Zee Telugu Serials: ఇకపై నో బ్రేక్ - ఆదివారం కూడా సీరియల్స్ టెలికాస్ట్ - ఫ్యాన్స్‌కు జీ తెలుగు బంపరాఫర్
Zee Telugu Serials: సీరియల్ లవర్స్‌కు జీ తెలుగు గుడ్‌న్యూస్ వినిపించింది. ఇకపై తమ ఛానెల్‌లో ఆదివారం కూడా సీరియల్స్ టెలికాస్ట్ అవుతాయని ప్రకటించింది. టీఆర్‌పీ రేటింగ్ పరంగా టాప్‌లో ఉన్న సీరియల్స్‌ను ఆదివారం కూడా చూడొచ్చని చెప్పింది.
Zee Telugu Serials: ఇదివరకు సీరియల్స్ సోమవారం నుంచి శుక్రవారం వరకు టెలికాస్ట్ అయ్యేవి. శని, ఆదివారాల్లో మాత్రం సీరియల్స్‌కు బ్రేక్ ఇచ్చి రియాలిటీ షోస్, స్పెషల్స్ పోగ్రామ్స్‌తో పాటు సినిమాలకు టెలికాస్ట్ చేసేవారు. ఆ తర్వాత శనివారం కూడా సీరియల్స్ టెలికాస్ట్ చేస్తూ ఆదివారం మాత్రమే సీరియల్స్‌కు బ్రేక్ ఇస్తూ వస్తోన్నాయి ఛానెల్స్...
బ్రేక్ లేదు...
తాజాగా జీ తెలుగు ఆదివారం కూడా సీరియల్స్‌కు బ్రేక్ ఇవ్వకూడదని నిర్ణయించుకున్నది. తమ ఛానెల్‌లో హయ్యెస్ట్ టీఆర్‌పీ రేటింగ్ ఉన్న ఆరు సీరియల్స్‌ను ఇకపై ఆదివారం కూడా టెలికాస్ట్ చేయబోతున్నట్లు ప్రకటించింది. ఈ ఆరు సీరియల్స్‌ను సోమవారం నుంచి ఆదివారం వరకు సీరియల్ ఫ్యాన్స్ చూడొచ్చని ప్రకటించింది.
ఆరు సీరియల్స్...
చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి, మా అన్నయ్య, నిండు నూరేళ్ల సావాసం, మేఘ సందేశం, పడమటి సంధ్యారాగం, త్రియని సీరియల్స్ ఇకపై ఆదివారం కూడా టెలికాస్ట్ అవుతాయని ప్రకటించింది. చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి సీరియల్ సాయంత్రం ఆరు గంటలకు టెలికాస్ట్ అవుతోంది. మా అన్నయ్య సీరియల్‌ను సోమవారం నుంచి ఆదివారం వరకు సాయంత్రం ఆరున్నర గంటల నుంచి ఏడు గంటల వరకు చూడొచ్చని జీ తెలుగు తెలిపింది.
ఈ వీక్ నుంచే...
నిండునూరేళ్ల సావాసం ఏడు గంటలకు, మేఘ సందేశం ఏడున్నర గంటలకు టెలికాస్ట్ అవుతాయని చెప్పింది. పడమటి సంధ్యారాగం ఎనిమిది గంటలకు, త్రినయని ఎనిమిదిన్నర గంటలకు జీ తెలుగులో ప్రసారం అవుతోన్నాయి. సాయంత్రం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు టెలికాస్ అయ్యే సీరియల్స్‌ను మాత్రమే ఆదివారం టెలికాస్ట్ చేయనున్నట్లు జీ తెలుగు తెలిపింది. ఈ వారం నుంచే ఈ మార్పులు చేస్తున్నట్లు ప్రకటించింది. మధ్నాహ్నం ప్రసారమయ్యే సీరియల్స్‌కు మాత్రం ఆదివారం బ్రేక్ ఇస్తున్నట్లు జీ తెలుగు తెలిపింది.
పడమటి సంధ్యారాగం టాప్...
జీ తెలుగులో టీఆర్‌పీ రేటింగ్ పరంగా పడమటి సంధ్యారాగం సీరియల్ టాప్‌లో ఉంది. లేటెస్ట్ టీఆర్‌పీలో పడమటి సంధ్యారాగం సీరియల్‌కు 8.86 వచ్చింది. 7.75 టీఆర్‌పీతో త్రినయని సీరియల్ సెకండ్ ప్లేస్‌లో కొనసాగుతోంది. జగద్ధాత్రి సీరియల్‌కు 7.36 టీఆర్‌పీ రేటింగ్‌తో టాప్ త్రీలో నిలిచింది.
చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి లాస్ట్…
మేఘ సందేశం 6.92, నిందు నూరేళ్ల సావాసం 6.82తో టాప్ ఫైవ్‌లో స్థానం దక్కించుకున్నాయి. చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి మాత్రం టీఆర్‌పీ రేటింగ్‌లో డిసపాయింట్ చేస్తోంది. జీ తెలుగులో అతి తక్కువ టీఆర్‌పీ రీటింగ్ వస్తోన్న సీరియల్స్‌లో ఒకటిగా నిలుస్తోంది. తాజా టీఆర్‌పీ రేటింగ్స్‌లో ఈ సీరియల్‌కు 2.64 మాత్రమే వచ్చింది.