Horror OTT: ఓటీటీలోకి వచ్చేసిన సరికొత్త హారర్ ఫాంటసీ థ్రిల్లర్.. మంత్రగత్తెలంతా ఒక్క చోట చేరితే.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?-agatha all along ott streaming on disney plus hotstar ott horror thriller web series agatha digital premiere from marvel ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Horror Ott: ఓటీటీలోకి వచ్చేసిన సరికొత్త హారర్ ఫాంటసీ థ్రిల్లర్.. మంత్రగత్తెలంతా ఒక్క చోట చేరితే.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Horror OTT: ఓటీటీలోకి వచ్చేసిన సరికొత్త హారర్ ఫాంటసీ థ్రిల్లర్.. మంత్రగత్తెలంతా ఒక్క చోట చేరితే.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Sanjiv Kumar HT Telugu
Sep 19, 2024 08:35 AM IST

Agatha All Along OTT Streaming: ఓటీటీలోకి సరికొత్త హారర్ ఫాంటసీ థ్రిల్లర్ వెబ్ సిరీస్ అగాథ ఆల్ ఎలాంగ్ వచ్చేసింది. సెప్టెంబర్ 18 నుంచి రెండు భాషల్లో అగాథ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. మంత్రగెత్తలంతా ఒక్క చోట చేరితే ఎలా ఉంటుంది, పాపులర్ విచ్ అగాథ స్టోరీతో ఇది తెరకెక్కింది.

ఓటీటీలోకి వచ్చేసిన సరికొత్త హారర్ ఫాంటసీ థ్రిల్లర్.. మంత్రగత్తెలంతా ఒక్క చోట చేరితే.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఓటీటీలోకి వచ్చేసిన సరికొత్త హారర్ ఫాంటసీ థ్రిల్లర్.. మంత్రగత్తెలంతా ఒక్క చోట చేరితే.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Agatha All Along OTT Release Date: హారర్ సినిమాలకు ఉండే క్రేజ్ వేరు. అందులోను ఫాంటసీ హారర్ థ్రిల్లర్స్ జోనర్స్‌లో వచ్చే సినిమాలు, వెబ్ సిరీసులపై మంచి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు మూవీ లవర్స్, ఓటీటీ ప్రేక్షకులు. ఇక మార్వెల్ సంస్థ గురించి పెద్దగా చెప్పాల్సిన పనిలేదు. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్‌కు బీభత్సమైన ఫ్యాన్ బేస్ ఉంది.

మార్వెల్ టెలివిజన్

ఎంసీయూ (మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్) నుంచి వచ్చే సినిమాలు, వెబ్ సిరీసులపై అంచనాలు విపరీతంగా ఉంటాయి. కానీ, ఎలాంటి అంచనాలు, భారీ బజ్ లేకుండా ఓటీటీలోకి వచ్చేసిన మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ వెబ్ సిరీస్ అగాథ ఆల్ ఎలాంగ్. దీన్ని "మార్వెల్ టెలివిజన్" అనే కొత్త ప్రొడక్షన్ బ్యానర్‌పై రిలీజ్ చేశారు.

ఇప్పటి వరకు మార్వెల్ నుంచి వచ్చే కంటెంట్ మార్వెల్ స్టూడియోస్, మార్వెల్ ఎంటర్టైన్‌మెంట్ సంస్థల నుంచి వచ్చేవి. కానీ, తొలిసారిగా కొత్త ప్రొడక్షన్ హౌజ్‌ మార్వెల్ టెలివిజన్‌తో అగాథ ఆల్ ఎలాంగ్ వెబ్ సిరీస్‌ను ఓటీటీ స్ట్రీమింగ్ చేశారు. అగాథ ఆల్ ఎలాంగ్ ఒక హారర్ ఫాంటసీ థ్రిల్లర్. అంతేకాకుండా, మార్వెల్ నుంచి వచ్చిన తొలి హారర్ వెబ్ సిరీస్.

అగాథ మంత్రగత్తె చుట్టూ

ఇదివరకు లైవ్ యాక్షన్, ఫాంటసీ సినిమాలు, వెబ్ సిరీసులు చేసిన మార్వెల్ తన మొట్ట మొదటి హారర్ వెబ్ సిరీస్‌గా అగాథాను డైరెక్ట్‌గా ఓటీటీ రిలీజ్ చేశారు. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్‌లో ఇది 11వ వెబ్ సిరీస్. ఇందులో అగాథ అనే మంత్రగత్తె చుట్టూ కథ నడుస్తోంది. ఈ పాత్రను మొదటగా వాండా విజన్ అనే వెబ్ సిరీస్‌లో చూస్తాం. ఇప్పుడు ఆ పాత్రతో ఏకంగా సెపరేట్ వెబ్ సిరీస్‌ను తీసుకొచ్చారు.

హారర్ ఫాంటసీ థ్రిల్లర్ వెబ్ సిరీస్ అయిన అగాథ ఆల్ ఎలాంగ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో సెప్టెంబర్ 18 నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. అది కూడా రెండు భాషల్లోనే. ప్రస్తుతానికి ఇంగ్లీష్, హిందీ భాషల్లో మాత్రమే అగాథ ఓటీటీ రిలీజ్ అయింది. త్వరలో తెలుగులో కూడా వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా అగాథ నుంచి మొదటి రెండు ఎపిసోడ్స్ మాత్రమే రిలీజ్ చేశారు.

కోల్పోయిన స్పెల్స్ దక్కించుకోవడం

మొత్తం 9 ఎపిసోడ్స్ ఉన్న అగాథ సిరీస్‌ను రెండు ఎపిసోడ్స్‌తో ఓటీటీ స్ట్రీమింగ్ చేశారు. అక్టోబర్ 30న చివరి రెండు ఎపిసోడ్స్‌తో పూర్తి వెబ్ సిరీస్‌ను విడుదల చేయనున్నారు. అగాథ అనే విచ్ (మంత్రగత్తె) తను కోల్పోయిన స్పెల్స్ (మంత్రాల ద్వారా వచ్చే పవర్స్) దక్కించుకోవడం కోసం విచ్ రోడ్‌కు వెళ్తుంది. ఈ ప్రయాణంలో ఆమెకు టీన్ అనే కుర్రాడు సహాయం చేస్తాడు.

ఈ వెబ్ సిరీస్‌లో చాలా మంది విచెస్ ఉంటారు. వారంతా ఒక్క చోట చేరి ఏం చేస్తారు?, టీన్ అనే కుర్రాడు ఎవరు?, అగాథకు విలన్‌గా మారిన తన ఫ్రెండ్ విచ్ ఎవరు? అనే ఆసక్తికర అంశాలతో అగాథ ఆల్ ఎలాంగ్ సాగనుందని ట్రైలర్ ద్వారా తెలుస్తోంది. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్‌లో ఉన్న విచెస్ అందరినీ ఇందులో చూపిస్తున్నట్లు మేకర్స్ తెలిపారు.