Devara Third Song Release Date: దేవర నుంచి మూడో పాట రిలీజ్‍ డేట్ ఫిక్స్.. రొమాంటిక్ డ్యూయెట్‍గా సాంగ్‍-devara third song daavudi release date revealed with ntr and janhvi kapoor romantic poster ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Devara Third Song Release Date: దేవర నుంచి మూడో పాట రిలీజ్‍ డేట్ ఫిక్స్.. రొమాంటిక్ డ్యూయెట్‍గా సాంగ్‍

Devara Third Song Release Date: దేవర నుంచి మూడో పాట రిలీజ్‍ డేట్ ఫిక్స్.. రొమాంటిక్ డ్యూయెట్‍గా సాంగ్‍

Devara Third Song Daavudi Release Date: దేవర సినిమా నుంచి మూడో పాట రిలీజ్‍కు రెడీ అయింది. ఈ పాట రిలీజ్ డేట్‍ను మూవీ టీమ్ నేడు వెల్లడించింది. ఎన్టీఆర్, జాన్వీ కపూర్ మధ్య రొమాంటిక్ డ్యూయెట్‍గా ఈ పాట ఉండనుంది. ఓ పోస్టర్‌ను కూడా మూవీ టీమ్ రివీల్ చేసింది.

Devara Third Song Release Date: దేవర నుంచి మూడో పాట రిలీజ్‍ డేట్ ఫిక్స్.. రొమాంటిక్ డ్యూయెట్‍గా సాంగ్‍

మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న హైవోల్టేజ్ యాక్షన్ సినిమా ఈనెల (సెప్టెంబర్)లోనే రిలీజ్ కానుంది. పాన్ ఇండియా రేంజ్‍లో భారీ అంచనాలు ఉన్న ఈ చిత్రం ఈనెల 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. కొరటాల శివ దర్శకత్వంలో గ్రాండ్‍స్కేల్‍లో ఈ మూవీ రూపొందింది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన రెండు పాటలు బంపర్ పాపులర్ అయ్యాయి. ఇప్పుడు దేవర నుంచి మూడో పాట వచ్చేస్తోంది. ఈ సాంగ్ రిలీజ్ డేట్‍ను మూవీ టీమ్ నేడు వెల్లడించింది.

మూడో సాంగ్ డేట్ ఇదే

దేవర సినిమా నుంచి సెప్టెంబర్ 4వ తేదీన మూడో పాట రిలీజ్ కానుంది. ఈ విషయాన్ని మూవీ టీమ్ నేడు (సెప్టెంబర్ 2) వెల్లడించింది. దావుడి అంటూ సాగే ఈ సాంగ్ మరో రెండు రోజుల్లో 4న రానుంది. “ఇది కచ్చితంగా అదిరిపోతుంది. ప్రతీ బీట్‍ కూడా విజిల్ వేసేలా ఉంటుంది. సెప్టెంబర్ 4న దావుడి” అంటూ సోషల్ మీడియాలో దేవర టీమ్ వెల్లడించింది. ఈ చిత్రానికి సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.

డ్యూయెట్‍గా..

ఈ మూడో పాట రిలీజ్ డేట్ కోసం ఓ నయా పోస్టర్ రివీల్ చేసింది యూనిట్. బ్లాక్ ఔట్‍ఫిట్‍లో ఎన్టీఆర్ ఉండగా.. వైట్ కలర్ డ్రెస్‍లో జాన్వీ ఉన్నారు. ఎన్టీఆర్ అలా వెనక్కి వాలుతుండగా.. ఆయనను జాన్వీ రొమాంటిక్‍గా పట్టుకున్నట్టుగా ఈ పోస్టర్ ఉంది. ఈ పాటలో ఎన్టీఆర్ డ్యాన్స్ స్టెప్స్ అదిరిపోయేలా ఉంటాయని తెలుస్తోంది.

దేవర నుంచి రానున్న ఈ మూడో సాంగ్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ మధ్య డ్యుయెట్ సాంగ్‍గా ఉండనుంది. కాస్త ఫాస్ట్ బీట్‍తో ట్రెండీ పదాలతో ఈ పాట ఉంటుందని తెలుస్తోంది. ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించారని టాక్. రేపు ఈ పాటకు సంబంధించి ప్రోమో వచ్చే అవకాశం ఉంది. దానితో పాటే సెప్టెంబర్ 4న ఏ సమయానికి పాటను రిలీజ్ చేసేది మూవీ టీమ్ వెల్లడిస్తుంది.

దేవర సినిమా నుంచి వచ్చిన తొలి పాట ‘ఫియర్ సాంగ్’ చాలా పాపులర్ అయింది. మూవీపై బజ్‍ను పెంచేసింది. గత నెల వచ్చిన మెలోడీ సాంగ్ ‘చుట్టమల్లే’ కూడా చార్ట్‌బస్టర్ అయింది. ఇప్పటికే అన్ని భాషల్లో కలిపి ఈ పాట 25 మిలియన్లకు పైగా వ్యూస్ దక్కించుకుంది. ఈ పాట మోతమోగుతోంది. దీంతో మూడో పాటపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి.

దేవర సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ విలన్‍గా నటిస్తున్నారు. బాబీ డియోల్ కూడా ఓ ముఖ్యమైన పాత్ర చేస్తున్నారు. ఈ చిత్రంలో శ్రీకాంత్, ప్రకాశ్ రాజ్, షైన్ టామ్ చాకో, నరైన్, శృతి మరాథే కీరోల్స్ చేశారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు ఈ మూవీని నిర్మించాయి. సుమారు రూ.300 కోట్ల భారీ బడ్జెట్‍‍తో ఈ సినిమా రూపొందుతోందని అంచనా.