Devara Trailer: ఎన్టీఆర్ ‘దేవర’ సినిమా ట్రైలర్ రిలీజ్ డేట్ ఖరారైందా? నిజమిదే
Devara Trailer: ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర సినిమా ట్రైలర్ కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. రిలీజ్ దగ్గరపడుతుంటంతో ట్రైలర్ ఎప్పడొస్తుందా అనే ఆసక్తి నెలకొంది. అయితే, దేవర ట్రైలర్ రిలీజ్ డేట్ ఇదే అంటూ తాజాగా ఓ సమాచారం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర సినిమా మరో నెలలో రిలీజ్ కానుంది. ఈ మాస్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం సెప్టెంబర్ 27వ తేదీన థియేటర్లలోకి రానుంది. ఈ సినిమాపై పాన్ ఇండియా రేంజ్‍లో చాలా క్రేజ్ ఉంది. కొరటాల శివ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. రిలీజ్ సమీపిస్తుండటంతో దేవర నుంచి ట్రైలర్ ఎప్పుడొస్తుందా అనే క్యూరియాసిటీ పెరిగిపోతోంది. ఈ తరుణంలో ట్రైలర్ రిలీజ్ డేట్ ఖరారైందంటూ ఇటీవల ఓ తేదీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
డేట్‍పై నిజం ఇదే
దేవర సినిమా ట్రైలర్ సెప్టెంబర్ 15వ తేదీన రిలీజ్ అవటం ఖరారైందంటూ ఇటీవల సోషల్ మీడియాలో రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. అయితే, ఆ విషయంపై ఈ సినిమా వర్గాలు స్పందించాయి. ఇంకా దేవర ట్రైలర్ డేట్‍ను తాము నిర్ణయించలేదని తెలిపాయి.
దేవర ట్రైలర్ రిలీజ్ తేదీపై మేకర్స్ త్వరలోనే అప్‍డేట్ ఇచ్చే అవకాశం ఉంది. మూవీ విడుదలకు ఇంకా 30 రోజుల కంటే సమయం తక్కువే ఉంది. ప్రమోషన్లను కూడా మూవీ టీమ్ అతిత్వరలోనే స్టార్ట్ చేసే అవకాశం ఉంది. ట్రైలర్ వస్తే క్రేజ్ మరింత పెరుగుతుంది.
ఇప్పటికే దేవర చిత్రం నుంచి వచ్చిన రెండు పాటలు పాన్ ఇండియా రేంజ్‍లో పాపులర్ అయ్యాయి. మరిన్ని అప్‍డేట్స్ కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ సెప్టెంబర్ 27న తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో రిలీజ్ కానుంది. అన్ని భాషల కోసం ప్రమోషన్లను జోరుగా చేసేలా మూవీ టీమ్ పక్కా ప్లాన్ వేస్తోందని తెలుస్తోంది.
మూడో పాట కోసం..
దేవర సినిమా నుంచి మూడో పాట కూడా రెడీ అయినట్టు సమాచారం. ఇప్పటికే ఈ పాట గురించి లిరిసిస్ట్ రామజోగయ్య శాస్త్రి హింట్స్ ఇచ్చారు. ఈ పాట అద్భుతంగా ఉంటుందంటూ పేర్కొన్నారు. ఈ సాంగ్ కూడా మాస్ బీట్‍తో ఉండే అవకాశం ఉంది. దేవర చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం నుంచి వచ్చిన ‘ఫియర్ సాంగ్’, ‘చుట్టమల్లే’ చార్ట్ బస్టర్లు అయ్యాయి. దీంతో మూడో పాట కోసం ప్రేక్షకులు ఆసక్తిగా నిరీక్షిస్తున్నారు.
దేవర చిత్రంలో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‍గా నటించారు. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్, బాబీ డియోల్ విలన్లుగా చేశారు. ఈ మూవీలో ప్రకాశ్ రాజ్, షైన్ టామ్ చాకో, శ్రీకాంత్, తారక పొన్నాడ, శృతి మరాథే, మురళీ శర్మ కీలకపాత్రలు పోషించారు.
షూటింగ్ ఫినిష్
దేవర సినిమా షూటింగ్ పూర్తయినట్టు తెలుస్తోంది. ఈ మూవీలో తన పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్నానని ఎన్టీఆర్ ఇటీవలే వెల్లడించారు. అయితే, మిగిలిన కాస్త షూటింగ్‍ను కూడా డైరెక్టర్ కొరటాల శివ పూర్తి చేశారని సమాచారం. ప్రస్తుతం ఈ చిత్రం పోస్టుప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి.
దేవర చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సుమారు రూ.250కోట్ల బడ్జెట్‍తో ఈ చిత్రం రూపొందుతోందనే అంచనాలు ఉన్నాయి. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ నుంచి వస్తున్న మూవీ కావటంతో దేవరపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి.