Bigg Boss 7 Telugu: ఘోరంగా కొట్టుకున్న బాడీ బిల్డర్లు.. మధ్యలో దూరిన హీరో.. ఏడ్చేసిన ప్రిన్స్
Bigg Boss 7 Telugu Day 12 Promo 1: బిగ్ బాస్ 7 తెలుగు సీజన్ రెండో వారమే మరింత హీట్ పెరిగింది. మొదటి నుంచి సూపర్ టాస్క్ ఇస్తూ కంటెస్టెంట్ల నుంచి అద్భుతమైన కంటెంట్ రాబడుతున్నారు నిర్వాహకులు. బిగ్ బాస్ 7 తెలుగు సెప్టెంబర్ 15వ తేది ఎపిసోడ్ ప్రోమోపై లుక్కేస్తే..
బిగ్ బాస్ 7 తెలుగు సెప్టెంబర్ 14వ తేది ఎపిసోడ్‍లో రతిక చేసిన టైమ్ వేస్ట్ వల్ల బిగ్ బాస్ షాకింగ్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. రణధీర టీమ్‍లో మాయాస్త్ర భాగాలు ఉన్న వాళ్లనే కంటెండర్లుగా ఎన్నుకోవాలని చెప్పాడు. దీంతో అమర్ దీప్, శోభా శెట్టి, ప్రియాంక ఔట్ అయిపోయారు. పోటీలో శివాజీ, షకీలా, ప్రిన్స్ యావర్ ఉన్నారు. వీరిలో ఒకరి అస్త్రాన్ని మరొకరికి మహాబలి టీమ్ ఇవ్వాలి. ఇప్పటికే శుభ శ్రీ, పల్లవి ప్రశాంత్, దామిని సెలెక్ట్ చేశారు. ఇక మిగిలింది గౌతమ్, తేజ, రతిక. ఇక్కడే అసలు కథ మొదలైంది.
ఇది కారణం కాదు
బిగ్ బాస్ 7 తెలుగు డే 12 ప్రోమోలో గౌతమ్ ఎవరు అనర్హులో చెప్పి వారి నుంచి అస్త్రాన్ని తీసుకుని అర్హులకు ఇవ్వాలి అని ప్రియాంక చెప్పింది. దీంతో ప్రిన్స్ దగ్గర తీసుకుని అని గౌతమ్ చెబుతుంటే.. ఎవరూ.. ఎందుకు ఇది అని ప్రిన్స్ అన్నాడు. కారణం ఏంటంటే.. శివాజీ అన్న గేమ్ ఎగ్జిగ్యూట్ చేసినట్లు అనిపించింది అని గౌతమ్ చెప్పాడు. దీనికి ఇది రీజన్ కాదు అని కోపంతో ఊగిపోయాడు ప్రిన్స్. ఎందుకు రాంగ్ రీజన్ నాకు చెబుతున్నావ్ అంటూ గౌతమ్ పైకి దూసుకెళ్లాడు ప్రిన్స్.
బాడీని చూపిస్తూ
ప్రిన్స్ ఒక్కసారిగా అలా వెళ్లేసరికి హౌజ్‍లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రాపర్ రీజన్ చెప్పు అని గౌతమ్‍పై ప్రిన్స్ గట్టిగా అరిచాడు. గౌతమ్ కూడా అదే టోన్‍లో బదులిచ్చాడు. ఇద్దరూ గట్టిగా వాదించుకుంటూ, చేతులు చూపించుకుంటూ దాదాపుగా కొట్టుకున్నంత పని చేశారు. ఛల్ జా అని ప్రిన్స్ అంటే.. నేను ఇక్కడే ఉంటా అని గౌతమ్ హిందీలో చెప్పాడు. నా కటౌట్ చూడు అంటూ తన బాడీని చూపిస్తూ గౌతమ్‍కు వార్నింగ్ ఇచ్చాడు. ఇలా ఇద్దరూ బాడీ బిల్డర్లు ఫైట్‍కు దిగేసరికి కంటెస్టెంట్స్ అంతా షాక్ అయ్యారు.
నేను డాక్టర్‍ని
తర్వాత కెమెరా దగ్గరకు వెళ్లి ఇది కరెక్ట్ కాదని, నాకు న్యాయం కావాలని యావర్ అరుస్తూ చెప్పాడు. మధ్యలో దూరిన సీరియల్ హీరో అమర్ దీప్ ఇంతమందిని ఏడిపిస్తూ ఏం బాగుపడతారో నాకు అర్థం కావట్లేదు అని యావర్‍ను ఓదార్చాడు. నాకు ఈ హౌజ్‍లో ఉండాలని లేదు, నన్ను బయటకు పంపించేయండి అని కెమెరాకు చెప్పుకున్నాడు యావర్. నా దగ్గరికి వచ్చి బాడీ చూపిస్తున్నాడు. నేను ఒక డాక్టర్‍ని ఆ మాత్రం తెల్వదా. నా దగ్గరికే వచ్చి స్టంట్స్ చేస్తడా అని గౌతమ్ అన్నాడు.
ఇంటికి వెళ్లాలి
మరోవైపు అది బ్యాడ్ గేమ్‍రా.. బ్యాడ్ గేమ్ అది అని ప్రిన్స్ యావర్ చిన్న పిల్లాడిలా ఏడుస్తూ అమర్‍తో చెప్పాడు. దానికి అవును, అది కరెక్ట్ గేమ్ కాదు అంటూ యావర్‍ను హగ్ చేసుకుని అమర్ దీప్ ఓదార్చాడు. అనంతరం నేను ఇంటికి వెళ్లాలనుకుంటున్నాను. గేట్ ఓపెన్ చేయండి. ఇంటికి వెళ్లాలి అంతే అని కెమెరాకు మళ్లీ చెప్పాడు ప్రిన్స్ యావర్. దీంతో శోభా శెట్టి ఏడుస్తున్నట్లుగా ప్రోమోను ఎండ్ చేశారు.