Nag Ashwin About Kalki 2898 AD Set: నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన మైథాలజీ సైన్స్ ఫిక్షన్ విజువల్ వండర్ మూవీ కల్కి 2898 ఏడీ. ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటానీ లీడ్ రోల్స్‌లో యాక్ట్ చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపుతోంది. ఈ నేపథ్యంలో డైరెక్టర్ నాగ్ అశ్విన్ శంకరపల్లిలోని కల్కి సెట్స్‌లో మీడియాతో ఇంటరాక్ట్ అయ్యారు. కల్కి సినిమాకు సంబంధించి ఆసక్తికర విశేషాలు చెప్పారు.
"అందరూ మూవీ చూస్తునందుకు ఎంకరేజ్ చేస్తున్నందుకు, ఇంత గొప్ప సక్సెస్‌ని ఇచ్చినందుకు మా టీం, వైజయంతీ మూవీస్ తరఫున థాంక్స్. ఇది హోల్ ఇండస్ట్రీ సక్సెస్‌గా భావిస్తున్నాను. ఎన్నో ప్రొడక్షన్స్, యాక్టర్స్, రైటర్స్, అప్ కమింగ్ డైరెక్టర్స్‌కి ఒక డోర్ ఓపెన్ అయింది. ఇలాంటి సైన్స్ ఫిక్షన్ కథలు రాసుకునే వారికి కల్కి రిఫరెన్స్ పాయింట్‌లా ఉంటుంది" అని డైరెక్టర్ నాగ్ అశ్విన్ అన్నారు.
"సినిమా విడుదలైనప్పటి నుంచి ఎంతోమంది అభినందనలు తెలుపుతున్నారు. కల్కి ఒక మంచి సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చిందని చెబుతున్నారు. థియేటర్స్‌లోకి వెళ్లి సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ని పొందడం సినిమా ముఖ్య ఉద్దేశం. అలాంటి సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చే సినిమా అందించినందుకు ఆనందంగా ఉంది. అందరికీ థాంక్ యూ" అని నాగ్ అశ్విన్ తెలిపారు. అనంతరం నిర్వహించిన Q & A సెషన్‌లో మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు నాగ్ అశ్విన్.
తెలుగు సినిమా అంటే మనకి గుర్తుకొచ్చేది మాయాబజార్. మహాబారతనికి మాయాబజార్ ఒక అడాప్టేషన్. ఆ పర్టిక్యులర్ ఇన్సిడెంట్స్ మహాభారతంలో ఎక్కడా లేదు. అదొక క్రియేటివ్ ఫిక్షన్. అక్కడి నుంచే ఇన్స్పిరేషన్ వచ్చింది.
వరల్డ్‌లో కాంప్లెక్స్ ఒక బ్యాలెన్స్ తీసేసింది. శంభల టార్గెట్ మళ్ళీ ఆ వరల్డ్‌లో ఒక బ్యాలెన్స్ తీసుకురావడం.
ముందుగా ఒక్క సినిమాగానే ఈ కథను తెరకెక్కించాలనుకున్నా. కొన్ని షెడ్యూల్స్ షూటింగ్ పూర్తయిన తర్వాత ఇంత పెద్ద స్టోరీని ఒక్క భాగంలో చెప్పడం ఛాలెంజ్ అనిపించింది. అప్పుడే పార్ట్‌లుగా చూపించాలని నిర్ణయించుకున్నా. పార్ట్ 2కి సంబంధించి 20 రోజులు షూట్ చేశాం. ఇంకా చాలా చేయాలి, చాలా యాక్షన్, బ్యాక్ స్టోరీస్, న్యూ వరల్డ్స్ ఇలా చూడటానికి చాలా ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు క్రియేట్ చేయాలి.
మా ప్రొడక్షన్ టీం చాలా కష్టపడింది. ఇందులో నాకు ఇష్టమైన ప్లేస్ శంభల స్టెప్స్. అక్కడే కూర్చునే వాడిని. అక్కడ సైన్ రైజ్, సన్ సెట్ చాలా బావుంటుంది.
మా ప్రోడుసర్స్ రిస్క్ తీసుకున్నారు. నేను ఇంత ఖర్చు చేయాలంటే.. దానికంటే ఎక్కువ ఖర్చు పెడతారు.