Brahmamudi Kavya: బ్రహ్మముడి వర్సెస్ గుండెనిండా గుడిగంటలు - సీరియల్స్ టీఆర్‌పీ రేటింగ్ విషయంలో మీనాతో కావ్య గొడవ
టీఆర్‌పీ రేటింగ్ విషయంలో గుండెనిండా గుడిగంటలు హీరోయిన్ మీనాతో బ్రహ్మముడి కావ్య సరదాగా గొడవపడింది. రేటింగ్‌లో నెక్స్ట్ వీక్ మేము మిమ్మల్ని దాటేస్తామని కావ్య అన్న మాటలకు అది మీ భ్రమ అంటూ మీనా బదులిచ్చింది. మేము నంబర్‌వన్ రాగానే బ్రహ్మముడి టీమ్ భయపడిపోయారంటూ బాలు అన్నాడు.
Brahmamudi Kavya:ప్రస్తుతం స్టార్ మాలో టాప్ సీరియల్స్‌గా కొనసాగుతోన్నాయి. బ్రహ్మముడి, గుండెనిండా గుడిగంటలు. టీఆర్‌పీ రేటింగ్‌లో బ్రహ్మముడి టాప్‌లో కొనసాగుతోంది. ఏడాదికాలంగా నంబర్ వన్ ప్లేస్‌లో ఉంది. మరోవైపు గుండెనిండా గుడిగంటలు టీఆర్‌పీ రేటింగ్‌లో టాప్ త్రీలో ఉంది.
లేటెస్ట్ టీఆర్‌పీ రేటింగ్‌లో అర్బన్ ఏరియాలో బ్రహ్మముడి సీరియల్‌ను దాటేసి గుండెనిండా గుడిగంటలు నంబర్ వన్ ప్లస్‌లోకి దూసుకొచ్చింది. ఈ రేటింగ్ విషయమై గుండెనిండా గుడిగంటలు హీరోయిన్ మీనాతో బ్రహ్మముడి కావ్య సరదాగా గొడవపడింది.
ఆదివారం స్టార్ మా పరివారం...
ఆదివారం స్టార్ మా పరివారం నెక్స్ట్ సండే ఎపిసోడ్‌లో బ్రహ్మముడి టీమ్‌తో పాటు గుండెనిండా గుడిగంటలు సీరియల్ నటీనటులు సందడి చేయబోతున్నారు. ఈ షోకు సంబంధించిన ప్రోమోను స్టార్ మా రిలీజ్ చేసింది. ఈ ప్రోమో ప్రారంభంలో రేటింగ్ విషయంలో కావ్య, మీనా సరదాగా గొడవపడ్డారు.
రేటింగ్‌లో మేమే టాప్...
మీనా, కావ్య ఎంట్రీతోనే ఈ ప్రోమో మొదలైంది. ఆ తర్వాత మేమే హయ్యెస్ట్ రేటింగ్‌లో ఉన్నా కదా అంటూ మీనానే దాటేసి ముందుకు అడుగువేసింది కావ్య. దాన్ని దాటి మేము వచ్చాం కదా అంటూ కావ్యకు బదులిస్తూ ఆమెను దాటేసి ముందుకు గెంతింది మీనా. నెక్స్ట్ వీక్ ఇంకా దాటుతాం కదా అంటూ కావ్య కూడా ముందుకు దూకింది. అది మీ భ్రమ అంటూ మీనా సమాధానమిచ్చింది. వారిద్దరి వాదనపై ఇట్లనె గెంతుతూ దుబాయ్ వరకు పొండి అంటూ శ్రీముఖి సెటైర్లు వేయడం నవ్వులను పూయించింది.
నంబర్ వన్ మాకు అమ్మ వంటిది...
ఒక్క వీక్ నంబర్ వన్‌లోకి మేము రాగానే భయపడిపోయారు అంటూ బ్రహ్మముడి టీమ్‌తో బాలు అన్నాడు. నంబర్ వన్ మాకు అమ్మ లాంటిది ఎప్పుడు మాతోనే ఉంటుంది అంటూ బాలుకు కావ్య బదులిచ్చింది. ఆమె డైలాగ్‌పై విష్ణు ఫన్నీగా ఫైర్ అయ్యాడు. ఏ దీపికా గుర్తుపెట్టుకో...డైలాగ్ ఇప్పుడు కాదు తర్వాత అంటూ నవ్వించాడు.
ఆదివారం స్టార్ మా పరివారం ఎపిసోడ్‌లో తమ ఫన్నీ డైలాగ్స్, ఆటలు, పాటలతో బ్రహ్మముడి, గుండెనిండా గుడి గంటలు లీడ్ యాక్టర్ ప్రేక్షకులను అలరించారు. ఆదివారం స్టార్ మా పరివారం ప్రోమో వైరల్ అవుతోంది.
500 ఎపిసోడ్స్ కంప్లీట్...
బ్రహ్మముడి, గుండెనిండా గుడిగంటలు రెండు సీరియల్స్ ఫ్యామిలీ ఎమోషన్స్‌తోనే తెరకెక్కాయి.
బ్రహ్మముడి సీరియల్‌లో రాజ్ పాత్రలో మానస్ నాగులపల్లి, కావ్య పాత్రలో దీపికా రంగరాజు నటిస్తోన్నారు. బ్రహ్మముడి ఇటీవలే 500 ఎపిసోడ్స్ పూర్తిచేసుకున్నది.
గుండునిండా గుడిగంటలు సీరియల్‌లో మీనా పాత్రలో అమూల్య గౌడ, బాలుగా విష్ణుకాంత్ కీలక పాత్రలు చేస్తోన్నారు. ఈ రెండు సీరియల్స్‌ను స్టార్ మాతో పాటు డిస్నీ ప్టస్ హాట్‌స్టార్‌లో చూడొచ్చు.
టాప్ ఫైవ్ సీరియల్స్...
స్టార్ మా సీరియల్స్‌లో టీఆర్‌పీ రేటింగ్ పరంగా బ్రహ్మముడితో పాటు కార్తీక దీపం 2, గుండెనిండా గుడిగంటలు, ఇంటింటి రామాయణం, చిన్ని సీరియల్స్ టాప్ ఫైవ్‌లో ఉన్నాయి.