Tilak Varma Family Celebrations: తిల‌క్ వ‌ర్మ ఆట‌కు ఫ్యామిలీ మెంబ‌ర్స్ ఫుల్ ఖుషీ - సెల‌బ్రేష‌న్స్ వీడియో వైర‌ల్‌-tilak varma family celebrate at stadium his great innings against rcb in ipl video viral ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Tilak Varma Family Celebrations: తిల‌క్ వ‌ర్మ ఆట‌కు ఫ్యామిలీ మెంబ‌ర్స్ ఫుల్ ఖుషీ - సెల‌బ్రేష‌న్స్ వీడియో వైర‌ల్‌

Tilak Varma Family Celebrations: తిల‌క్ వ‌ర్మ ఆట‌కు ఫ్యామిలీ మెంబ‌ర్స్ ఫుల్ ఖుషీ - సెల‌బ్రేష‌న్స్ వీడియో వైర‌ల్‌

Nelki Naresh Kumar HT Telugu
Apr 03, 2023 12:03 PM IST

Tilak Varma Family Celebrations: ఆదివారం రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు చేతిలో ఎనిమిది వికెట్ల తేడాతో ముంబై ఇండియ‌న్స్ ఓట‌మి పాలైంది. ఈ మ్యాచ్‌లో ముంబై ఓడిపోయినా తెలుగు క్రికెట‌ర్ తిల‌క్ వ‌ర్మ అస‌మాన ఆట‌తీరుతో ఫ్యాన్స్ మ‌న‌సుల్ని గెలుచుకున్నాడు.

తిల‌క్ వ‌ర్మ
తిల‌క్ వ‌ర్మ

Tilak Varma Family Celebrations: ఆదివారం రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు చేతిలో ముంబై ఇండియ‌న్స్‌ ఎనిమిది వికెట్ల తేడాతో చిత్తుగా ఓడిపోయింది. గ‌త ప‌దేళ్లుగా ఐపీఎల్‌లో తొలి మ్యాచ్ ఎప్పుడూ గెల‌వ‌ని ముంబై ఇండియ‌న్స్ ఆ ప‌రాజ‌యాల‌ ప‌రంప‌ర‌ను ఈ సీజ‌న్‌లోనూ కొన‌సాగించింది. ఈ మ్యాచ్‌లో ముంబై ఓట‌మి పాలైన తెలుగు ప్లేయ‌ర్‌ తిల‌క్ వ‌ర్మ మాత్రం త‌న ఆట‌తీరుతో క్రికెట్ అభిమానుల మ‌న‌సుల్ని గెలుచుకున్నాడు.

48 ప‌రుగుల‌కే నాలుగు వికెట్లు కోల్పోయి ముంబై ఇండియ‌న్స్ క‌ష్టాల్లో ఉన్న స‌మ‌యంలో అస‌మాన బ్యాటింగ్‌తో టీమ్‌కు గౌర‌వ‌ప్ర‌ద‌మైన స్కోరును అందించాడు. రొహిత్‌శ‌ర్మ‌, సూర్య‌కుమార్ యాద‌వ్ లాంటి దిగ్గ‌జ ఆట‌గాళ్లు బెంగ‌ళూరు బౌలింగ్‌ను ఎదుర్కొన‌డానికి ఇబ్బంది ప‌డ‌గా తిల‌క్ వ‌ర్మ మాత్రం చ‌క్క‌టి షాట్స్‌తో ఆక‌ట్టుకున్నాడు.

46 బాల్స్‌లో తొమ్మిది ఫోర్లు నాలుగు సిక్స‌ర్ల‌తో 84 ర‌న్స్ చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఐపీఎల్ 2023లో ముంబై ఇండియ‌న్స్ ఆడుతోన్న ఈ తొలి మ్యాచ్‌కు తిల‌క్ వ‌ర్మ ఫ్యామిలీ మెంబ‌ర్స్ హాజ‌ర‌య్యారు. అత‌డి ఆట‌తీరును చూసి ఆనందంలో మునిగిపోయారు. తిల‌క్ వ‌ర్మ ఫోర్లు, సిక్స‌ర్లు కొట్టిన ప్ర‌తిసారి అత‌డి కుటుంబ‌స‌భ్యులు సంబ‌రాలు చేసుకుంటూ క‌నిపించారు. తిల‌క్ వ‌ర్మ బ్యాటింగ్‌ను వారు ఎంజాయ్ చేస్తోన్న వీడియోను ముంబై ఇండియ‌న్స్ ట్విట్ట‌ర్‌లో షేర్ చేసింది. ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

దేశ‌వాళీ క్రికెట్‌లో హైద‌రాబాద్ టీమ్‌కు ప్రాతినిథ్యం వ‌హిస్తోన్న తిల‌క్ వ‌ర్మ గ‌త ఏడాది ముంబై ఇండియ‌న్స్ త‌ర‌ఫున ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. బ్యాట్‌తో చెల‌రేగిన అత‌డు గ‌త సీజ‌న్‌లో ముంబై ఇండియ‌న్స్ టీమ్ త‌ర‌ఫున అత్య‌ధిక ప‌రుగులు చేసిన రెండో క్రికెట‌ర్‌గా నిలిచాడు. ఈ సీజ‌న్‌లో ఫ‌స్ట్ మ్యాచ్‌తోనే క్రికెట్ అభిమానుల మ‌న‌సుల్ని గెలుచుకున్నాడు.

WhatsApp channel