Prasanth Varma: హనుమాన్ అంత సక్సెస్ కావాలి.. దర్శి నా మొదటి హీరో: ప్రశాంత్ వర్మ-hanuman director prasanth varma comments on priyadarshi and darling movie ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Prasanth Varma: హనుమాన్ అంత సక్సెస్ కావాలి.. దర్శి నా మొదటి హీరో: ప్రశాంత్ వర్మ

Prasanth Varma: హనుమాన్ అంత సక్సెస్ కావాలి.. దర్శి నా మొదటి హీరో: ప్రశాంత్ వర్మ

Sanjiv Kumar HT Telugu
Apr 21, 2024 01:56 PM IST

Prasanth Varma About Darling Movie: హనుమాన్ సినిమా అంత పెద్ద విజయాన్ని డార్లింగ్ మూవీ అందుకోవాలని డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెలిపారు. డార్లింగ్ సినిమా టైటిల్ గ్లింప్స్ లాంచ్ ఈవెంట్‌లో ప్రశాంత్ వర్మ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

హనుమాన్ అంత సక్సెస్ కావాలి.. దర్శి నా మొదటి హీరో: ప్రశాంత్ వర్మ
హనుమాన్ అంత సక్సెస్ కావాలి.. దర్శి నా మొదటి హీరో: ప్రశాంత్ వర్మ

Prasanth Varma About Priyadarshi: పాన్ ఇండియా సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్ హనుమాన్‌ సినిమాను అందించిన ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌ నిర్మాత నిరంజన్ రెడ్డి, శ్రీమతి చైతన్య సమర్పణలో తన తదుపరి సినిమాని అనౌన్స్ చేశారు. బలగం, ఓం భీమ్ బుష్, సేవ్ ది టైగర్స్ సిరీస్‌ల విజయాలతో దూసుకుపోతున్న ప్రియదర్శి ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. హీరోయిన్‌గా నభా నటేష్ చేస్తోంది.

రొమ్-కామ్‌ ఎంటర్ టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి అశ్విన్ రామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి 'డార్లింగ్' (Darling 2024) అనే టైటిల్‌ను మేకర్స్ అనౌన్స్ చేశారు. 'వై దిస్ కొలవెరి' అనే ఆసక్తికరమైన ట్యాగ్‌లైన్‌ పెట్టారు. ఏప్రిల్ 20న డార్లింగ్ సినిమా టైటిల్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హనుమాన్ (Hanuman Movie) డైరెక్టర్ ప్రశాంత్ వర్మ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు.

"ప్రియదర్శితో నాకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. దర్శకుడిగా నా తొలి షాట్ దర్శి మీదే పెట్టాను. దర్శినే నా మొదటి హీరో. ఈ వేడుకు అతిథిగా రావడం ఆనందంగా ఉంది. నిరంజన్ గారితో మూడేళ్లుగా జర్నీ చేస్తున్నాం. చాలా పాషన్ ఉన్న నిర్మాత. మంచి కథ ఎక్కడున్నా వింటారు. హనుమాన్ లాంటి పెద్ద సినిమాని తీసే అవకాశం ఇచ్చిన ఆయనకు ధన్యవాదాలు" అని ప్రశాంత్ వర్మ తెలిపారు.

"హనుమాన్ విడుదలకు సిద్ధం అవుతున్న సమయంలో దర్శితో సినిమాని టేకప్ చేశారు. ఇంత మంచి కథని వదులుకోలేనని చెప్పారు. దర్శకుడు అశ్విన్‌కి చాలా పాషన్, ఎనర్జీ ఉంది. నభా లాంటి మంచి నటి ఈ ప్రాజెక్ట్‌లో ఉండటం అన్నీ సరిగ్గా సమకూరినట్లయింది. వివేక్ సాగర్ నాకు ఇష్టమైన కంపోజర్. టీం అందరికీ ఆల్ ది బెస్ట్" అని ప్రశాంత్ వర్మ అన్నారు.

"హను మాన్ ఎంత పెద్ద సక్సెస్ అయిందో డార్లింగ్ కూడా అంతటి పెద్ద విజయాన్ని సాధించి నిరంజన్ గారికి మంచి పేరు, డబ్బు రావాలని, ఇలాంటి మరెన్నో మంచి చిత్రాలు నిర్మించాలని కోరుకుంటున్నాను" అని హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ చెప్పుకొచ్చారు. కాగా ప్రశాంత్ వర్మ ప్రస్తతుం జై హనుమాన్ (Jai Hanuman Movie) చిత్రీకరించే పనిలో ఉన్నారు. ఆయన యూనివర్స్‌లో మరెన్నో సూపర్ హీరో సినిమాలు రానున్న విషయం తెలిసిందే.

"ఈ వేడుకకు విచ్చేసిన ఇంద్రగంటి మోహన్ కృష్ణ, ప్రశాంత్ వర్మ, హర్ష, సునీల్ గారి ధన్యవాదాలు. నమ్ము నమ్మి ఈ కథని నాతొ చేస్తామని చెప్పి దానిపైనే నిలబడిన అశ్విన్‌కి ధన్యవాదాలు. నిర్మాత నిరంజన్ గారు మాపై ఉంచిన నమ్మకం హనుమాన్ అంత బలాన్ని ఇచ్చింది. ఈ సినిమా రిలీజ్ తొందరలోనే ఉంటుంది. వివేక్ సాగర్ అద్భుతంగా మ్యూజిక్ చేశాడు" అని హీరో ప్రియదర్శి అన్నారు.

"ప్రభాస్ (Prabhas) అన్నకి, ఫ్యాన్స్ అందరికీ ధన్యవాదాలు. ప్రభాస్ గారిని ప్రేమతో పిలుచుకునే టైటిల్ ఈ సినిమాకి పెట్టడం మాకు చాలా గర్వకారణం. నభాతో (Nabha Natesh) నటించడం చాలా ఆనందంగా అనిపించింది. టీం అందరికీ పేరుపేరునా థాంక్స్. ఈ సినిమాతో కచ్చితంగా ప్రేక్షకులని ఎంటర్‌టైన్ చేస్తాం. ఇది డార్లింగ్ ప్రామిస్" అని ప్రియదర్శి తెలిపారు.

Whats_app_banner