Chuttamalle Song Lyrics: చుట్టమల్లే చుట్టేస్తాందె తుంటరి చూపు.. దేవర సెకండ్ సింగిల్ లిరిక్స్ ఇవే
Chuttamalle Song Lyrics: దేవర నుంచి వచ్చిన సెకండ్ సింగిల్ చుట్టమల్లే చుట్టేస్తాందే సాంగ్ ఇన్‌స్టాంట్ హిట్ గా నిలిచింది. ఈ రొమాంటిక్ మెలోడియస్ సాంగ్ మైమరిపిస్తోంది. మరి ఆ సాంగ్ లిరిక్స్ ఇక్కడ చూసేయండి.
Chuttamalle Song Lyrics: జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ నటించిన దేవర మూవీ నుంచి చుట్టమల్లే చుట్టేస్తాందె అంటూ సాగిపోయే సెకండ్ సింగిల్ సోమవారం (ఆగస్ట్ 5) రిలీజైన విషయం తెలిసిందే. ఈ పాటలో అందరి కళ్లూ తారక్, జాన్వీ మీద ఉండగా.. బ్యాక్‌గ్రౌండ్లో వచ్చే లిరిక్స్, మ్యూజిక్ కూడా ఎంతో ఆకట్టుకునేలా ఉన్నాయి.
చుట్టమల్లే సాంగ్ లిరిక్స్
తన కలల రాకుమారుడి కోసం ప్రతి అమ్మాయి పాడుకునేలా ఉన్న ఈ చుట్టమల్లే చుట్టేస్తాందె సాంగ్ లిరిక్స్ ఇక్కడ ఇస్తున్నాం. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందించిన ఈ పాటను బాలీవుడ్ సింగర్ శిల్పా రావ్ పాడగా.. రామజోగయ్య శాస్త్రి రాశాడు. ఎన్టీఆర్, జాన్వీ జోడీ తెరపై ఎంతో అందంగా కనిపిస్తోంది.
ఈ సినిమా ద్వారానే తొలిసారి తెలుగులోకి అడుగుపెడుతున్న జాన్వీ.. తన తల్లి శ్రీదేవిలాగే అందంతో ఇక్కడి ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉందని ఈ పాట చూస్తే తెలుస్తోంది. దేవర మూవీ నుంచి వచ్చిన ఈ సెకండ్ సింగిల్ ఇన్‌స్టాంట్ హిట్ గా నిలిచింది. ఈ పాట తెగ ట్రెండ్ అవుతోంది. తారక్, జాన్వీ కెమెస్ట్రీ చూసి ఒకప్పటి ఎన్టీఆర్, శ్రీదేవి జోడికి గుర్తుకు వస్తోందంటూ కొందరు కామెంట్ చేయడం విశేషం. ఈ దేవర పార్ట్ 1 మూవీ సెప్టెంబర్ 27న రిలీజ్ కానుంది. మరి ఈ చుట్టమల్లె సాంగ్ లిరిక్స్ ఇక్కడ చూసేయండి.
లిరిక్స్ ఇవే..
చుట్టమల్లే చుట్టేస్తాంది తుంటరి చూపు
ఊరికే ఉండదు కాసేపూ....
అస్తమానం నీ లోకమే నా మైమరపు
చేతనైతే నువ్వే నన్నాపు
రా నా నిద్దర కులాసా నీ కలలకిచ్చేశా
నీ కోసం వయసు వాకిలి కాశా....
రా నా ఆశలు పోగేశా నీ గుండెకు అచ్చేశా
నీ రాకకు రంగం సిద్ధం చేశా
ఎందుకు పుట్టిందో పుట్టింది
ఏమో నువ్వంటే ముచ్చట పుట్టింది
పుడతానే నీ పిచ్చి పట్టింది
నీపేరు పెట్టింది.. వయ్యారం
ఓణీ కట్టింది గోరింట పెట్టింది
సామికి మొక్కులు కట్టింది
చుట్టమల్లే చుట్టేస్తాంది.. హా చుట్టేస్తాంది.. చుట్టమల్లే చుట్టేస్తాంది..
చుట్టమల్లే చుట్టేస్తాంది తుంటరి చూపు
ఊరికే ఉండదు కాసేపూ....
మత్తుగా మెలేసింది నీ వరాల మగసిరి
హత్తుకోలేవా మరి సరసన చేరీ..
వాస్తుగా పెంచానిట్టా వందకోట్ల సొగసిరి
ఆస్తిగా అల్లేసుకో కొసరి కొసరీ..
చెయ్యరా ముద్దుల దాడి
ఇష్టమేలే నీ సందడి
ముట్టడించి ముట్టేసుకోలేవ
ఓసారి చెయిజారి
రా ఏ బంగరు నక్లీసు.. నా ఒంటికి నచ్చట్లే
నీ కౌగిలితో నను సింగారించు
రా ఏ వెన్నెల జోలాలి నను నిద్దర పుచ్చట్లే
నా తిప్పలు కొంచెం ఆలోచించు
ఎందుకు పుట్టిందో పుట్టింది
ఏమో నువ్వంటే ముచ్చట పుట్టింది
పుడతానే నీ పిచ్చి పట్టింది
నీపేరు పెట్టింది వయ్యారం
ఓణీ కట్టింది గోరింట పెట్టింది
సామికి మొక్కులు కట్టింది
చుట్టమల్లే చుట్టేస్తాంది.. హా చుట్టేస్తాంది.. చుట్టమల్లే చుట్టేస్తాంది..
చుట్టమల్లే చుట్టేస్తాంది తుంటరి చూపు
ఊరికే ఉండదు కాసేపూ....