Mahesh Babu: కల్కి 2లో శ్రీకృష్ణుడిగా మహేష్ బాబు.. కల్కిగా చేసే హీరో ఎవరు.. నాగ్ అశ్విన్ సమాధానాలు ఇవే!
Nag Ashwin About Mahesh Babu As Lord Krishna: కల్కి 2898 ఏడీ పార్ట్ 2 సినిమాలో శ్రీకృష్ణుడిగా మహేశ్ బాబు చేస్తున్నారా అనే ప్రశ్నకు ఆసక్తికర సమాధానం ఇచ్చారు డైరెక్టర్ నాగ్ అశ్విన్. అలాగే కల్కి పాత్ర ఏ హీరో చేస్తున్నారనే ప్రశ్నకు నాగ్ అశ్విన్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Nag Ashwin About Mahesh Babu As Lord Krishna: కల్కి 2898 ఏడీ సినిమా మంచి హిట్ అందుకున్న నేపథ్యంలో తాజాగా మీడియాతో ఇంటరాక్ట్ అయ్యారు నాగ్ అశ్విన్. ఈ క్రమంలో మీడియాకు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. "కల్కి 2లో శ్రీకృష్ణుడుగా మహేష్ బాబు చేయాలని సోషల్ మీడియాలో టాక్ వస్తుందని, దానికి ఏమంటారు" అని నాగ్ అశ్విన్‌ని ఓ జర్నలిస్ట్ ప్రశ్నించారు.
ఎవరినీ చూపించాలనుకోవట్లేదు
“మహేష్ బాబు కృష్ణుడుగా చేస్తే బాగుంటుంది. కానీ, ఈ సినిమాలో కాదు” అని నాగ్ అశ్విన్ టిపికల్ ఆన్సర్ ఇచ్చారు. అయితే, కల్కి సినిమాలో శ్రీకృష్ణుడిని సరిగ్గా చూపించలేదు. ఎందుకంటే శ్రీకృష్ణుడిగా ఎవరినీ ఆయన చూపించాలనుకోవట్లేదని టాక్. మొదట ఆ పాత్రలో స్వర్గీయ నందమూరి తారకరామారావును ఏఐ ద్వారా చూపించాలనుకున్నారు. కానీ, అది కుదరలేదు.
ఎన్టీఆర్ తప్పా
శ్రీకృష్ణుడిగా సీనియర్ ఎన్టీఆర్‌ను తప్పా మిగతా ఎవరినీ ఊహించుకోలేరట నిర్మాత అశ్వనీ దత్. అందుకే కల్కి సినిమాలో శ్రీకృష్ణుడి పాత్ర చేసిన తమిళ యాక్టర్ కృష్ణకుమార్ సుబ్రమణియమ్ మొహాన్ని రివీల్ చేయలేదు. అందుకే నాగ్ అశ్విన్ ఈ సినిమాలో కాదు అనే సమాధానం ఇచ్చి ఉంటాడని తెలుస్తోంది.
పొట్టలోనే ఉన్నారు కదా
ఇకపోతే "కల్కిగా ఏ హీరో రాబోతున్నారు ? ఇందులో మీ ఫేవరేట్ క్యారెక్టర్ ఏమిటి ? అని క్వశన్ అవర్‌లో అడిగిన ప్రశ్నకు "ఇంకా పొట్టలోనే ఉన్నారు కదా. ఇంకా దానికి సమయం ఉంది. నా ఫేవరేట్ మాత్రం కర్ణుడు" అని నాగ్ అశ్విన్ నైస్‌గా ఆన్సర్ ఇచ్చారు. దీంతో కల్కి సెకండ్ పార్ట్‌లో కల్కిగా ఏ హీరో యాక్ట్ చేయనున్నారనే విషయం ఆసక్తిగా మారింది. మిగతా క్వశ్చన్స్‌కు నాగ్ అశ్విన్ ఆన్సర్స్ ఇచ్చారు. అవి చూస్తే..
పార్ట్ 1లో ప్రభాస్ స్క్రీన్ టైం తక్కువుందనే అభిప్రాయాలు వచ్చాయి. పార్ట్ 2 లో ఎలా ఉంటుంది?
కల్కి మ్యాసీవ్ సబ్జెక్ట్, వరల్డ్ బిల్డింగ్, చాలా క్యారెక్టర్స్ ఉంటాయి. ఇవన్నీ చూపించాలి. ఇప్పుడు వరల్డ్ బిల్డింగ్ అయిపొయింది. ఆడియన్స్‌కి ఆ వరల్డ్ పరిచయమైయింది. ఎవరి పాత్రలు, పవర్స్, మోటివ్స్ ఏమిటో తెలిసింది. ఇకపై ఇంకా ఫన్‌గా ఉంటుంది.
ప్రభాస్‌ని క్లైమాక్స్‌లో కర్ణుడిగా రివిల్ చేశారు. పార్ట్ 2 నెగిటివ్‌గా చూపిస్తారా లేదా పాజిటివ్ గానా?
కర్ణుడి పాత్ర పాజిటివ్ గానే ఉంటుంది. ఇండియాలో ఎక్కడ చూసిన ఆ క్యారెక్టర్‌ని లవ్ చేస్తారు. ఆయన కథకి క్యారెక్టర్‌కి జస్టిస్ చేయాలనే ఉంటుంది. కల్కిని రెండో సారి చూస్తునప్పుడు కర్ణుడికి సంబధించిన చాలా విషయాలు కొత్తగా కనిపిస్తాయి. సెకండ్ టైమ్ చూసినప్పుడు డిఫరెంట్ ఫిల్మ్ అనిపిస్తుంది. సెకండ్ టైం వర్త్ వాచ్ మూవీ ఇది.
కల్కి పిల్లల్ని ఎక్కువగా ఆకట్టుకునేలా రూపొందించారనే భావన కలుగుతుంది?
పిల్లలు మహాభారతం, మన ఒరిజినల్ హీరోస్‌కి సంబధించిన విషయాలు తెలుసుకుంటారనే ఒక ఉద్దేశం అయితే ఉంది. మనకి అద్భుతమైన స్టొరీలు ఉన్నాయి. అందుకే సినిమాని మరీ డార్క్ కాకుండా లైట్ హార్టెడ్‌గా తీయడం జరిగింది.
భవిష్యత్‌లో సంపూర్ణంగా మహాభారతాన్ని తీసే ఆలోచన ఉందా?
ఇప్పుడు అలాంటి ఐడియా ఎం లేదు.