Kalki 2898 AD Bujji: మైండ్‍బ్లోయింగ్‍గా భైరవ, బుజ్జీ వీడియో.. అద్భుతంగా విజువల్స్.. ప్రభాస్ గ్రాండ్ ఎంట్రీ: చూసేయండి-kalki 2898 ad bhairava bujji introduction video is mind blowing prabhas nag ashwin creates magic ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Kalki 2898 Ad Bujji: మైండ్‍బ్లోయింగ్‍గా భైరవ, బుజ్జీ వీడియో.. అద్భుతంగా విజువల్స్.. ప్రభాస్ గ్రాండ్ ఎంట్రీ: చూసేయండి

Kalki 2898 AD Bujji: మైండ్‍బ్లోయింగ్‍గా భైరవ, బుజ్జీ వీడియో.. అద్భుతంగా విజువల్స్.. ప్రభాస్ గ్రాండ్ ఎంట్రీ: చూసేయండి

Chatakonda Krishna Prakash HT Telugu
May 22, 2024 10:43 PM IST

Kalki 2898 AD Bhairava - Bujji: కల్కి 2898 ఏడీ సినిమా నుంచి బుజ్జీ అనే ప్రత్యేక వాహనాన్ని మూవీ టీమ్ ప్రపంచానికి చూపించింది. దీని కోసం భారీ ఈవెంట్‍ను నిర్వహించింది. బుజ్జీతో భైరవ (ప్రభాస్) వీడియోను కూడా రిలీజ్ చేసింది. ఇది అద్భుతంగా ఉంది.

Kalki 2898 AD Bujji: మైండ్‍బ్లోయింగ్‍గా భైరవ, బుజ్జీ వీడియో.. అద్భుతంగా విజువల్స్: చూసేయండి
Kalki 2898 AD Bujji: మైండ్‍బ్లోయింగ్‍గా భైరవ, బుజ్జీ వీడియో.. అద్భుతంగా విజువల్స్: చూసేయండి

Kalki 2898 AD Bhairava - Bujji: పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న కల్కి 2898 ఏడీ సినిమాపై నానాటికీ అంచనాలు పెరుగుతూనే ఉన్నాయి. పురాణాల ఆధారంగా ఎపిక్ సైన్స్ ఫిక్షన్ చిత్రంగా దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. విష్ణుమూర్తి పదో అవతారంగా భావించే కల్కి ఆధారంగా ఈ మూవీలో ప్రభాస్ 'భైరవ' క్యారెక్టర్ ఉండనుంది. ఈ మూవీ గ్లోబల్ రేంజ్‍లో జూన్ 27న రిలీజ్ కానుంది. కల్కి 2898 ఏడీ సినిమాలో బుజ్జీ అనే ప్రత్యేక వాహనం గురించి కొంతకాలంగా హైప్ నెలకొని ఉంది. ఈ వెహికల్‍ను ప్రపంచానికి పరిచయం చేసేందుకు నేడు (మే 22) భారీ ఈవెంట్ నిర్వహించింది మూవీ టీమ్. కల్కి టీమ్ చేసిన తొలి ప్రమోషనల్ ఈవెంట్ ఇదే. కాగా, భైరవ, బుజ్జీ వీడియోను రిలీజ్ చేయగా.. ఇది అద్భుతమైన విజువల్స్‌తో అబ్బురపరిచేలా ఉంది.

భైరవ, బుజ్జీ మధ్య కెమిస్ట్రీ అదుర్స్

బుజ్జీ వాహనానికి ఉండే బ్రెయిన్ డైలాగ్‍తో ఈ వీడియో మొదలైంది. ఈ మిషన్ అసాధ్యమని.. షారుఖ్ ఖాన్ ‘నామూన్కిన్’ ఐకానిక్ డైలాగ్‍ బుజ్జీ చెప్పడంతో ఈ వీడియో షురూ అయింది. అయితే, ఫుల్ స్పీడ్‍లో వెళ్లాలని బుజ్జీకి ఆదేశాలు ఇస్తాడు భైరవ (ప్రభాస్). ఈ ఒక్క రోజు పాజిటివ్‍గా ఉండాలని బైరవ అడిగితే.. తిరుగేలేదని భైరవ అంటారు. ఈ బుజ్జి వెహికల్ అత్యంత వేగంతో వెళుతూ గాల్లోకి ఎగిరేలా కూడా ఉంది. చూసేందుకు అద్భుతంగా కనిపిస్తోంది. ‘లవ్ యూ బుజ్జీ’ అని భైరవ అంటే.. పర్లేదులే అని బుజ్జీ బ్రెయిన్ అంటుంది. కల్కి 2898 ఏడీ మూవీలో భైరవ, అతడి స్పెషల్ వెహికల్ బుజ్జీ మధ్య కెమెస్ట్రీ, సంభాషలు ఫన్నీగా, అదిరిపోయేలా ఉంటాయని ఈ వీడియో చూస్తే అర్థమవుతోంది. ఇక, బుజ్జీ వాహనానికి స్టార్ హీరోయిన్ కీర్తి సురేశ్ వాయిస్ ఓవర్ ఇవ్వడం మరో హైలైట్‍గా ఉంది.

స్టన్నింగ్‍గా విజువల్స్

కల్కి 2898 ఏడీ టీమ్ రిలీజ్ చేసిన భైరవ, బుజ్జీ వీడియోలో విజువల్స్ మాత్రం అద్భుతంగా ఉన్నాయి. ప్రతీ ఫ్రేమ్ స్టన్నింగ్‍గా ఉంది. ఈ చిత్రం విజువల్ వండర్‌లా ఉంటుందని మరోసారి భారీ నమ్మకాన్ని ఇచ్చేసింది. భారీ హాలీవుడ్ మూవీ రేంజ్‍లో ఔట్‍పుట్‍ను దర్శకుడు నాగ్అశ్విన్ సాధించారు. స్టొజిల్‍జోవిక్ సినిమాటోగ్రఫీ, సంతోష్ నారాయణన్ బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ కూడా టాప్ నాచ్‍గా ఉంది.

ప్రభాస్ సూపర్ ఎంట్రీ

బుజ్జీని పరిచయం చేసేందుకు కల్కి 2898 ఏడీ టీమ్ హైదరాబాద్‍లోని రామోజీ ఫిల్మ్ సిటీలో నేడు అట్టహాసంగా జరిగింది. ఈ ఈవెంట్‍లో బుజ్జీతో ప్రభాస్ ఇచ్చిన ఎంట్రీ అదిరిపోయింది. భైరవ గెటప్‍లోనే ఈ ఈవెంట్‍లో ప్రభాస్ కనిపించారు. డార్లింగ్ లుక్స్ స్టన్నింగ్‍గా ఉన్నాయి.

కల్కి 2898 ఏడీ సినిమాలో కీలకపాత్రల్లో నటిస్తున్న బాలీవుడ్ దిగ్గజం అమితాబ్‍ బచ్చన్, లోకనాయకుడు కమల్‍హాసన్‍కు ప్రభాస్ థ్యాంక్స్ చెప్పారు. దీపికా పదుకోణ్‍ను సూపర్ స్టార్ అంటూ ప్రశంసించారు. ఈ మూవీలో దీపికా, దిశా పటానీ కూడా కీరోల్స్ చేస్తున్నారు. భారీ బడ్జెట్‍ వైజయంతీ మూవీస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. జూన్ 27వ తేదీన ఈ మూవీ రిలీజ్ కానుంది.

టీ20 వరల్డ్ కప్ 2024