Brahmamudi March 19th Episode: బ్రహ్మముడి.. కావ్యకు వరుసగా షాక్‌లు.. విడాకుల గురించి చెప్పిన రాజ్.. విడిపోతున్న జంట-brahmamudi serial march 19th episode raj reveals truth to duggirala family about kavya divorce brahmamudi today episode ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Brahmamudi Serial March 19th Episode Raj Reveals Truth To Duggirala Family About Kavya Divorce Brahmamudi Today Episode

Brahmamudi March 19th Episode: బ్రహ్మముడి.. కావ్యకు వరుసగా షాక్‌లు.. విడాకుల గురించి చెప్పిన రాజ్.. విడిపోతున్న జంట

Sanjiv Kumar HT Telugu
Mar 19, 2024 07:42 AM IST

Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ మార్చి 19వ తేది ఎపిసోడ్‌లో పాపం కావ్యకు వరుసగా షాక్‌లు తగులుతాయి. కోడలిగా నగలు ఇచ్చిన అపర్ణ కేవలం అది బాధ్యత మాత్రమే అంటుంది. తర్వాత పూజలో హారతి పళ్లెం కింద పడేస్తుంది అపర్ణ. ఇలా బ్రహ్మముడి నేటి ఎపిసోడ్‌లో..

బ్రహ్మముడి సీరియల్ మార్చి 19వ తేది ఎపిసోడ్‌
బ్రహ్మముడి సీరియల్ మార్చి 19వ తేది ఎపిసోడ్‌

Brahmamudi Serial March 19th Episode: బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో రాజ్, కావ్యలతో దాంపత్య వ్రతం చేయించడం అపర్ణకు ఇష్టం లేదని ధాన్యలక్ష్మీ అంటుంది. లేకుంటే పెళ్లి రోజు నగలు ఎప్పుడో ఇచ్చేది అని, ఎవరి మీదో కోపంతో కావ్యకు కోడలి హోదా ఇచ్చిందని ధాన్యలక్ష్మీ అంటుంది. దాంతో ధాన్యలక్ష్మీ అని కోపంతో అరుస్తుంది అపర్ణ. తర్వాత లోపలికి వెళ్లిపోతుంది. చూశారా ఎంత తెలివిగా తప్పించుకుందో అని రుద్రాణి అంటుంది.

కావ్యకు నగలు

నాకు అన్ని తెలివితేటలు లేవమ్మా. లేకుంటే ఇలా ఎందుకు ఉంటాం అని ధాన్యలక్ష్మీ అంటుంది. మీకు తెలివి లేదా.. చాలు ఊరుకోండి. అపర్ణకు కోపం తెప్పిస్తే మీకే నష్టం. ఓపిక పడుతుంది కదా అని రెచ్చిపోకండి. తర్వాత తను తీసుకునే నిర్ణయానికి మీరంతా కట్టుబడాలి అని ఇందిరాదేవి హెచ్చరిస్తుంది. ఇంతలో అపర్ణ నగలు పట్టుకుని వస్తుంది. అవి చూసిన ధాన్యలక్ష్మీ.. ఇంకోసారి ఈ రుద్రాణికి వత్తాసు పలకకూడదు. రెచ్చగొడితే కావ్యను కోడలిగా ఒప్పుకోవట్లే అని చెబుతుంది అనుకున్నా. కానీ, రుద్రాణితో కలిసి ఇలా చేయడంతో కావ్యకు నగలు వచ్చాయి. ఈ రుద్రాణి మొహంపై కాకి రెట్ట వేయా అని అంటుంది.

అపర్ణ వచ్చి కావ్యకు నగలు ఇస్తుంది. పెళ్లిలో తీసుకున్న నగలు.. పెళ్లి రోజునాడు ఇస్తున్నాను. ఇవి నేను స్పెషల్‌గా డిజైన్ చేసినవి. ఇప్పుడు నువ్వు డిజైనర్‌వి కదా. నీకు నచ్చినట్లు కూడా నగలు చేయించుకో అని అపర్ణ అంటుంది. నిజంగానే నాకు నగలు వేసుకోవడం ఇష్టం లేదు. మీ మనుసులో నన్ను కోడలిగా ఒప్పుకున్నా చాలు అని కావ్య అంటుంది. అది మన ఇద్దరి మధ్య విషయం. కానీ నువ్ నగలు తీసుకోకుంటే ఇక్కడ కొన్ని నోళ్లు మూతపడవు. అవి మూతపడాలంటే నువ్ నగలు తీసుకోవాల్సిందే అని అపర్ణ అంటుంది.

ఎందుకు వచ్చావ్

తీసుకో కావ్య. అత్త నుంచి నగలు వస్తున్నాయి. అంతా శుభమే జరుగుతుంది అని ఇందిరాదేవి అనడంతో కావ్య నగలు తీసుకుంటుంది. తర్వాత అపర్ణ వెళ్లి తన గదిలో ఫ్రస్టేట్ అవుతుంటుంది. ఇంతలో కావ్య వస్తే.. ఆగు.. నా గదిలోకి రావడానికి ఎంత ధైర్యం అని అపర్ణ అరుస్తుంది. దాంతో కావ్య వెళ్లిపోతుంటే.. మళ్లీ ఆగమని, ఎందుకు వచ్చావ్, ఎందుకు వెళ్లిపోతున్నావ్ అని అపర్ణ అడుగుతుంది. నాకు సమాధానం దొరికింది. ఈ నగలు కోడలిగా అంగీకరించి ఇచ్చారా. వాళ్లు వేలెత్తి చూపారని ఇచ్చారా అని అడుగుదామని వచ్చాను అని కావ్య అంటుంది.

అక్కడే అడుగుదామని అనుకున్నా. కానీ, సరైన సమాధానం దొరుకుతుందని అనిపించలేదు. గదిలోకి రావొద్దని అన్నారు అంటే.. మీ మనసులో నాకు చోటు ఎక్కడిది అని కావ్య అంటుంది. నువ్ చాలా తెలివైనదానివి. అక్కడ అడగనందుకు. ఇక్కడ అడగనందుకు. నా తోడి కోడలు, ఆడ పడుచు అన్నదనో కాదు.. నా పెద్దరికం పోకూడదని నీకు నగలు ఇచ్చాను. వాళ్లకు నేను సంజాయిషీ ఇచ్చుకోలేను. వారికి మాట్లాడే అవకాశం ఇవ్వొద్దని ఇచ్చాను అంతే అని అపర్ణ అంటుంది.

కోడలిగా అంగీకరించకున్నా

మరి ఈ నిరాధారమైన నగలు నేను వేసుకోవడం దేనికి. నేను ఎందుకు వేసుకోవడం అని కావ్య అంటుంది. వేసుకోవాలి. నీకు ఇష్టం ఉన్నా లేకున్నా. నీకు నగలు ఇవ్వకుంటే వాళ్ల నోళ్లు మూతపడవు. నువ్ వేసుకోకుంటే మళ్లీ వాళ్లు అనే మాటలకు సంజాయిషీ ఇవ్వలేను. నీకు నగలు ఇవ్వడం నా బాధ్యత. వేసుకోవడం నీ కర్తవ్యం అంతే. నిన్ను నా కోడలిగా అంగీకరించకపోయినా ఈ ఇంట్లో నీకు ఎలాంటి ఇబ్బంది రాలేదు కదా. అందుకు సంతోషించు. ఇక వెళ్లు అని అపర్ణ అంటుంది. దాంతో కావ్య వెళ్లిపోతుంది.

తర్వాత అప్పు ఒక్కచోట ఉండి తినడం లేదని, పోలీస్ అంటే డిసిప్లిన్‌గా ఉండాలని కనకం ఏదో ఒకటి అంటుంది. ఇంతలో కావ్య కాల్ చేసి.. సాయంత్రం ఫంక్షన్ ఉంది. పెళ్లి రోజు కదా అని చెబుతుంది. మరి అల్లుడు గారిలో మార్పు వచ్చిందా అని కనకం అడిగితే.. హా వచ్చింది. ఆయనే మీరు కచ్చితంగా ఉండాలని చెప్పారని కావ్య అంటుంది. ఇంత సంతోషకర విషయం అలా చెబితావంటే అని కనకం అంటుంది. ఆ సంతోషం ఏదో సాయంత్రం వచ్చి అల్లుడితో పంచుకో అని కావ్య అంటుంది.

అందుకే రావట్లేదేమో

ఆయన నిన్ను భార్యగా అంగీరించిన విషయం చెప్పగానే ఎత్తుకుని ఊరేగుతాను అని కనకం అంటుంది. మరోవైపు ఇంట్లో వ్రతానికి సంబంధించి ఏర్పాట్లు చేస్తుంటారు. ధాన్యలక్ష్మీపై ప్రకాశం పంచ్‌లు వేస్తాడు. దాంతో వెళ్లిపోయిన ధాన్యలక్ష్మీ అపర్ణను ఏదో ఒకటి అంటుంది. రాజ్‌కు వ్రతంపై ఇష్టం లేదేమో అని రుద్రాణి అంటుంది. నువ్ కావ్యపై ప్రేమ ఉన్నట్లు నాటకం ఆడుతున్నట్లు, రాజ్ కూడా నీ ముందు నాటకం ఆడుతున్నాడేమో.. చూసుకో. అందుకే గది నుంచి బయటకు రావట్లేదేమో అని ధాన్యలక్ష్మీ అంటుంది.

అలాంటిదేం లేదు. ఇప్పుడే రాజ్‌ను తీసుకొస్తాను అని అపర్ణ వెళ్లిపోతుంది. తర్వాత రాజ్ వస్తాడు. అందరూ విష్ చేస్తారు. పూజలో వచ్చి కూర్చోమని ఇందిరాదేవి అంటుంది. పూజా ఎప్పుడు అవుతుంది. క్లైంట్స్ వచ్చారు. తొందరగా వెళ్లిపోవాలని రాజ్ అంటాడు. సాయంత్రం మాత్రం ఎలాంటివి పెట్టుకోకు అని ప్రకాశం అంటాడు. నా జీవితానికి సంబంధించిన ముఖ్యమైన విషయం కూడా చెప్పాలి కదా అని రాజ్ అంటాడు. దేవుడా ఆయన మనసులో ఏముంది అని కావ్య భయపడుతుంది.

అదే అసలు పరమార్థం

అసలు వీడు ఏం ఆలోచిస్తున్నాడు అని ఇందిరాదేవి కాస్తా కంగారుపడుతుంది. దాంపత్య వ్రతం వల్ల కలిగే లాభాలు చెబుతాడు పంతులు. ఇద్దరికీ ఐశ్వర్యంతోపాటు అన్యూన్య దాంపత్యం, అనుకూలమైన కాపురం, పుత్ర ప్రాప్తి కలుగుతుంది. జీవితాంతం కలిసి ఉంటామని అగ్ని సాక్షిగా దేవుడి ముందు ప్రమాణం చేయాలి అని పంతులు చెబుతాడు. అది అసలు పరమార్థం. నా మనవడు, మనవరాలు జీవితాంతం సంతోషంగా కలిసి ఉండాలి అని ఇందిరాదేవి అంటుంది.

పంతులు పూజా చేపిస్తాడు. మధ్యలో కంకణం కట్టుకోమని ఇస్తాడు. కావ్, రాజ్ అలాగే చేస్తారు. తర్వాత జీవితాంతం తోడునీడగా కలిసే ఉంటామని, ఎన్ని కష్టాలు వచ్చినా, సమస్యలు వచ్చినా సర్దుకుపోయి కలిసే ఉంటామని ప్రమాణం చేయండి అని హారతి ఇస్తాడు పంతులు. అపర్ణ ఆ హారతి పళ్లెం పట్టుకో అని ఇందిరాదేవి అంటుంది. లేచి ప్రమాణం చేయండి రాజ్ కావ్యకు చెబుతుంది. దాంతో కావ్య రాజ్ ఒకరి మొహాలు మరొకరు చూసుకుంటూ ఉంటారు.

కింద పడేసిన అపర్ణ

అగ్ని సాక్షిగా ప్రమాణం చేయండి అని ఇందిరాదేవి అంటుంది. బ్యాక్ గ్రౌండ్‌లో మంత్రాలు మోగుతాయి. కావ్య చేయి పెడుతుంది. రాజ్ మాత్రం అలాగే ఆలోచిస్తూ ఉంటాడు. కావ్య ఇచ్చిన విడాకులు గుర్తు తెచ్చుకుంటాడు. ప్రమాణం చేయ్యిరా రాజ్ అని ఇందిరాదేవి అంటుంది. అయినా రాజ్ చేయడు. తర్వాత గట్టిగా అంటుంది ఇందిరాదేవి. అప్పుడు రాజ్ చేయి లేపుతాడు. కానీ, అపర్ణకు హారతి పళ్లెం వేడి ఎక్కువ కావడంతో కింద పడేస్తుంది.

దాంతో అంతా షాక్ అవుతారు. అమ్మమ్మ అని కావ్య భయపడుతుంది. కొత్త కర్పూరం కదా అత్తయ్య. పళ్లెం వేడికి చేయి కాలింది అని అపర్ణ అంటుంది. అయ్యయ్యో ప్రమాణం చేయడంకంటే ముందే ఇలా అపశకునం జరిగిందేంటి అని రుద్రాణి అంటుంది. అవన్నీ మూఢ నమ్మకాలు అని కొట్టిపారేస్తుంది ఇందిరాదేవి. మళ్లీ హారతి వెలిగించు అపర్ణ అని ఇందిరాదేవి అంటుంది. ఇంతలో రాజ్‌కు సెక్రటరీ కాల్ చేసి క్లైంట్స్ వెళ్లిపోతా అంటున్నారని చెబుతుంది.

అప్పటి నుంచి

దాంతో రాజ్ మధ్యలోనే అక్కడి నుంచి వెళ్లిపోతాడు. దాంతో ఇలా అయిందేంటి అన్నట్లుగా ఒకరినొకరు చూసుకుంటారు ఇందిరాదేవి, కావ్య. తర్వాత సాయంత్రం.. బెడ్‌పై చీరలన్నీ పరిచి ఉంటాయి. ఏంటిది కావ్య అని ఇందిరాదేవి అడుగుతుంది. ఏం కట్టుకోవాలో.. ఏది తట్టుకోవాలో తెలియట్లేదు అని కావ్య అంటుంది. ఇన్ని తట్టుకున్న నీ గుండె ఇంకోంచెం సమయం ఆగలేవా అని ఇందిరాదేవి అంటుంది. విడాకులు ఇచ్చి వెళ్లిపో అంటారో.. కానుకలు ఇచ్చి ఉండిపో అంటారా. అపశృతి జరిగినప్పటి నుంచి నా మనసు మనసులో లేదు అని కావ్య అంటుంది.

నీ భయం నాకు అర్థమైంది. విడాకులు ఇచ్చేది ఉంటే.. ఈ ఫంక్షన్‌కు ఒప్పుకునేవాడు. నీ ఇంట్లోవాళ్లను రమ్మని చెప్పడు. ఎలాంటి కల్మషం లేకుండా ప్రశాంతంగా ఉండు. ఏమైనా మిమ్మల్ని కలిపేందుకు నేను ఉన్నాను. పెళ్లి అనే తంతు ఉంది. బ్రహ్మముడి ఉంది. వాడిని నీ నిస్వార్థమైన మారుస్తుంది అని ఇందిరాదేవి అంటుంది. నేను ఒక సాధారణమైన అమ్మాయిని. అలాగే ఇంట్లోకి అడుగుపెట్టాను. ఆరోజు నుంచి ఈరోజు దాకా ఆయనలో మార్పు కోసం చూస్తూనే ఉన్నాను అని కావ్య అంటుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

అందరిముందు విడాకులు

బ్రహ్మముడి తర్వాతి ఎపిసోడ్‌లో కావ్య, రాజ్ మ్యారేజ్ యానివర్సరీ డెకరేషన్స్, స్టేజ్ చూపిస్తారు. కనకం, అప్పు, కృష్ణమూర్తి వస్తారు. కావ్యను చూసి సంతోషపడతారు. ఇంతలో రాజ్ కారులో వస్తాడు. వాడిని చూడు ఆ మొహం చూస్తుంటే మనసులో ఉన్న ప్రేమను బయటపెట్టేందుకు వస్తున్నట్లు లేదు అని ఇందిరాదేవి అంటుంది. తర్వాత జేబులోనుంచి పేపర్స్ తీసి అవి డివోర్స్ పేపర్స్ అని రాజ్ చెబుతాడు. దాంతో ఇందిరాదేవి, కావ్యతోపాటు అంతా షాక్ అవుతారు. కావ్యను స్టేజీపైకి తీసుకెళ్లి నాతో విడిపోయేందుకు కళావతి విడాకుల పేపర్స్‌పై సంతకం చేసి ఇచ్చింది అని రాజ్ చెబుతాడు. దాంతో అంతా షాక్ అవుతారు.

IPL_Entry_Point