Brahmamudi March 29th Episode: బ్రహ్మముడి- రాజ్ తెచ్చిన బిడ్డకు తల్లి శ్వేత? అనామికను కుక్కిన పేనులా పడి ఉండమన్న అపర్ణ
Brahmamudi Serial March 29th Episode: బ్రహ్మముడి సీరియల్ మార్చి 29వ తేది ఎపిసోడ్‌లో రాజ్ వల్ల కోటి రూపాయల నష్టం వచ్చిందని గొడవ చేస్తుంది ధాన్యలక్ష్మీ. దానికి సపోర్ట్ చేసిన అనామికకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుంది అపర్ణ. ఇలా బ్రహ్మముడి నేటి ఎపిసోడ్‌లో..
Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో బాబుకు స్నానం ఎలా చేయించాలో రాజ్‌కు కావ్య చెబుతుంది. కానీ, రాజ్‌కు అలా చేయడం రాదు. దాంతో కావ్యే బాబును తీసుకుని స్నానం చేయిస్తుంది. ముందు నేను చేయిస్తాను. తర్వాత మీరు చూసి నేర్చుకోండి అని చెప్పి స్నానం చేయిస్తుంది. నా అంతా వెర్రి బాగుల్ది ఎవతైనా ఉంటుందా. వీలైనంత త్వరగా బాబు తల్లిని తీసుకురండి అని అంటుంది కావ్య.
అన్నయ్యకు తెలియనివ్వకు
తర్వాత బాబుకు కావ్య స్నానం చేయిస్తుంటే రాజ్ ప్రేమగా చూస్తాడు. ఇలా మనిద్దరిని ఇక్కడ చూస్తే మీ అమ్మ గారు తలంటుతారు అని కావ్య అంటుంది. దాంతో రాజ్ సైలెంట్‌గా ఉండిపోతాడు. మరోవైపు ప్రకాశం ఫోన్‌లో ఆఫీస్ విషయాలు మాట్లాడుతుంటాడు. కంపెనీకి కోటి రూపాయల నష్టం వచ్చిందని, రాజ్ సర్ చూసుకుంటారు కదా అనుకున్నాను. కానీ ఇలా జరిగింది అని అవతలి వ్యక్తి ప్రకాశంకు చెబుతాడు. వాడు ఉన్న పరిస్థితిలో అది చూసుకోనట్టున్నాడు. ఇది నేను హ్యాండిల్ చేస్తాను. అన్నయ్యకు ఈ విషయం తెలియనివ్వకు అని కాల్ కట్ చేస్తాడు ప్రకాశం.
కానీ, బాల్కనీ నుంచి ప్రకాశం మాటలు రుద్రాణి, అనామిక వింటారు. చూశారా ఆంటీ బావగారు కోటి రూపాయల నష్టం తెస్తే తెలియద్దంటా అని అనామిక అంటుంది. మా అన్నయ్య చెప్పకుంటే ఏంటీ మనం చెబుదాం. చిచ్చు పెట్టడానికి ఒక్క అగ్గిపుల్ల చాలు. ఇది మీ అత్తయ్యకు చెబుదామని వెళ్లి జరిగింది అంతా ధాన్యలక్ష్మీకి చెబుతుంది రుద్రాణి. దొరికింది మా అక్క. ఆరోజు నా భర్తను పట్టుకుని అన్ని మాటలు అన్నారు. ఇప్పుడు ఏం చేస్తారో చూస్తాను అని ధాన్యలక్ష్మీ బయలుదేరుతుంది.
ఎవరినీ కాపాడుదామని
పక్కవాళ్లకు చిచ్చు పెడితే ఎంతో ప్రశాంతంగా ఉంటుంది అని రుద్రాణి అనామికతో అంటుంది. మరోవైపు ఆ అలంకృత జ్యూలర్స్ వాళ్ల ఆర్డర్ మధ్యలోనే ఆపేశారట ఎందుకు అని ప్రకాశంను అడుగుతాడు సుభాష్. అది నేను చూసుకుంటానులే అన్నయ్య అని ప్రకాశం అంటాడు. అది రేపటిదాకా మీకు గుర్తుండాలి కదా. ఇప్పుడే చెప్పండి. ఈ విషయంలో ఎందుకు నిజం దాస్తున్నారు. ఎవరినీ కాపాడుదామని అని ధాన్యలక్ష్మీ అంటుంది.
ఏంట్రా ధాన్యలక్ష్మీ ఏమంటుంది అని సుభాష్ అడుగుతాడు. దాంతో అంతా చెప్పేస్తుంది ధాన్యలక్ష్మీ. కంపెనీకి కోటి రూపాయల నష్టం వచ్చింది. అది రాజ్ వల్ల అని దాన్యలక్ష్మీ అంటుంది. దాంతో కంపెనీ విషయాలు మీ ఆడవాళ్లకు ఎందుకు అని ప్రకాశం అంటాడు. మరి మా అక్క కూడా ఆడదే కదండి. ఆరోజు ఎందుకు మీపై అంతలా ఎగిరిపడ్డారు. మీరు 50 లక్షలు నష్టం చేస్తేనే అంతలా పరువు తీశారు. మరి ఇప్పుడు దానికి రెట్టింపు నష్టం వచ్చింది ఏం చేస్తారు అని ధాన్యలక్ష్మీ అంటుంది.
ఎన్నిసార్లు పరువు తీశారు
దాంతో ఎన్నిసార్లు తీశారు పరువు అని రాజ్ అరుస్తాడు. ఈ ఇంట్లో బాబాయ్ పరువు ఎన్నిసార్లు తీశారు. ఎందుకు ప్రతిసారి వేరు చేసి మాట్లాడతావ్. అసలు మీరు మానసికంగా దూరమై మమ్మల్ని వేరు చేసి మాట్లాడుతున్నారు. నావల్లే నష్టం జరిగి ఉండొచ్చు అయితే ఏంటీ అని రాజ్ కోపంగా అంటాడు. మరి ఆరోజు మా ఆయనను ఎందుకు నిలదీశారు అని ధాన్యలక్ష్మీ అంటే.. ఆపు. ఆరోజు అన్నదానికి మా ఆయన సారీ చెప్పారు. నిన్న గాక మొన్న వచ్చినదానివి నీకెందుకు అనకుండా నా తమ్ముడిని అనే హక్కు కూడా లేదా అని సారీ చెప్పారు. ఇప్పుడు ఆ విషయం ఎందుకు తిరగదోడుతున్నావ్ అని అపర్ణ అంటుంది.
ఏం చెప్పమంటావ్ నీకు. ఆరోజే నాకు అర్థమైంది కంపెనీ విషయాల్లో మనం జోక్యం చేసుకోకూడదని. అప్పటి నుంచి నేను ఆ విషయాలు ప్రస్తావించట్లేదు. ఇప్పుడు నువ్ ఏం సాధిద్దామని నోరు వేసుకుని పడిపోతున్నావ్. అలా చేస్తే.. నీ క్యారెక్టర్ ఏంటో బయటపడుతుంది. అంతకుమించి సాధించేదేం లేదు అని అపర్ణ అంటుంది. ఇంతలో కానీ, ఆ కోటి రూపాయల విషయం అంటూ మెల్లిగా అనామిక లేవనెత్తుతుంది. దాంతో హే ఆపు అని అపర్ణ ఫైర్ అవుతుంది.
ఆలస్యమైంది
నీ పుట్టింటి ఆస్తి కానీ అందులో ఉందా. నీ ఇంట్లో వాళ్లకు అందులో భాగస్వామ్యం ఉందా. నీ పుట్టింటి నుంచి తీసుకొచ్చావా. నిన్న గాక మొన్న వచ్చినదానివి కుక్కినపేనులా పడి ఉండు. అంతేగానీ ఎక్కువ చేస్తే శాంతను పని మానిపిస్తా. ఇంటి కోడలిగా అన్ని పనులు నువ్వే చేయాలి జాగ్రత్త అని అనామికకు గట్టి వార్నింగ్ ఇస్తుంది అపర్ణ. డాడీ నా మనసు స్థిమితంగా లేదు. వాళ్ల ఆర్డర్ పట్టించుకునే సరికి ఆలస్యమైంది. దాంతో వాళ్లు డ్రాప్ అయ్యారు అని రాజ్ చెబుతాడు.
ఇది పోతే ఇంకో ఆర్డర్ రాదా. ఆ నష్టాన్ని నేను పూర్తి చేయలేనా. అయితే ఏంటీ పిన్ని నేను ఇప్పుడు సారీ చెప్పాల. నేను వారసుడిగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి ఇప్పుడు కోటి రూపాయల నష్టం వచ్చింది. కానీ, ఒకే సంవత్సరంలో ఎన్నో లాభాలు కూడా తీసుకొచ్చాను. దేనికి సారీ చెప్పాలి. నష్టానికా.. లాభాలకా.. మరి ఇంట్లో లాభనష్టాల సంగతి ఏంటీ. అక్కా చెల్లెళ్లలాంటి తోడి కోడళ్ల మధ్య సక్యత లేదు. అన్నదమ్ముల మధ్య బేధాభిప్రాయాలు తీసుకొస్తున్నారు. ఈ నష్టాన్ని ఎవరు భర్తీ చేస్తారు అని రాజ్ అంటాడు.
విచ్ఛిన్నం కాకుండా
స్వప్నకు ఆస్తి రాసిచ్చినప్పుడు మా అత్తను నీది ఈ ఇల్లే కాదు అన్నారు. అది లాభమా నష్టమా అని రాజ్ రుద్రాణికి సపోర్ట్‌గా మాట్లాడుతాడు. ధర్మరాజు లాంటి అన్న తమ్ముడిని ఓ మాట అంటే పడకూడదనే మీ అహంభావం లాభమా నష్టమా. నాకు దెబ్బతగిలితే తల్లడిల్లే ఆ తల్లి మనసు ఏమైంది. కల్యాణ్‌కు జ్వరం వస్తే ఇంటిల్లిపాది చూసుకున్నారు. అది గుర్తు లేదా. దయచేసి కుటుంబం విచ్ఛిన్నం కాకుండా చూసుకుందాం అని ధాన్యలక్మీకి చేతులతో దండం పెట్టి వేడుకుంటాడు రాజ్. దాంతో అంతా ఎమోషనల్ అవుతారు.
ఇప్పటివరకు లాభనష్టాల గురించి బాగా మాట్లాడావ్ రాజ్. పాలకుండలాంటి ఈ ఇంట్లో విషపు చుక్క పడింది. అది లాభమా నష్టమా అని రాజ్ బాబు గురించి అడుగుతుంది అపర్ణ. ధాన్యలక్ష్మీ, ఇంకొకరు మాటలు అనే పరిస్థితి తీసుకొచ్చింది ఎవరు. ఇల్లంతా బూడిదలా మారుతుంటే వాటిలో రాశులు వెతుక్కో ఎంత లాభం వచ్చిందో.. ఎంత నష్టం జరిగిందో అని వెళ్లిపోతుంది అపర్ణ. మరోవైపు అప్పు ఎగ్జామ్, ఫిజికల్ టెస్ట్స్ పాస్ అయిందని, పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుందని, మెయిల్ వస్తుందని ఆఫీసర్ చెబుతాడు.
భయపడిపోయిన బ్రోకర్
దాంతో సంతోషంతో అప్పు బయటకు వెళ్తుంది. ఇంతలో బ్రోకర్ వచ్చి.. లంచం ఇస్తే గానీ ఆ మెయిల్ రాదని అంటాడు. ఇంతకుముందు చెప్పినట్లు డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒక్క నైట్ వచ్చి మా వాన్ని సాటిస్‌ఫై చేస్తే చాలు అని బ్రోకర్ అంటాడు. దాంతో అతని కాలర్ పట్టుకుంటుంది అప్పు. భయంతో చుట్టూ చూస్తాడు బ్రోకర్. కాలర్ పట్టుకోగానే భయపడిపోతున్నావ్. నీకెందుకురా ఇవన్నీ. నేను కావాలనుకుంటే పోలీస్ కావడం మానేస్తాను. కానీ నా క్యారెక్టర్ మార్చుకోను. పోలీస్ అవ్వాలని ఆవేశాన్ని పక్కన పెట్టాను. లేకుంటే ఇక్కడం చంపేసేదాన్ని అని వెళ్లిపోతుంది అప్పు. దాంతో భయపడిపోతాడు బ్రోకర్.
మరోవైపు బాబును పట్టుకుని ఆఫీస్‌కు బయలుదేరుతాడు రాజ్. ఇప్పుడు బిడ్డతో ఆఫీస్‌కు వెళితే అందరికీ ఏం సమాధానం ఇస్తారు. మీరు ఆ బిడ్డ తల్లిని తీసుకురండి. నేను ఈ ఇంటి గడపదాటుతాను. మీ నుంచి నన్ను వేరు చేసే హక్కు మీకు లేనట్లే.. బిడ్డను తన తల్లి నుంచి దూరం చేసే హక్కు కూడా లేదు. మర్యాదగా బిడ్డ తల్లిని తీసుకురండి. అందరికీ చూపించండి. సిగ్గు లేకుండా నేను వెళ్లిపోతాను అని కావ్య అంటుంది. ఆఫీస్‌కు రా పూర్తి చేయాల్సిన డిజైన్స్ చాలా ఉన్నాయి అని రాజ్ అంటాడు.
బాబుతో ఆఫీస్‌కు రాజ్
అప్పుడు నన్నువెన్నెముక లేని ఆడదానిగా చూస్తారు. ఇప్పటికే ఇంట్లో నాకు గతిలేక ఇక్కడ ఉంటున్నాను. పుట్టింటికి వెళ్లలేక మీకు సపోర్ట్ చేస్తున్నానని అంటున్నారు. మీరు మీ జీవితం బాగా డిజైన్ చేసుకున్నారు. సరే పదండి వస్తాను అని రాజ్‌తోపాటు కావ్య ఆఫీస్‌కు వెళ్తుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాతి ఎపిసోడ్‌లో అంతా రాజ్‌ను విచిత్రంగా చూస్తుంటారు. తర్వాత ఆఫీస్‌కు శ్వేత వస్తుంది. రాజ్‌తో శ్వేత మాట్లాడుతుంటే కావ్య వచ్చి అనుమానంగా చూస్తుంది. అయితే ఆ రాజ్ తీసుకొచ్చిన బాబు శ్వేత కొడుకా అని డౌట్ తలెత్తుతోంది.
టాపిక్