Kalki 2898 AD Collection: దుమ్ములేపుతున్న ప్రభాస్ కల్కి 2898 ఏడీ కలెక్షన్స్.. హిట్ కొట్టాలంటే మాత్రం!
Kalki 2898 AD Box Office Collection Day 8: ప్రభాస్-దీపికా పదుకొణె జంటగా తెరకెక్కిన సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ కల్కి 2898 ఏడీ సినిమా బాక్సాఫీస్ వద్ద పవర్‌ఫుల్ రన్ కొనసాగిస్తోంది. 7 రోజుల్లో కల్కి 700 కోట్లు కొల్లగొట్టగా 8వ రోజున వచ్చిన కలెక్షన్స్ ఎంతో తెలుసుకుందాం.

Kalki 2898 AD Worldwide Collection: ప్రభాస్ అండ్ దీపికా పదుకొణె తొలిసారి జోడీ కట్టిన భారీ బడ్జెట్ చిత్రం కల్కి 2898 ఏడీ. నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల పరంగా మంచి వసూళ్లను రాబడుతోంది. ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లో కలెక్షన్ల పరంగా ఈ చిత్రం రూ.700 కోట్ల మార్కును దాటిందని చిత్ర నిర్మాతలు వైజయంతీ మూవీస్ గురువారం తెలిపిన విషయం తెలిసిందే.
కల్కి 2898 ఏడీ సినిమా 7 రోజుల్లో రూ. 700 కోట్లు కొల్లగొట్టిందని వైజయంతీ మూవీస్ అకౌంట్ నుంచి సోషల్ మీడియాలో పోస్ట్ రిలీజ్ చేశారు. ఇక 8వ రోజు కూడా కల్కి సినిమాకు మంచి వసూళ్లే వచ్చాయి. కల్కి సినిమాకు 8వ రోజు ఇండియాలో రూ. 22.4 కోట్ల నెట్ ఇండియా కలెక్షన్స్ వసూలు అయ్యాయి. వీటిలో తెలుగు నుంచి రూ. 10.2 కోట్లు, తమిళం నుంచి కోటి రూపాయలు, హిందీ నుంచి రూ. 10.2 కోట్లు, కర్ణాటక నుంచి 2 లక్షలు, మలయాళం నుంచి రూ. 8 లక్షల కలెక్షన్స్‌గా ఉన్నాయి.
ఇలా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోన్న కల్కి 2898 ఏడీ మూవీకి 8 రోజుల్లో భారతదేశంలో రూ. 414.85 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. వాటిలో తెలుగు రాష్ట్రాల నుంచి రూ. 212.25 కోట్లు, హిందీ నుంచి రూ. 162.5 కోట్లు, తమిళనాడు నుంచి రూ. 23.1 కోట్లు, కర్ణాటక నుంచి రూ. 2.8 కోట్లు, అలాగే మలయాళం నుంచి రూ. 14.2 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది కల్కి సినిమా. ఇక ప్రపంచవ్యాప్తంగా కల్కి మూవీకి రూ. 750 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే, ఈపాటికే కల్కి సినిమాకు కలెక్షన్ల పరంగా 93 శాతం రికవరీ అయింది. కాగా ఈ సినిమాకు రూ. 370 కోట్ల బిజినెస్ జరగ్గా.. రూ. 372 కోట్లుగా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఫిక్స్ అయింది. ఇలా చూసుకుంటే కల్కి 2898 ఏడీ సినిమాకు ఇంకా రూ. 26 కోట్లు వస్తే బాక్సాఫీస్ పరంగా హిట్ అయినట్లుగా రికార్డులో నిలుస్తుంది. ఈ కలెక్షన్స్‌ను ఇంకొక రోజులో ఛేదించే అవకాశం ఉన్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో హిందూ పురాణాల స్ఫూర్తితో తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రభాస్, దీపికా పదుకొణెతోపాటు కమల్ హాసన్, దిశా పటానీ, అమితాబ్ బచ్చన్ వంటి అగ్రతారలు నటించారు.ఈ సినిమా విడుదలైనప్పటి నుంచి అభిమానులు, చిత్ర పరిశ్రమ నుంచి ప్రశంసలు తెచ్చుకుంటోంది. సినిమాలోని నటీనటుల యాక్టింగ్‌కు ఫిదా అయిపోతున్నారు.
టాపిక్