస్తే కొంప మునిగిపోతుందని టెన్షన్ పడతాడు. పెళ్లి గురించి నిర్ణయం త్వరగా చెప్పమని జ్యోత్స్న, కాంచన అడుగుతారు.

కార్తీక్ దగ్గరకు వచ్చిన స్వప్న 

శ్రీధర్ గారు ఇప్పుడు ఎలా తప్పించుకుంటారు. కాంచన గారిని చూస్తుంటే జాలిగా ఉందని దీప బాధపడుతుంది. పెళ్లి గురించి చెప్పమని కాంచన అడుగుతుంది. శ్రీధర్ కంగారుగా మీరు మాట్లాడుతూ ఉండండి ఇప్పుడే వచ్చేస్తానని టెన్షన్ గా వెళ్ళిపోతాడు. స్వప్న వాళ్ళు డైరెక్ట్ గా కార్తీక్ దగ్గరకు వెళ్లిపోతారు.

స్వప్నను కాంచనకు పరిచయం చేస్తాడు. బాస్ నా గురించి ఏమైనా చెప్పాడా? అని వాగుతూ ఉంటుంది. స్వప్న వాళ్ళ అమ్మను కాంచనకు పరిచయం చేస్తుంది. ఏ క్షణమైనా బాంబు పేలవచ్చు అని శ్రీధర్ వణికిపోతూ ఉంటాడు. కార్తీక్ జ్యోత్స్నను పరిచయం చేస్తూ మరదలు అంటాడు.

కాబోయే భార్య అని పరిచయం చేయమని కాంచన అంటుంది. ఖాళీగా ఉన్న సీటు చూసి అక్కడ ఎవరు ఉన్నారని అడుగుతుంది. నాన్న ఉన్నారు రాగానే పరిచయం చేస్తానని చెప్తాడు. జ్యోత్స్న ఏదో చెప్పాలని అడిగావు కదా అది ఏంటో చెప్పమని అడుగుతుంది.

థాంక్స్ చెప్పిన శ్రీధర్ 

దీప శ్రీధర్ దగ్గరకు వస్తుంది. మీరు అక్కడికి వస్తే అందరికీ నిజం తెలిసిపోతుందని అంటుంది. నువ్వు సాయం చేయకపోతే అందరికీ దొరికిపోయేవాడినని దీపకు థాంక్స్ చెప్తాడు. నిజం తెలిస్తే కాంచనగారు ప్రాణాలతో మిగలరు. ఏదో ఒక రోజు నిజం తెలుస్తుంది. కానీ అది ఇప్పుడు తెలియడం కరెక్ట్ కాదని అంటుంది.

ఏం చేయాలో అర్థం కావడం లేదని శ్రీధర్ బాధపడతాడు. ఈ నిజం నేనే కాంచన గారికి చెప్పాలని అనుకున్నాను కానీ ఆవిడకు నిజం తెలిస్తే చనిపోతుందని ఆగిపోయాను. మీరు మాత్రం వాళ్ళ జీవితాలతో ఆడుకోవద్దు. జ్యోత్స్నకు అనుమానం వచ్చి దీప వెళ్ళిన వైపు వెళ్తుంది.

మొత్తం చూసేసిన జ్యోత్స్న 

మీరే అందరికీ అర్థం అయ్యేలా చెప్పాలని దీప చెప్తుంది. శ్రీధర్, దీప మాట్లాడుకోవడం జ్యోత్స్న చూస్తుంది. మావయ్యతో మాట్లాడుతుంది, దీప ఏదో చేస్తుందని జ్యోత్స్న డౌట్ పడుతుంది. కాసేపటికి జ్యోత్స్న వచ్చేస్తుంది. తర్వాత దీప కూడా వచ్చేస్తుంది.

మీ నాన్న ఇంకా రాలేదు ఏంటి ఫోన్ చేయమని కాంచన అడుగుతుంది. శ్రీధర్ గారు ఫోన్ మాట్లాడుతున్నారని దీప అబద్ధం చెప్తుంది. కావేరి వాళ్ళు వేరే టేబుల్ దగ్గరకు వెళ్ళి కూర్చుంటామని చెప్తే కార్తీక్ ఆపుతాడు. కానీ దీప మాత్రం వెళ్లనివ్వండి వాళ్ళు ఇబ్బంది పడతారేమోనని అనేస్తుంది.

హర్ట్ అయిన కావేరి 

కావేరికి కోపం వచ్చేస్తుంది. మేమేమి ఇక్కడ ఉండటానికి రాలేదని కోపంగా వెళ్ళిపోతుంది. ఏంటి దీప నువ్వేనా ఇలా మాట్లాడింది అని కాంచన కూడా ఆశ్చర్యంగా అడుగుతుంది. అప్పుడే శ్రీధర్ వస్తాడు. వాళ్ళు ఇబ్బంది పడతారు ఏమోనని అలా అన్నానని చెప్తుంది.

ఇంతసేపు ఎవరితో మాట్లాడుతున్నారు ఇప్పటి దాక స్వప్న, వాళ్ళ అమ్మ మీ కోసం వెయిట్ చేశారని కాంచన శ్రీధర్ ని అడుగుతుంది. వాళ్ళు వెళ్లిపోయారని అంటే దీప వెళ్లిపోయేలా చేసిందని జ్యోత్స్న అంటుంది. పెళ్లి గురించి మాట్లాడమని జ్యోత్స్న అడిగితే ఇప్పుడు వీళ్ళు ఉన్న మూడ్ లో మాట్లాడటం కరెక్ట్ కాదని అనుకుని చెప్పకుండా ఆగిపోతాడు.

దీపకు కావాలనే చెడగొట్టింది 

బావతో పెళ్లి గురించి మాట్లాడకుండా దీప ఆపింది, మావయ్య రాకుండా ఆపింది దీప ఎంత మోసం చేస్తుందని జ్యోత్స్న మనసులో అనుకుంటుంది. స్వప్న రాకపోయి ఉంటే పెళ్లి కార్తీక్ బాబు పెళ్లి గురించి మాట్లాడేవాళ్ళు అని దీప అనుకుంటుంది. తర్వాత కార్తీక్ దీప దగ్గరకు వెళ్ళి మాట్లాడతాడు.

ఎందుకు కంగారుపడుతున్నారు? ఎప్పుడు ఎవరిని ఒక మాట కూడా అనని మీరు ఈరోజు స్వప్న వాళ్ళ అమ్మ ఇబ్బంది పడేలా మాట్లాడారు. కావాలని ఆవిడను పంపించాలనే ఉద్దేశంతో మాట్లాడారని అడుగుతాడు. నేను కాదు చెప్పాల్సింది మీరు పెళ్లి గురించి మాట్లాడటానికి మమ్మల్ని ఎందుకు పిలిచారని అడుగుతుంది.

నిలదీసిన కార్తీక్ 

దానికి దీనికి సంబంధం లేదు. మీరు నా దగ్గర ఏదో దాస్తున్నారు. అది మనసులో పెట్టుకుని బాధపడుతున్నారు. నాతో ఏదో చెప్పాలని అనుకుని చెప్పడం లేదు. అది ఏంటో చెప్పమని కార్తీక్ గట్టిగా అడుగుతాడు. దీప సరిగా నిజం చెప్పే టైమ్ కి శౌర్య వస్తుంది.

నీరసంగా ఉందని చెప్పకుండా కార్తీక్ నుంచి తప్పించుకుని వెళ్ళిపోతుంది. జ్యోత్స్న రెస్టారెంట్ లో జరిగిన దాని గురించి రగిలిపోతూ ఉంటుంది. ఈరోజు రెస్టారెంట్ లో నేను కొత్త దీపను చూశాను. 

ఇన్ని రోజులు శౌర్య కోసమే బావ దీప దగ్గరకు వెళ్తున్నాడని అనుకున్నాను. కానీ దీపకు నేను బావను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని అర్థం అయ్యిందని చెప్తుంది. అక్కడితో నేటి కార్తీకదీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగిసింది.

WhatsApp channel