Dulquer Salmaan: అక్కడ పట్టుకుని నొక్కింది, భరించలేని నొప్పి.. వృద్ధురాలి అసభ్యకర ప్రవర్తనపై దుల్కర్ సల్మాన్ కామెంట్స్-dulquer salmaan reveals a old woman misbehave with him and says it was very painful dulquer salmaan ott web series ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Dulquer Salmaan: అక్కడ పట్టుకుని నొక్కింది, భరించలేని నొప్పి.. వృద్ధురాలి అసభ్యకర ప్రవర్తనపై దుల్కర్ సల్మాన్ కామెంట్స్

Dulquer Salmaan: అక్కడ పట్టుకుని నొక్కింది, భరించలేని నొప్పి.. వృద్ధురాలి అసభ్యకర ప్రవర్తనపై దుల్కర్ సల్మాన్ కామెంట్స్

Sanjiv Kumar HT Telugu
Sep 19, 2024 11:42 AM IST

Dulquer Salmaan About Bad Moment With Old Lady: ఓ వృద్ధురాలితో జరిగిన అనుచిత సంఘటన గురించి సీతారామం హీరో దుల్కర్ సల్మాన్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఎవరైనా అభిమాని అసభ్యంగా తాకారా అన్న ప్రశ్నకు ఒక పెద్దావిడ అక్కడ పట్టుకుని నొక్కిందని, దాంతో భరించలేని నొప్పి కలిగిందని దుల్కర్ సల్మాన్ తెలిపాడు.

అక్కడ పట్టుకుని నొక్కింది, భరించలేని నొప్పి.. వృద్ధురాలి అసభ్యకర ప్రవర్తనపై దుల్కర్ సల్మాన్ కామెంట్స్
అక్కడ పట్టుకుని నొక్కింది, భరించలేని నొప్పి.. వృద్ధురాలి అసభ్యకర ప్రవర్తనపై దుల్కర్ సల్మాన్ కామెంట్స్

Old Woman Misbehave With Dulquer Salmaan: సీతారామం సినిమాతో తెలుగులోనూ మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు దుల్కర్ సల్మాన్. వివిధ భాషల్లో కూడా దుల్కర్ సల్మాన్‌కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే, ఒకసారి అతనికి జరిగిన చేదు అనుభవం గురించి ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు దుల్కర్ సల్మాన్.

ఇబ్బందికరమైనది

ఇటీవల బీర్ బైసెప్స్ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓ వృద్ధురాలు తనను అనుచితంగా తాకిన సంఘటనను గుర్తు చేసుకున్నాడు దుల్కర్ సల్మాన్. ఆమె తన పిరుదులను పట్టుకుని గట్టిగా నొక్కిందని, దాంతో తనకు భరించలేని నొప్పి కలిగినట్లు దుల్కర్ చెప్పాడు. ఈ అనుభవాన్ని 'ఇబ్బందికరమైనది, చాలా విచిత్రమైనది' అని ఆయన అభివర్ణించారు.

"దుల్కర్ సల్మాన్‌కు ఇంత భారీ ఫిమేల్ ఫాలోయింగ్ ఎందుకు ఉందని మీరు అనుకుంటున్నారు" అని అడిగిన ప్రశ్నకు.. "ఓ కాదల్ కన్మణి లేదా సీతా రామం సినిమాల నుంచి ఈ లేడి ఫాలోయింగ్ గురించి చర్చ జరుగుతోందని నేను అనుకుంటున్నాను. కాకపోతే నాకు కేరళలో సాలిడ్ బాయ్స్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది" అని దుల్కర్ సల్మాన్ తెలిపాడు.

కనెక్షన్ ఉంటుంది

"అసలు నేనెవరో ప్రజలకు తెలుసు. వారితో కనెక్షన్ ఉంటుంది. ఆంటీలలా కాకుండా కాస్త పెద్దవాళ్లతో, వృద్ధ మహిళలతో ఫొటోలు దికే సమయంలో జరిగిన సంభాషణలు వింతగా ఉంటాయి. ఆ సమయంలో సడెన్‌గా వారు నా బుగ్గపై ముద్దు పెడతారు. అది అంత సముచితం కాదు, కానీ, అవి స్వీట్‌గా ఉంటాయి. ఒక్కోసారి అవి మిమ్మల్ని ఆశ్చర్యానికి గురిచేస్తాయి కూడా. నేను ఎక్కడ చూడకుండా ఫోటోకు ఫోజులిస్తున్నాను. అకస్మాత్తుగా ఒక ముద్దు పెట్టారు (పెక్)" అని దుల్కర్ చెప్పాడు.

"మీ పిరుదులను ఎవరైనా ఎప్పుడైనా పట్టుకున్నారా" అని అడిగిన దానికి, "అవును. మళ్లీ ఒక పెద్దావిడే. ఎందుకో నాకు తెలియదు.. అది చాలా ఇబ్బందికరంగా, చాలా విచిత్రంగా ఉంది. నాకు భరించలేని నొప్పి కూడా కలిగింది. అది ఏదో క్యాజువల్‌గా పట్టుకున్నట్లు లేదు. ఆమె వయసులో చాలా పెద్దది. ఆమె అలా పట్టుకోవడంలో ఉన్న అర్థం ఏంటో నాకు తెలియదు" అని దుల్కర్ వివరించాడు.

చేతులు ఎక్కడ పెట్టుకోవాలో

"నేను స్టేజ్ మీద ఉన్నాను. అక్కడ చాలా మంది నిలబడి ఉన్నారు. నేను 'ఆంటీ ప్లీజ్ ఇక్కడకు వచ్చి నిలబడండి' అని చెప్పాను. చాలా సార్లు తమ చేతులు ఎక్కడ పెట్టుకోవాలో తెలియక ప్రజలు సతమతమవుతున్నారు. కొన్నిసార్లు మీ వెనుక భాగాన్ని (పిరుదులు) ముట్టుకుంటారు. కానీ, నేను 'ఎందుకిలా జరుగుతోంది?. దీని నుంచి ఎలా బయటపడాలో అర్థం కావట్లేదే' అని అనుకునేవాన్ని. ఇది విచిత్రంగా ఉంటుంది. కానీ, ఇప్పుడు ఆ విషయాన్ని పూర్తిగా మర్చిపోయాను" అని దుల్కర్ తనకు జరిగిన చేదు అనుభవాన్ని షేర్ చేసుకున్నాడు.

కాగా సీతారామం సినిమాతో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్ అనే మూవీతో అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. సినిమాలే కాకుండా గన్స్ అండ్ గులాబ్స్ వంటి ఓటీటీ వెబ్ సిరీసుల్లో కూడా దుల్కర్ సల్మాన్ నటించాడు. గన్స్ అండ్ గులాబ్స్ వెబ్ సిరీస్ ఆగస్టు 18 నుంచి నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.