Suryakumar Tilak Varma: ఫ్లైట్‌లో నిద్రపోతున్న తిలక్ వర్మతో ఆడుకున్న సూర్య.. నోట్లో నిమ్మరసం వేసి.. వీడియో వైరల్
Suryakumar Tilak Varma: ఫ్లైట్‌లో నిద్రపోతున్న తిలక్ వర్మతో ఆడుకున్నాడు సూర్యకుమార్ యాదవ్. అతని నోట్లో నిమ్మరసం వేసి నిద్రలో నుంచి లేపిన వీడియో వైరల్ అవుతోంది.
Suryakumar Tilak Varma: ఐపీఎల్ ఎలిమినేటర్లో లక్నో సూపర్ జెయింట్స్ ను ఓడించిన ఖుషీలో ఉన్నారు ముంబై ఇండియన్స్ ప్లేయర్స్. ఈ మ్యాచ్ లో గెలిచిన తర్వాత చెన్నై నుంచి అహ్మదాబాద్ కు ఫ్లైట్ లో వెళ్తున్న సమయంలో నిద్రపోతున్న తిలక్ వర్మతో స్టార్ బ్యాటర సూర్యకుమార్ యాదవ్ ఆడుకున్నాడు. అతని నోట్లు నిమ్మరసం వేసి నిద్రలో నుంచి లేపాడు.
ఈ వీడియోను ముంబై ఇండియన్స్ తన ట్విటర్ అకౌంట్లో పోస్ట్ చేసింది. గాఢ నిద్రలో ఉన్న తిలక వర్మ.. కాస్త నోరు తెరిచి పడుకున్నాడు. ముందు సీట్లో కూర్చున్న సూర్యకుమార్.. ఎయిర్ హోస్టెస్ నుంచి ఓ నిమ్మచెక్కను తీసుకొని మెల్లగా తిలక్ వర్మ నోట్లు వేశాడు. ఆ పులుపు రుచి తగిలే సరికి తిలక్ ఒక్కసారిగా నిద్రలో నుంచి లేచి ఏం జరిగిందో అర్థం కాక అటూఇటూ చూశాడు.
కీలకమైన ఎలిమినేటర్ మ్యాచ్ లో 26 పరుగులు చేసి తన వంతు పాత్ర పోషించాడు తిలక్ వర్మ. బాగా అలసిపోయి ఫ్లైట్ లో దొరికిన ఆ కాస్త సమయంలో నిద్రపోతున్న తిలక్ కు ఆ నిద్రను సూర్య దూరం చేశాడు. "సుఖంగా పడుకోవాలంటే మేలుకో" అనే క్యాప్షన తో ముంబై ఇండియన్స్ ఈ వీడియోను పోస్ట్ చేసింది. లక్నోతో మ్యాచ్ లో సూర్య కూడా 33 పరుగులు చేశాడు.
దీంతో ముంబై 182 రన్స్ చేయగా.. తర్వాత ఆకాశ్ మధ్వాల్ ధాటికి లక్నో కేవలం 101 పరుగులకే కుప్పకూలింది. ఇప్పుడు ముంబై టీమ్ ఫైనల్లో స్థానం కోసం రెండో క్వాలిఫయర్ లో గుజరాత్ టైటన్స్ తో తలపడనుంది. ఈ మ్యాచ్ శుక్రవారం (మే 26) అహ్మదాబాద్ లో జరగనుంది. ఇక ఫైనల్ ఆదివారం (మే 28) అక్కడే జరుగుతుంది. ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్ ఫైనల్ చేరిన విషయం తెలిసిందే.
సంబంధిత కథనం