Lucky Bhaskar Release Date: దుల్కర్ సల్మాన్ ‘లక్కీ భాస్కర్’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్.. పవన్ కల్యాణ్ ‘ఓజీ’తో పోటీ!-dulquer salmaan lucky bhaskar release date confirmed pawan kalyan og locked that date ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Lucky Bhaskar Release Date: దుల్కర్ సల్మాన్ ‘లక్కీ భాస్కర్’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్.. పవన్ కల్యాణ్ ‘ఓజీ’తో పోటీ!

Lucky Bhaskar Release Date: దుల్కర్ సల్మాన్ ‘లక్కీ భాస్కర్’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్.. పవన్ కల్యాణ్ ‘ఓజీ’తో పోటీ!

May 29, 2024, 06:42 PM IST Chatakonda Krishna Prakash
May 29, 2024, 06:42 PM , IST

  • Lucky Bhaskar Release Date: దుల్కర్ సల్మాన్ హీరోగా లక్కీ భాస్కర్ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి వెంకీ ఉడుముల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ డేట్‍ను నేడు ప్రకటించింది మూవీ టీమ్.

యంగ్ స్టార్ దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి హీరోహీరోయిన్లుగా లక్కీ భాస్కర్ మూవీ రూపొందుతోంది. గత నెలలో వచ్చిన టీజర్ ఆసక్తికరంగా ఉండటంతో ఈ మూవీపై అంచనాలు చాలా ఉన్నాయి.  తాజాగా ఈ మూవీ విడుదల తేదీ ఖరారైంది. 

(1 / 5)

లక్కీ భాస్కర్ సినిమా ఈ ఏడాది సెప్టెంబర్ 27వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ విషయాన్ని మూవీ టీమ్ నేడు (మే 29) అధికారికంగా ప్రకటించింది. పాన్ ఇండియా రేంజ్‍లో ఈ చిత్రం విడుదల కానుంది. 

(2 / 5)

లక్కీ భాస్కర్ చిత్రానికి వెంకీ ఉడుముల దర్శకత్వం వహిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‍మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ నిర్మిస్తున్న ఈ సినిమాకు జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. 

(3 / 5)

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న ఓజీ సినిమాను సెప్టెంబర్ 27వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు మూవీ టీమ్ గతంలోనే ప్రకటించింది. అదే డేట్‍ను ఇప్పుడు లక్కీ భాస్కర్ లాక్ చేసుకుంది. 

(4 / 5)

అయితే, ఓజీ సినిమా వాయిదా పడుతుందనే రూమర్లు సినీ సర్కిళ్లలో చక్కర్లు కొడుతున్నాయి. ఒకవేళ అదే రోజున వస్తే బాక్సాఫీస్ వద్ద ఓజీ, లక్కీ భాస్కర్ పోటీ ఉండనుంది. ఏం జరుగుతుందో చూడాలి. 

(5 / 5)

టీ20 వరల్డ్ కప్ 2024

ఇతర గ్యాలరీలు