SS Rajamouli: రాజమౌళికి మొగుడు వచ్చాడంటా.. జర్నలిస్ట్ ప్రశ్న.. నాగ్ అశ్విన్ ఆన్సర్‌కు నవ్వడం పక్కా!-kalki 2898 ad director nag ashwin gives strong reply to reporter about ss rajamouli nag ashwin slams reporter rajamouli ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ss Rajamouli: రాజమౌళికి మొగుడు వచ్చాడంటా.. జర్నలిస్ట్ ప్రశ్న.. నాగ్ అశ్విన్ ఆన్సర్‌కు నవ్వడం పక్కా!

SS Rajamouli: రాజమౌళికి మొగుడు వచ్చాడంటా.. జర్నలిస్ట్ ప్రశ్న.. నాగ్ అశ్విన్ ఆన్సర్‌కు నవ్వడం పక్కా!

Sanjiv Kumar HT Telugu
Jul 06, 2024 01:55 PM IST

Nag Ashwin Slams Reporter About SS Rajamouli: డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళికి మొగుడు వచ్చాడంటున్నారని, దానిపై మీ కామెంట్ ఏంటని అడిగిన జర్నలిస్ట్ ప్రశ్నకు నాగ్ అశ్విన్ ఇంట్రెస్టింగ్ ఆన్సర్ ఇచ్చారు. కల్కి 2898 ఏడీ సక్సెస్ సందర్భంగా నిర్వహించిన మీడియా ఇంటరాక్షన్‌లో ఈ ప్రశ్న ఎదురైంది.

రాజమౌళికి మొగుడు వచ్చాడంటా.. జర్నలిస్ట్ ప్రశ్న.. నాగ్ అశ్విన్ ఆన్సర్‌కు నవ్వడం పక్కా!
రాజమౌళికి మొగుడు వచ్చాడంటా.. జర్నలిస్ట్ ప్రశ్న.. నాగ్ అశ్విన్ ఆన్సర్‌కు నవ్వడం పక్కా!

Nag Ashwin About SS Rajamouli: నాగ్ అశ్విన్ తెరకెక్కించిన సైన్స్ ఫిక్షన్ మైథలాజికల్ విజువల్ వండర్ మూవీ కల్కి 2898 ఏడీకి అన్ని వర్గాల నుంచి ప్రశంసలు వస్తున్నాయి. సినిమాకు మంచి టాక్ రావడంతో పాటు బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. అంతేకాకుండా కల్కి సినిమాలో రాజమౌళి, రామ్ గోపాల్ వర్మ, అనుదీప్ కేవీ వంటి దర్శకులు కెమియోస్ చేసి ఆశ్చర్యపరిచారు.

రాజమౌళికి మొగుడు

ఇదిలా ఉంటే, శుక్రవారం (జూలై 5) నాడు శంకరపల్లిలోని కల్కి సెట్స్‌లో మీడియాతో ఇంటరాక్ట్ అయ్యారు డైరెక్టర్ నాగ్ అశ్విన్. సినిమాకు సక్సెస్‌పై థ్యాంక్స్ చెప్పిన ఆయన పలు విశేషాలను పంచుకున్నారు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో మీడియా రిపోర్టర్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఈ క్రమంలోనే కల్కి సినిమాతో ఎస్ఎస్ రాజమౌళికి మొగుడు వచ్చాడనే సోషల్ మీడియా కామెంట్స్‌పై ఆయన్ను క్వశ్చన్ చేశారు ఓ జర్నలిస్ట్.

అంటున్నావాళ్ల గురించి

"కల్కి సినిమా రిలీజైన తర్వాత మీ గురించి ఒక టాక్ ఉంది. బయట జనాలంత రాజమౌళికి మొగుడు వచ్చిండని అంటున్నారు" అని జర్నలిస్ట్ అన్నారు. దానికి "ఎవరు అనలేదు సర్. మీరే అంటున్నారు" అని నాగ్ అశ్విన్ చెప్పారు. దాంతో అంతా నవ్వేశారు. అనంతరం "నేను అనట్లేదు. బయట అంటున్నావాళ్ల గురించి చెబుతున్నా" అని ఆ రిపోర్టర్ చెప్పారు.

బిజినెస్ చేద్దామనుకున్నారా

"ఇది మీకు మూడో సినిమా. మూడో సినిమాకే ఇంత పెద్ద హెవీ సబ్జెక్ట్ తీసుకోవడం అనేది రిస్క్. మీకు రిస్క్ అనిపించలేదా ఒకటి. రెండో ప్రశ్న ఏందంటే.. ప్రభాస్, కమల్, అమితాబ్ బచ్చన్ వంటి స్టార్స్‌ను పెట్టుకుని బిజినెస్ చేద్దామనుకున్నారా.. లేకపోతే కథ మీద బిజినెస్ చేద్దామనుకున్నారా" అని అదే జర్నలిస్ట్ ప్రశ్నించారు.

తలకు మించిన బారం

"సర్ కచ్చితంగా మొదట మా నిర్మాతలు రిస్క్ తీసుకుంది. నేను ఇంత ఖర్చు పెట్టాలని చెబితే వారు ఇంకా ఎక్కువ ఖర్చు పెడతారు. ఇక ఇంత పెద్ద నటీనటులను తీసుకోవడం అనేది కేవలం ఆ పాత్రలకు న్యాయం చేయడానికి మాత్రమే. ఇక ఎండ్ ఆఫ్ ద డే స్టోరీలో వాల్యూ లేకుంటే అదంతా నెగెటివ్ అవుతుంది. ఎందుకంటే అదంతా తలకు మించిన బారం కదా" అని నాగ్ అశ్విన్ చెప్పుకొచ్చారు. మరికొన్ని క్వశన్స్, ఆన్సర్స్ చూస్తే..

ఈ సినిమా ప్రయాణంలో మీకు ఛాలెంజ్‌గా అనిపించింది ఏంటీ?

ఒక సినిమాని నాలుగున్నరేళ్ల దాక పట్టుకొని ఉండాలంటే జడ్జ్‌మెంట్ ఉండాలి. 2019లో రాసిన సీన్ 2024లో ఎడిట్ చేసుస్తున్నపుడు అదే జడ్జ్‌మెంట్ పెట్టుకోవడం కష్టమైన విషయం. దీనికి డిఫరెంట్ స్కిల్ సెట్ కావాలి. ఈ సినిమా విషయంలో ఇది కష్టమనిపించింది.

ఇందులో చాలా క్యామియోలు ఉన్నాయి? అన్ని పెట్టడానికి కారణం?

క్యామియోలు నాకు ఇష్టమేమో. సడన్‌గా మనకి తెలిసి ఒక స్టార్‌ని చూసినప్పుడు ఒక ఎగ్జయిట్‌మెంట్ వస్తుంది.

రాజమౌళి, ఆర్జీవీ గారిని ఎలా ఒప్పించారు ?

రాజమౌళి, ఆర్జీవీ గారు ఫ్యూర్లీ ఏ ట్రీబ్యుట్. ఇండస్ట్రీని చేంజ్ చేసిన డైరెక్టర్స్ వారు. ఆర్జీవి గారు నేను ఎందుకు? అని అడిగారు. కలియుగంలో మీరు ఉంటారని చెప్పాను (నవ్వుతూ).

WhatsApp channel