Dulquer Salmaan: కాళ్లు పట్టుకోడానికి వెనుకాడలేదు.. స్టార్ హీరో దుల్కర్ సల్మాన్‌పై డైరెక్టర్ కామెంట్స్-director venky atluri comments on dulquer salmaan role in lucky baskhar movie and trivikram dialouges effect ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Dulquer Salmaan: కాళ్లు పట్టుకోడానికి వెనుకాడలేదు.. స్టార్ హీరో దుల్కర్ సల్మాన్‌పై డైరెక్టర్ కామెంట్స్

Dulquer Salmaan: కాళ్లు పట్టుకోడానికి వెనుకాడలేదు.. స్టార్ హీరో దుల్కర్ సల్మాన్‌పై డైరెక్టర్ కామెంట్స్

Sanjiv Kumar HT Telugu
Nov 02, 2024 10:33 AM IST

Venky Atluri About Dulquer Salmaan Role: మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటించిన తెలుగు ఫిల్మ్ లక్కీ భాస్కర్. మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. తాజాగా దుల్కర్ సల్మాన్‌పై, లక్కీ భాస్కర్ మూవీపై డైరెక్టర్ వెంకీ అట్లూరి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

కాళ్లు పట్టుకోడానికి వెనుకాడలేదు.. స్టార్ హీరో దుల్కర్ సల్మాన్‌పై డైరెక్టర్ కామెంట్స్
కాళ్లు పట్టుకోడానికి వెనుకాడలేదు.. స్టార్ హీరో దుల్కర్ సల్మాన్‌పై డైరెక్టర్ కామెంట్స్

Venky Atluri About Dulquer Salmaan Role: సీతా రామం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయిన మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నట వారసుడిగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన దుల్కర్ సల్మాన్ మాలీవుడ్ బాలీవుడ్, టాలీవుడ్ చిత్ర పరిశ్రమల్లో వరుసగా సినిమాలు చేసుకుంటూ సత్తా చాటుతున్నాడు.

సార్ డైరెక్టర్

ఇటీవల దుల్కర్ సల్మాన్ నటించిన టాలీవుడ్ మూవీ లక్కీ భాస్కర్. సార్ డైరెక్టర్ వెంకీ అట్లూరి డైరెక్ట్ చేసిన ఈ మూవీలో హీరోయిన్‌గా మీనాక్షి చౌదరి చేయగా.. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాతలుగా వ్యవహరించారు. ఇటీవల అక్టోబర్ 31న దివాళీ సందర్భంగా లక్కీ భాస్కర్ మూవీ థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది.

ఇంట్రెస్టింగ్ ప్రశ్నలు

ఈ నేపథ్యంలో లక్కీ భాస్కర్ మూవీ టీమ్ చిన్నిపాటి సక్సెస్ మీట్ నిర్వహిస్తూ ప్రెస్ మీట్ పెట్టారు. ఈ సందర్భంగా మీడియా నుంచి ఎదురైన పలు ఆసక్తికర ప్రశ్నలకు నిర్మాత సూర్యదేవర నాగవంశీ, దర్శకుడు వెంకీ అట్లూరి సమాధానమిచ్చారు.

"బ్యాంకింగ్ నేపథ్యంలో ఒక సినిమా చేయాలని ఎప్పటినుంచో ఉంది. ప్రేమకథలు చేసే నేను, కాస్త భిన్నంగా సందేశాత్మక సినిమా చేద్దామని 'సార్' కథ రాసుకోవడం జరిగింది. ఈసారి ఇంకా విభిన్నంగా ఏదైనా చేద్దామనుకున్నాను. ఆ ఆలోచన నుంచే 'లక్కీ భాస్కర్' కథ పుట్టింది" అని డైరెక్టర్ వెంకీ అట్లూరి తెలిపారు.

ఫైట్స్ లేనప్పటికీ

"యువతతో పాటు కుటుంబ ప్రేక్షకుల నుంచి కూడా లక్కీ భాస్కర్ సినిమాకి ఆదరణ లభిస్తోంది. ఇంకో ఆశ్చర్యకర విషయమేంటంటే.. ఇందులో ఫైట్లు లేకనప్పటికీ, మాస్ ప్రేక్షకులు ఈ సినిమా నచ్చిందని చెబుతున్నారు. సినిమాలో హీరో గెలిచిన ప్రతిసారీ తామే గెలిచినట్లు ప్రేక్షకులు భావిస్తున్నారు. అదే ఈ సినిమాకి ఇంతటి స్పందన రావడానికి కారణమైంది" అని వెంకీ అట్లూరి అన్నారు.

బ్యాంకింగ్, షేర్స్ గురించి

"బ్యాంకింగ్, షేర్స్ గురించి కొంత రీసెర్చ్ చేశాను. మా నాన్నగారి స్నేహితుడు కుటుంబరావు గారికి వీటిపై అవగాహన ఉంది. ఆయనతో కలిసి కొన్నిరోజులు ట్రావెల్ చేసి, వాటికి సంబంధించిన విషయాలను తెలుసుకొని కథలో పొందుపరిచాను" అని సినిమాకు తాను చేసిన రీసెర్చ్ గురించి చెప్పారు దర్శకుడు వెంకీ అట్లూరి.

త్రివిక్రమ్ గారి ఎఫెక్ట్

"సంభాషణలకు మంచి పేరు వస్తుండటం సంతోషంగా ఉంది. మణిరత్నం గారు, త్రివిక్రమ్ గారి స్ఫూర్తితోనే నేను సినీ పరిశ్రమలోకి వచ్చాను. నా సంభాషణల్లో త్రివిక్రమ్ గారి ప్రభావం ఎంతో కొంత ఉంటుంది" అని వెంకీ అట్లూరి చెప్పుకొచ్చారు.

ఆ పేరు రావడానికి కారణం

"దుల్కర్ సల్మాన్ గారు స్టార్ అయినప్పటికీ.. ఒక వ్యక్తి కాళ్లు పట్టుకునే సన్నివేశం చేయడానికి ఏమాత్రం వెనకాడలేదు. ఇప్పుడు ఆ సన్నివేశానికి అంత మంచి పేరు రావడానికి కారణమే ఆయనే" అని దుల్కర్ సల్మాన్ కాళ్లు పట్టుకోవడం గురించి లక్కీ భాస్కర్ డైరెక్టర్ వెంకీ అట్లూరి తెలిపారు.

Whats_app_banner