Kali OTT: ఓటీటీలోకి నిన్న రిలీజైన తెలుగు సైకలాజికల్ థ్రిల్లర్ కలి.. సూసైడ్ ఆలోచన మార్చే మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
Kali Movie OTT Streaming: ఓటీటీలోకి తెలుగు సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ కలి రానుంది. అక్టోబర్ 4న థియేటర్లలో విడుదలైన కలి ఈ నెలలోనే ఓటీటీ రిలీజ్ కానుంది. అంటే, థియేటర్లలో రిలీజైన 25 రోజుల్లోపే కలి మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. మరి కలి సినిమా ఏ ఓటీటీలో డిజిటల్ స్ట్రీమింగ్ కానుందనే వివరాల్లోకి వెళితే..
Kali OTT Release: సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలు చాలా ఎంగేజింగ్‌గా ఉంటాయి. అలాంటి తెలుగులో వస్తే ప్రేక్షకులకు పండగే. అలా తాజాగా థియేటర్లలో విడుదలైన తెలుగు సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ కలి. యంగ్ హీరోలు ప్రిన్స్ సిసిల్, నరేష్ అగస్త్య నటించిన కలి సినిమాకు శివ శేషు దర్శకత్వం వహించారు.
అక్టోబర్ 4న రిలీజ్
ప్రముఖ కథా రచయిత కె. రాఘవేంద్ర రెడ్డి సమర్పణలో రుద్ర క్రియేషన్స్ బ్యానర్‌పై కలి మూవీని నిర్మించారు. లీలా గౌతమ్ వర్మ నిర్మాతగా వ్యవహరించిన కలి మూవీ అక్టోబర్ 4న థియేటర్లలో విడుదలైంది. సైకలాజికల్ థ్రిల్లర్ కథతో వచ్చి ఈ సినిమా ఆడియెన్స్ దృష్టిలో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.
నాగ్ అశ్విన్‌తో
అయితే, భారీ ఎత్తున ప్రమోషన్స్ నిర్వహించకపోవడంతో కలి మూవీ ఎక్కువగా రీచ్ కాలేదు. కానీ, డైరెక్టర్ నాగ్ అశ్విన్ రిలీజ్ చేసిన కలి టీజర్, ట్రైలర్‌కు మాత్రం మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనను మార్చాలనే మంచి దృక్పథంతో తెరకెక్కిన సినిమా కలి. సినిమాలోని నటీనటుల యాక్టింగ్, సంగీతం, కాన్సెప్ట్‌కు మంచి పాజిటివ్ టాక్ వస్తోంది.
ఓటీటీ రైట్స్ డీల్ క్లోజ్
ఈ నేపథ్యంలో కలి ఓటీటీ రిలీజ్‌పై బజ్ క్రియేట్ అయింది. అయితే, మొదట్లో కలిని నేరుగా ఓటీటీలోనే స్ట్రీమింగ్ చేయాలనుకున్నారట. కానీ, ప్రేక్షకులకు థియేటర్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వాలన్న ఉద్దేశంతో థియేటర్లలో విడుదల చేశారు. అయితే, థియేటర్ రిలీజ్ కంటే ముందుగానే కలి ఓటీటీ రైట్స్ డీల్ క్లోజ్ అయినట్లు సమాచారం.
ఈ నెలలోనే ఓటీటీ ఓటీటీ రిలీజ్
కలి ఓటీటీ హక్కులను ప్రముఖ తెలుగు డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఈటీవీ విన్ అతి స్వల్న ధరకు కొనుగోలు చేసుకుందని టాక్. ఇక కలి విడుదలైన అక్టోబర్ నెలలోనే ఓటీటీ స్ట్రీమింగ్ చేయనున్నారట. కలి ఓటీటీ రిలీజ్ డేట్‌ను ఇంకా ప్రకటించలేదు. కానీ, థియేటర్లలో విడుదలైన 25 రోజుల్లోపే కలి ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చేయనుందని సమాచారం.
రెండు మూడు రోజుల ముందు
కలి డిజిటల్ ప్రీమియర్‌పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అయితే, కలి డిజిటల్ స్ట్రీమింగ్‌కు రెండు మూడు రోజుల ముంది అధికారికంగా అనౌన్స్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే, కలి సినిమాలో ప్రిన్స్ సిసిల్, నరేష్ అగస్త్యతోపాటు నేహా కృష్ణన్, గౌతంరాజు, గుండు సుదర్శన్, కేదార్ శంకర్, మని చందన, మధుమణి ఇతర కీలక పాత్రలు పోషించారు.
సూసైడ్ చేసుకునేందుకు
కలి స్టోరీ విషయానికొస్తే.. శివరామ్ (ప్రిన్స్ సిసిల్) మంచి వ్యక్తిత్వం ఉన్న పర్సన్. అతని మంచితనం వల్లే ఇబ్బందులు పడుతుంటాడు. 'నువ్వు మంచివాడివే కానీ.. కుటుంబాన్ని ఎలా చూసుకోవాలో నీకు తెలియదంటూ' ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య వాళ్ల పాపను తీసుకుని వెళ్లిపోతుంది. ఈ కష్టాలతో ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధమవుతాడు శివరామ్.
ఆ రాత్రి శివరామ్ ఇంటికి ఓ అపరిచిత వ్యక్తి (నరేష్ అగస్త్య) వస్తాడు. ఆ వ్యక్తి ఎవరు?, అతను వచ్చాక శివరామ్ జీవితంలో ఎదురైన అనూహ్య సంఘటనలు ఏంటీ? అనే ఆసక్తికర అంశాల సముహారమే కలి సినిమా.