Kalki 2898 AD: ‘బుజ్జి’ని నడిపిన నాగచైతన్య.. షాకయ్యానంటూ: వీడియో
Kalki 2898 AD Bujji Car: కల్కి 2898 ఏడీలోని స్పెషల్ కారు బుజ్జికి ఫుల్ క్రేజ్ వచ్చేసింది. లాంచ్ ఈవెంట్‍లో బుజ్జితో ప్రభాత్ ఇచ్చిన ఎంట్రీ, రిలీజ్ చేసిన గ్లింప్స్ అదిరిపోయాయి. అయితే, ఇప్పుడు నాగచైతన్య (Naga Chaitanya) ఈ బుజ్జి వెహికల్‍ను నడిపారు.
Kalki 2898 AD: కల్కి 2898 ఏడీ చిత్రంపై అంచనాలు నానాటికీ పెరిగిపోతున్నాయి. ప్రతీ గ్లింప్స్ హైప్‍ను అధికం చేస్తూనే ఉంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ఈ ఎపిక్ సైన్స్ ఫిక్షన్ డ్రామా రికార్డులను బద్దలుకొడుతుందనే అభిప్రాయాలు గట్టిగా వ్యక్తమవుతున్నాయి. బుజ్జి అనే స్పెషల్ కారును ఇటీవలే మూవీ టీమ్ ప్రపంచానికి పరిచయం చేసింది. ఫ్యూచరిస్టిక్‍గా ఉన్న బుజ్జి కారుకు ఫుల్ క్రేజ్ వచ్చేసింది. ఆ వాహనం అందనీ ఆశ్చర్యపరుస్తోంది. బుజ్జితో భైరవ (ప్రభాస్) అంటూ ఇటీవల వచ్చిన గ్లింప్స్ వీడియో కూడా అద్భుతమైన విజువల్స్‌తో ఆకట్టుకుంది. అయితే, తాజాగా యువసామ్రాట్ హీరో నాగచైతన్య ఈ బుజ్జిని నడిపారు.
బుజ్జిని డ్రైవ్ చేసిన చైతూ
బుజ్జి స్పెషల్ కారును నాగచైతన్య నడిపారు. రేసింగ్ కోర్స్‌లా ఉన్న చోట రయ్‍రయ్ అంటూ ఈ కారును డ్రైవ్ చేశారు. దర్శకుడు నాగ్‍అశ్విన్.. చైతూకు వెల్‍కమ్ చెప్పారు. ఫుల్ జోష్‍తో ఈ బుజ్జిపై రైడ్ చేశారు నాగ చైతన్య.
బుజ్జి కోసం ఇంజినీరింగ్ రూల్స్ అన్నీ నాగ్ అశ్విన్ బ్రేక్ చేసినట్టు అనిపిస్తోందని నాగచైతన్య చెప్పారు. తాను ఇంకా షాక్‍లోనే ఉన్నానని అన్నారు. ఈ వీడియోను ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న వైజయంతీ మూవీస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
బుజ్జి ప్రత్యేకతలు ఇవే
కల్కి 2898 ఏడీ మూవీలోని బుజ్జి కారు ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండియా అయిపోయింది. ఈ ఫ్యూచరస్టిక్ కారు చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా ఈ వెహికల్‍ను కల్కి టీమ్ రూపకల్పన చేసింది. మహీంద్రా సంస్థ, జయం ఆటోమోటివ్ భాగస్వామ్యంతో పాటు చాలా మంది ఇంజినీర్లతో బుజ్జి కారును తయారు చేయించారు దర్శకుడు నాగ్‍అశ్విన్. ఇది తయారు చేసేందుకు సుమారు రెండేళ్ల కాలం పట్టిందని సమాచారం.
బుజ్జి వాహనానికి ముందు రెండు, వెనుక ఒకటే భారీ టైర్లు ఉన్నాయి. ఈ టైర్లు తయారు చేసేందుకే చాలా కసరత్తులు చేశారు. సియట్ కంపెనీతో ఈ టైర్లను తయారు చేయించారు మేకర్స్.
బుజ్జి వాహనం మొత్తంగా బరువు సుమారు 6 టన్నులుగా ఉంది. నిజంగా డిస్టోపియన్ ఫీల్ వచ్చేలా ఫ్యుచరస్టిక్ డిజైన్‍తో అదిరిపోయింది. మూవీ టీమ్ చెప్పినట్టు బుజ్జి కారు నిజంగానే ఈ మూవీలో మరో సూపర్ స్టార్ అయింది.
ఇటీవల జరిగిన కల్కి 2898 ఏడీ లాంచ్ ఈవెంట్‍లో బుజ్జిని నడిపారు ప్రభాస్. బుజ్జితో ఆయన ఎంట్రీ అదిరిపోయింది. అలాగే, భైరవతో బుజ్జి అనే గ్లింప్స్‌ను కూడా మూవీ టీమ్ రిలీజ్ చేసింది. ఈ గ్లింప్స్‌లో విజువల్స్ అద్భుతంగా ఉండగా.. భైరవ (ప్రభాస్), బుజ్జి మధ్య కెమెస్ట్రీ, డైలాగ్స్ కూడా ఆకట్టుకున్నాయి. మొత్తంగా ఈ మూవీపై ఈ కారు అంచనాలను మరో రేంజ్‍కు తీసుకెళ్లింది. ఈ మూవీలో బుజ్జి బ్రెయిన్‍కు స్టార్ హీరోయిన్ కీర్తి సురేశ్ వాయిస్ ఓవర్ ఇచ్చారు.
కల్కి 2898 ఏడీ సినిమా జూన్ 27వ తేదీన రిలీజ్ కానుంది. గ్లోబల్ రేంజ్‍లో ఈ చిత్రం విడుదల కానుంది. ఈ మూవీలో ప్రభాస్‍తో పాటు బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్, తమిళ లెజెండ్ కమల్ హాసన్, స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణ్ కీలకపాత్రలు చేశారు. వైజయంతీ మూవీస్ నిర్మించిన ఈ చిత్రం ఇండియాలోనే ఇప్పటికే వరకు హైయెస్ట్ బడ్జెట్ మూవీగా వస్తోంది. సుమారు రూ.600 కోట్ల వరకు ఈ చిత్రానికి బడ్జెట్ వెచ్చించినట్టు అంచనాలు ఉన్నాయి. సంతోష్ నారాయణన్ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నారు.
కాగా, నాగ చైతన్య ప్రస్తుతం తండేల్ సినిమాలో బిజీగా ఉన్నారు. ఈ చిత్రంలో సాయి పల్లవి హీరోయిన్‍గా నటిస్తున్నారు. చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని డిసెంబర్‌లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
టాపిక్