Saripodhaa Sanivaaram OTT Release Rights: నేచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ సరిపోదా శనివారం. డైరెక్టర్ వివేక్ ఆత్రేయ-నాని కాంబినేషన్‌లో వచ్చిన రెండో సినిమా కావడంతో దీనిపై తీవ్రమైన బజ్ క్రియేట్ అయింది. ఎన్నో అంచనాలతో ఆగస్ట్ 29న థియేటర్లలో రిలీజ్ అయింది.
సరిపోదా శనివారం సినిమాకు చాలా వరకు పాజిటివ్ టాక్ వచ్చింది. నాని మరోసారి తన నటనతో అదరగొట్టాడని, యాక్షన్ సీక్వెన్స్ చాలా బాగున్నాయని రివ్యూల్లో తెలిపారు. అలాగే, విలన్‌గా నటించిన తమిళ యాక్టర్ ఎస్‌జే సూర్య పర్ఫామెన్స్ మాత్రం బీభత్సం అని చెప్పారు. నాని కంటే ఎక్కువగా ఎస్‌జే సూర్య నటన హైలెట్‌గా నిలిచిందని పలు రివ్యూవర్స్ పేర్కొన్నారు.
అయితే, ప్రస్తుతం సరిపోదా శనివారం ఓటీటీ రిలీజ్ డేట్ ఆసక్తిగా మారింది. నాని యాక్షన్ థ్రిల్లర్ అయిన సరిపోదా శనివారం ఓటీటీ హక్కులు సుమారు రూ. 40 కోట్లకు అమ్ముడుపోయినట్లు సమాచారం. ఇంత భారీ ధర పెట్టి నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ సంస్థ కొనుగోలు చేసిందట. అలాగే సరిపోదా శనివారం శాటిలైట్ హక్కులను కలర్స్ సినీప్లెక్స్ (Colors Cineplex) టీవీ ఛానెల్ మంచి ధర వెచ్చించి సొంతం చేసుకుందని సమాచారం.
ఇక ఈ నెలలోనే అంటే సెప్టెంబర్ మంత్‌లోనే సరిపోదా శనివారం సినిమా ఓటీటీ రిలీజ్ కానుందని తెలుస్తోంది. సెప్టెంబర్ 26 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో సరిపోదా శనివారం ఓటీటీ స్ట్రీమింగ్ కానుందట. అది కూడా సౌత్ ఇండియన్ భాషల్లో. అంటే, తెలుగుతోపాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో సరిపోదా శనివారం డిజిటల్ ప్రీమియర్ కానుంది.
ఆ తర్వాత సెప్టెంబర్ నెల పూర్తి కాకముందుగానే సరిపోదా శనివారం హిందీ వెర్షన్ కూడా ఓటీటీలోకి రానుందట. అయితే, ఈ సినిమా హిందీ వెర్షన్ మాత్రం జియో సినిమా ఓటీటీలో ప్రసారం కానుందని సమాచారం. ఇలా మొత్తంగా రెండు ఓటీటీల్లో ఇదే నెలలో ఐదు భాషల్లో సరిపోదా శనివారం ఓటీటీ రిలీజ్ కానుందని ప్రస్తుతం బాగా వినిపిస్తోన్న బజ్.
అయితే, దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన అయితే ఇప్పటివరకు రాలేదు. ఓటీటీ స్ట్రీమింగ్ డేట్‌కు రెండు మూడు రోజుల ముంది అఫిషియల్‌గా ప్రకటించే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే, వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్‌గా నటించింది.
దసరా, హాయ్ నాన్న వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తర్వాత నాని నటించిన సరిపోదా శనివారం సినిమాలో నేచురల్ స్టార్, ఎస్‌జే సూర్య, ప్రియాంక అరుల్ మోహన్‌తోపాటు అదితి బాలన్, అభిరామి ఛాయాదేవి, అజయ్ ఘోష్, మురళి శర్మ, శుభలేఖ సుధాకర్, అజయ్, సుప్రీత్ రెడ్డి తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు.