Kalki 2898 AD: ఎలాన్ మస్క్‌.. బుజ్జిని డ్రైవ్ చేయండి: ఆహ్వానించిన డైరెక్టర్ నాగ్‍అశ్విన్-elon musk drive our bujji car kalki 2898 ad director nag ashwin invited tesla and x owner ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Kalki 2898 Ad: ఎలాన్ మస్క్‌.. బుజ్జిని డ్రైవ్ చేయండి: ఆహ్వానించిన డైరెక్టర్ నాగ్‍అశ్విన్

Kalki 2898 AD: ఎలాన్ మస్క్‌.. బుజ్జిని డ్రైవ్ చేయండి: ఆహ్వానించిన డైరెక్టర్ నాగ్‍అశ్విన్

Kalki 2898 AD - Elon Musk: టెస్లా ఓనర్ ఎలాన్ మస్క్‌ను కల్కి 2898 ఏడీ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఆహ్వానించారు. మూవీ కోసం తాము తయారు చేయించిన బుజ్జి కారును డ్రైవ్ చేయాలని కోరారు. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Kalki 2898 AD: ఎలాన్ మస్క్‌.. బుజ్జిని డ్రైవ్ నడపండి: ఆహ్వానించిన నాగ్‍అశ్విన్

Kalki 2898 AD: కల్కి 2898 ఏడీ సినిమా కోసం ప్రత్యేకంగా తయారు చేసిన ఫ్యూచరిస్టిక్ కారు ‘బుజ్జి’ని గత వారం మూవీ టీమ్ ప్రపంచానికి పరిచయం చేసింది. భారీ ఈవెంట్ నిర్వహించి ఈ కారును ఆవిష్కరించింది. పేరు ‘బుజ్జి’ అయినా ఈ కారు చాలా భారీగా అదిరిపోయే డిజైన్‍తో ఉంది. ఆరు టన్నుల బరువు ఉంది. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న కల్కి 2898 ఏడీ సినిమాలో హీరో ప్రభాస్ వాహనం ఇదే. కాగా, ఈ ‘బుజ్జి’ కారును డ్రైవ్ చేయాలంటూ టెస్లా, ఎక్స్ (ట్విట్టర్) ఓనర్ ఎలాన్ మస్క్‌ను దర్శకుడు నాగ్ అశ్విన్ ఆహ్వానించారు.

ఇండియాలోనే తయారు చేశాం.. డ్రైవ్ చేయండి

బుజ్జి కారును పూర్తిగా భారత్‍లోనే తయారు చేశామని, ఫుల్ మేడిన్ ఇండియా అని నాగ్ అశ్విన్ ట్వీట్ చేశారు. సైబర్ ట్రక్‍తో బుజ్జి ఫొటో అద్భుతంగా ఉంటుందని పేర్కొన్నారు. “డియల్ ఎలాన్ మస్క్ సర్.. మీరు బుజ్జిని చూసి, డ్రైవ్ చేయాలని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. బుజ్జి.. ఆరు టన్ను బీస్ట్” అని నాగ్ అశ్విన్ ట్వీట్ చేశారు.

బుజ్జి, సైబర్ ట్రక్ కలిసి డ్రైవ్ అవుతుంటే చూడాలని ఉందని నాగ్ అశ్విన్ పేర్కొన్నారు. “బుజ్జి ఫుల్లీ మేడిన్ ఇండియా. ఎలక్ట్రిక్, ఇంజినీరింగ్ పనులన్నీ ఇండియాలోనే జరిగాయి. మీ సైబర్ ట్రక్ (టెస్లా)తో ఫొటో ఆప్షన్‍కు ఇది గొప్పగా ఉంటుందని అనుకుంటున్నా. (ఆ రెండు కలిసి డ్రైవ్ అయ్యే దృశ్యం బాగుంటుంది)” అని నాగ్ అశ్విన్ ట్వీట్ చేశారు.

టెస్లా, ఎక్స్, స్పేస్ ఎక్స్ లాంటి భారీ సంస్థలకు యజమానిగా ఉన్న ఎలాన్ మస్క్ ఒకవేళ ఈ ట్వీట్‍కు స్పందిస్తే కల్కి 2898 ఏడీ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా హైప్ ఓ రేంజ్‍లో పెరుగుతుంది. అయితే, మస్క్ రియాక్ట్ అయ్యే అవకాశాలు తక్కువే.

డ్రైవ్ చేసిన చైతూ, కార్తికేయన్

కల్కి 2898 ఏడీ మూవీలోని బుజ్జి కారును హీరో నాగచైతన్య ఇటీవలే డ్రైవ్ చేశారు. షాక్ అయ్యానని కామెంట్ చేశారు. భారత తొలి ఎఫ్‍1 రేసర్ నరైన్ కార్తికేయన్ కూడా బుజ్జిని నడిపారు. స్పేస్‍షిప్‍లా ఉందంటూ ప్రశంసించారు.

చెన్నైలో బుజ్జి

కల్కి 2898 ఏడీ ప్రమోషన్లలో భాగంగా దేశంలోని వివిధ నగరాల్లో బుజ్జి కారును మూవీ టీమ్ ప్రదర్శించనుంది. ప్రస్తుతం ఈ కారును చెన్నైకు తీసుకెళ్లారు. చెన్నై రోడ్డుపై బుజ్జి నడిచిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. మరిన్ని సిటీలకు కూడా ఈ కారును తీసుకెళ్లనున్నారు మేకర్స్.

మహాభారత కాలం నుంచి భవిష్యత్తు అయిన 2898 వరకు 6,000 ఏళ్ల కాలం కల్కి 2898 ఏడీ చిత్రంలో ఉంటుందని డైరెక్టర్ నాగ్ అశ్విన్ గతంలోనే చెప్పారు. భారత పురాణాల స్ఫూర్తితో ఎపిక్ సైన్స్ ఫిక్షన్ డిస్టోపియన్ యాక్షన్ మూవీగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. విష్ణుమూర్తి పదో అవతారం కల్కి ఆధారంగా రూపొందించిన భైరవ పాత్రను ప్రభాస్ పోషించారని తెలుస్తోంది.

కల్కి 2898 ఏడీ సినిమా జూన్ 27వ తేదీన గ్లోబల్ రేంజ్‍లో విడుదల కానుంది. ఈ చిత్రంలో ప్రభాస్‍తో పాటు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణ్ లాంటి భారీతారాగణం ఉంది. భారీ బడ్జెట్‍తో వైజయంతీ మూవీస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.