Chandoo Mondeti: 2014లో మిస్ అయిన ఫ్లైట్ శకలాలు కూడా దొరకలేదు.. కార్తికేయ 2 డైరెక్టర్ చందు మొండేటి కామెంట్స్
Chandoo Mondeti About Rahasyam Idam Jagath Movie: టాలీవుడ్ మైథాలాజికల్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన సినిమా రహస్యం ఇదం జగత్. ఇటీవల రహస్యం ఇదం జగత్ ట్రైలర్‌ను కార్తికేయ 2 డైరెక్టర్, నేషనల్ అవార్డ్ విన్నర్ చందు మొండేటి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు.
Karthikeya 2 Director Chandoo Mondeti: కార్తికేయ సినిమాతో టాలీవుడ్‌కు డైరెక్టర్‌గా పరిచయం అయ్యారు చందు మొండేటి. మొదటి సినిమాతో సూపర్ హిట్ కొట్టిన చందు మొండేటి అనంతరం ప్రేమమ్, సవ్యసాచి చిత్రాలు తెరకెక్కించారు. ఇక కార్తికేయ 2 మూవీతో నేషనల్ వైడ్‌గా పేరు తెచ్చుకున్నారు.
ఇంట్రెస్టింగ్ విశేషాలు
కార్తికేయ 2 చిత్రానికి ఉత్తమ దర్శకుడిగా నేషనల్ అవార్డ్ కూడా అందుకున్నారు చందు మొండేటి. ప్రస్తుతం నాగ చైతన్యతో తండేల్ మూవీ తెరకెక్కిస్తున్న చందు మొండేటి ఇటీవల తెలుగు మైథాలాజికల్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీ రహస్యం ఇదం జగత్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. రహస్యం ఇదం జగత్ ట్రైలర్ లాంచ్ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఇంట్రెస్టింగ్ విశేషాలు చెప్పారు చందు మొండేటి.
దేనికి కనెక్ట్ అవుతానో అదే
''ఈ రహస్యం ఇదం జగత్ ట్రైలర్ చూసి ఎగ్జైట్ ఫీలయ్యాను. పర్టిక్యులర్‌గా, పర్సనల్‌గా నేను వేటికి అయితే ఎక్కువగా ఎగ్జైట్‌అవుతానో, కనెక్ట్ అవుతానో.. చదువుతానో, రిసెర్చ్ చేస్తానో.. వాటికి సిమిలర్‌గా ఈ సినిమా కాన్సెప్ట్ ఉండటంతో ఎగ్జైట్ అయ్యాను'' అని డైరెక్టర్ చందు మొండేటి అన్నారు.
వామ్ హోల్ కాన్సెప్ట్
''పర్టిక్యులర్ ఈ వామ్‌హోల్ కాన్సెప్ట్ గురించి చెప్పాలంటే.. 2014లో మిస్ అయిన ఓ ఫ్లైట్ శకలాలు కూడా మిగలలేదు. ఆ శకలాలు ఇప్పటికీ కూడా దొరకలేదు. టెక్నాలజీ ఇంత డెవలప్ అయిన టైమ్‌లో కూడా ఇలా జరగడం పట్ల నేను డీప్‌గా పరిశోధించినప్పుడు వామ్‌హోల్ అనే కాన్సెప్ట్ కనపడింది. అది నమ్మశక్యంగా లేదని పించినప్పుడు దీనికి పురాణాలు, హనుమంతుడు. స్కంద పురాణం, నారథుడు.. ఆ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ వస్తే అమోజింగ్‌గా కనపడింది'' అని చందు మొండేటి తెలిపారు.
ఇలాంటివి చూసే మూడ్‌లో
''మన పురాతన ధర్మానికి ఇది రిలేటెడ్‌గా అనిపించింది. ఈ సినిమా తీయడం చాలా కష్టం. ఐ థింక్ సో.. ఎనీ థింగ్ రిలేటెడ్ సైన్స్.. జనాల్లో ఇలాంటి సినిమాలు చూసే మూడ్‌లో ఉన్నారు. తప్పకుండా ఈ చిత్రం అందర్ని అలరిస్తుందనే నమ్మకం ఉంది. అందరికి ఆల్ ది బెస్ట్'' అని డైరెక్టర్ చందు మొండేటి తన స్పీచ్ ముగించారు.
ప్రధాన పాత్రలు
ఇదిలా ఉంటే, సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్స్, పురాణాలు, ఇతిహాసాల మేళవింపుతో తెరకెక్కిన రహస్యం ఇదం జగత్ మూవీలో రాకేష్ గలేబి, స్రవంతి పత్తిపాటి, మానస వీణ, భార్గవ్ గోపీనాథం ప్రధాన పాత్రల్లో నటించారు. సింగిల్ సెల్ యూనివర్స్ ప్రొడక్షన్ బ్యానర్‌పై నిర్మించగా.. పద్మ రావినూతుల, హిరణ్య రావినూతుల నిర్మాతలుగా వ్యవహరించారు.
రహస్యం ఇదం జగత్ రిలీజ్ డేట్
ఇక రహస్యం ఇదం జగత్ మూవీకి కోమల్ ఆర్ భరద్వాజ్ దర్శకత్వం వహించారు. రహస్యం ఇదం జగత్ మూవీ నవంబర్ 8న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది. ఇదిలా ఉంటే, రహస్యం ఇదం జగత్ ట్రైలర్ రిలీజ్ కార్యక్రమంలో హీరోయిన్ స్రవంతి పత్తిపాటి, మానస వీణ, సంగీత దర్శకుడు గ్యానీ తదితరులు పాల్గొన్నారు.