Brahmamudi promo: రుద్రాణిని బోల్తా కొట్టించిన క‌ళ్యాణ్ - అప్పు మిస్సింగ్ - అన్న‌య్యే విల‌న్ అని తెలుసుకున్న రిషి-brahmamudi serial latest promo guppedantha manasu next episode promo star maa serial disney plus hotstar ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Brahmamudi Promo: రుద్రాణిని బోల్తా కొట్టించిన క‌ళ్యాణ్ - అప్పు మిస్సింగ్ - అన్న‌య్యే విల‌న్ అని తెలుసుకున్న రిషి

Brahmamudi promo: రుద్రాణిని బోల్తా కొట్టించిన క‌ళ్యాణ్ - అప్పు మిస్సింగ్ - అన్న‌య్యే విల‌న్ అని తెలుసుకున్న రిషి

Nelki Naresh Kumar HT Telugu
Aug 04, 2024 10:16 AM IST

Brahmamudi promo: పెళ్లి వేడుక‌లో అప్పు క‌నిపించ‌దు. అప్పు, క‌ళ్యాణ్ లేచిపోయార‌ని ధాన్య‌ల‌క్ష్మి చెప్పిన‌ట్లుగా బ్ర‌హ్మ‌ముడి ప్రోమోలో చూపించారు. రంగ‌గా శైలేంద్ర‌ను న‌మ్మిస్తూ అన్న‌య్య చేస్తోన్న కుట్ర‌ల‌ను రిషి బ‌య‌ట‌పెట్టిన‌ట్లుగా గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్ ప్రోమోలో క‌నిపిస్తోంది.

బ్ర‌హ్మ‌ముడి ప్రోమో
బ్ర‌హ్మ‌ముడి ప్రోమో

Brahmamudi promo: క‌ళ్యాణ్ అంటే ఇష్టం ఉన్నా కుటుంబ ప‌రువు కోసం త‌న ప్రేమ‌ను త్యాగం చేసేందుకు అప్పు సిద్ధ‌మ‌వుతుంది. ప‌రువు కోసం పాకులాడి నీ జీవితాన్ని నాశ‌నం చేసుకోవ‌ద్ద‌ని అప్పుకు క్లాస్ ఇస్తుంది స్వ‌ప్న‌. అయినా అప్పు విన‌దు. అమ్మనాన్న‌ల సంతోషం కంటే త‌న‌కు ఏది ముఖ్యం కాద‌ని వాదిస్తుంది. క‌ళ్యాణ్ అంటే అప్పుకు ఇష్ట‌మ‌ని అంద‌రికి చెప్పి పెళ్లి ఆపించాల‌ని స్వ‌ప్న అనుకుంటుంది. అలా చేస్తే తాను సూసైడ్ చేసుకుంటాన‌ని స్వ‌ప్న‌ను బెదిరిస్తుంది అప్పు. అయినా విన‌కుండా క‌ళ్యాణ్‌కు ఫోన్ చేస్తుంది స్వ‌ప్న‌.

క‌ళ్యాణ్ మౌనం...

అప్పు నిన్ను ఇప్ప‌టికీ ప్రేమిస్తుంద‌ని, పెళ్లి వేదిక‌లో నీ ఫొటోలే చూస్తూ క‌న్నీళ్లు పెట్టుకుంద‌ని క‌ళ్యాణ్‌కు చెబుతుంది స్వ‌ప్న‌. నువ్వు కూడా అప్పును ప్రేమిస్తున్నావా అని క‌ళ్యాణ్‌ను గ‌ట్టిగా అడుగుతుంది స్వ‌ప్న‌. కానీ క‌ళ్యాణ్ స‌మాధానం చెప్ప‌కుండా సైలెంట్‌గా ఉండిపోతాడు. ఒక‌రి కోసం మ‌రొక‌రు త్యాగాలు చేస్తే మిగిలేది బాధే అంటూ క‌ళ్యాణ్‌కు క్లాస్ ఇస్తుంది స్వ‌ప్న‌.

ధాన్య‌ల‌క్ష్మి, రుద్రాణి టెన్ష‌న్‌...

మ‌రోవైపు క‌ళ్యాణ్...అప్పు పెళ్లిని ఎక్క‌డ చెడ‌గొడ‌తాడో అని ధాన్య‌ల‌క్ష్మి, రుద్రాణి తెగ టెన్ష‌న్ ప‌డుతుంటారు. క‌ళ్యాణ్‌ ను ఇంట్లోనే ఉంచి బ‌య‌ట నుంచి డోర్‌కు లాక్ వేసి పెళ్లికివ‌స్తారు. ఎలాగైనా అప్పును పెళ్లిని చెడ‌గొట్టి క‌ళ్యాణ్‌ను, మ‌ర‌ద‌లిని ఒక్క‌టి చేయాల‌ని రాజ్ ప్లాన్స్ మీద ప్లాన్స్ వేస్తుంటాడు.

సీక్రెట్‌గా పెళ్లి కొడుకు శ్రీరామ్‌ను క‌లిసి అప్పు, క‌ళ్యాణ్ ప్రేమ విష‌యం చెబుతాడు. కానీ రాజ్ మాట‌ల‌ను శ్రీరామ్ న‌మ్మ‌డు. ఇదంతా కావ్య ట్రైనింగ్ అని రాజ్...భార్య‌పై ఫైర్ అవుతాడు. అప్పును సీక్రెట్‌గా పెళ్లి మంట‌పం నుంచి తీసుకెళ్లేందుకు రాజ్ మ‌రో ప్లాన్ వేస్తాడు. అప్పు ప్లేస్‌లో కావ్య వ‌చ్చి రాజ్ ప్లాన్ ను చెడ‌గొట్టేస్తుంది.

అప్పు మిస్సింగ్‌...

పెళ్లి కొడుకు శ్రీరామ్ పీఠ‌ల‌పై కూర్చుంటాడు. పెళ్లి కూతురును తీసుకురావాల‌ని పంతులు అంటాడు. కానీ పెళ్లి కూతురు గ‌దిలో అప్పు క‌నిపించ‌దు. స్వ‌ప్న కంగారుగా అప్పు ఎక్క‌డ అని క‌న‌కాన్ని అడుగుతుంది. గ‌దిలోనే ఉంది క‌దా అని క‌న‌కం స‌మాధానం చెబుతుంది. రూమ్‌లో అప్పు క‌నిపించ‌డం లేద‌నే విష‌యాన్ని అంద‌రి ముందు స్వ‌ప్న బ‌య‌ట‌పెడుతుంది. దాంతో క‌న‌కం, కృష్ణ‌మూర్తితో పాటు కావ్య షాక‌వుతుంది. అంద‌రం అప్పును వెతుకుదామ‌ని అప‌ర్ణ అంటుంది.

అక్క‌డ అప్పు...అక్క‌డ క‌ళ్యాణ్...

ఎక్క‌డ వెతుకుతారు...ఇక్క‌డ అప్పు క‌నిపించ‌డం లేదు...అక్క‌డ క‌ళ్యాణ్ క‌నిపంచ‌డం లేద‌ని ధాన్య‌ల‌క్ష్మి కోపంగా అంటుంది. ఇద్ద‌రు క‌లిసి ఖ‌చ్చితంగా వెళ్లిపోయిఉంటార‌ని అంటుంది. ఆ త‌ర్వాత పెళ్లికొడుకు గెట‌ప్‌లో క‌ళ్యాణ్ కారు డ్రైవ్ చేసుకుంటూ క‌నిపిస్తాడు. అత‌డి ప‌క్క‌న ఉన్నది ఎవ‌ర‌న్న‌ది బ్ర‌హ్మ‌ముడిప్రోమోలో చూపించ‌కుండా మేక‌ర్స్ స‌స్సెన్స్ క్రియేట్ చేశారు.

రిషి షాక్‌...

తాను రంగ‌నేన‌ని శైలేంద్ర‌, దేవ‌యానిల‌ను న‌మ్మిస్తాడు రిషి. అత‌డు రంగానేన‌నుకొని కాలేజీ ఎండీ సీట్ కోసం తాను చేసిన కుట్ర‌లు మొత్తం శైలేంద్ర బ‌య‌ట‌పెడ‌తాడు. అన్న‌య్య నిజ‌స్వ‌రూపం తెలిసి రిషి షాక‌వుతాడు. త‌న‌పై జ‌రిగిన ఎటాక్స్‌, కుట్ర‌ల‌కు శైలేంద్ర‌నే కార‌ణ‌మ‌ని తెలుసుకొని ఎమోష‌న‌ల్ అవుతాడు. తాను రంగాగానే న‌టిస్తూ కాలేజీని కాపాడుకోవాల‌ని నిర్ణ‌యించుకుంటాడు.

స‌రోజ ఎంక్వైరీ...

మ‌రోవైపు రంగాతో వ‌సుధార కూడా క‌నిపించ‌క‌పోవ‌డంతో స‌రోజలో అనుమానం మొద‌ల‌వుతుంది. త‌న‌ను పెళ్లిచూపులు చూడ‌టానికి వ‌చ్చిన ధ‌న్‌రాజ్ ద్వారా రంగా, వ‌సుధార అడ్రెస్ క‌నిపెట్టాల‌ని అనుకుంటుంది. ఆ త‌ర్వాత ఏం జ‌రిగింద‌న్న‌ది సోమ‌వారం నాటి గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్‌లో చూడాల్సిందే.